అలా చేస్తే బ్రెయిన్ పవర్ సూపర్!
న్యూయార్క్: సరైన వ్యాయామం, సమస్యలను పరిష్కరించే సామర్థ్యాలే మెదడును చురుగ్గా ఉంచుతాయంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ మార్క్ డీఎస్పోస్టియో పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. నిత్యం ఎరోబిక్స్, రీజనింగ్ సంబంధిత సమస్యలను పరిష్కరించే వారిలో మెదడు చురుగ్గా ఉంటుందని తేలింది. పరిశోధనల్లో భాగంగా 36 మంది 56-75 ఏళ్ల వయస్సున్న వారిని ఎంచుకున్నారు.
శారీరక వ్యాయామం, రీజనింగ్ అలవాట్ల ప్రకారం వీరిని రెండు గ్రూపులుగా విభజించారు. మెదడులో రక్తప్రసరణ ఆధారంగా వారి పనిని పర్యవేక్షించారు. శారీరక వ్యాయామం చేసే గ్రూపులో మెదడు రక్తప్రసరణ చురుగ్గా ఉండటాన్ని గమనించారు. రీజనింగ్ సమస్యలను పరిష్కరించే వారి మెదడులో రక్తప్రసరణ మరింత చురుగ్గా ఉండటాన్ని గమనించారు. వ్యాయామం చేసేవారితో పోల్చినపుడు రీజినింగ్ సభ్యుల్లో రక్తప్రసరణ వేగం 7.9 అధికంగా నమోదవడాన్ని గుర్తించారు.