భవనాలను చల్లబరిచే సరికొత్త పదార్థం! | new material Cooling towers ! | Sakshi
Sakshi News home page

భవనాలను చల్లబరిచే సరికొత్త పదార్థం!

Published Sun, Feb 5 2017 12:54 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

భవనాలను చల్లబరిచే సరికొత్త పదార్థం!

భవనాలను చల్లబరిచే సరికొత్త పదార్థం!

లాస్‌ ఏంజెలిస్‌: భవనాలను, కార్లను ఎండ వేడిమి నుంచి కాపాడే ఓ పదార్థాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది సన్నగా, తక్కువ బరువుతో మనకెలా కావాలో అలా ఉపయోగించుకునేలా ఉంటుంది. దీన్ని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ‘నియర్‌–పర్‌ఫెక్ట్‌  బ్రాడ్‌బ్యాండ్‌ అబ్సార్బర్‌’ అని పేరు పెట్టారు.

ఇది ఎండ వేడిమిని ఏ కోణం నుంచి అయినా అడ్డుకోగలదు. ఎండ వేడిమిని పూర్తిగా అడ్డుకోగల పదార్థాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా అవి ఎక్కువ బరువుతో ఉండి, వంచినప్పుడు విరిగిపోయే స్థితిలో ఉంటాయి. వాటిని లోహాలతో చేయడం వల్ల ఈ సమస్య ఎదురయింది. వీటి తయారీలో లోహాన్ని కాకుండా ఎలా కావాలంటే అలా మార్చుకోదగ్గ జింక్‌ ఆక్సైడ్‌ను వాడి సమస్యను అధిగమించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement