పెంకులకు పూత తో పొగమంచుకు చెక్...
వాయు కాలుష్యాన్ని నివారించేందుకు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు కొత్త ఐడియా కనుగొన్నారు. ఇళ్ల పైకప్పులపై ఓ పూత పూస్తే చాలు.. పొగమంచును చాలావర కూ తొలగించవచ్చని వారు చెబుతున్నారు. పైకప్పు పెంకులపై టిటానియం డయాక్సైడ్ మిశ్రమం పూతను పూస్తే గనక.. వాతావరణంలో పొగమంచు ఏర్పడేందుకు కారణమవుతున్న నైట్రోజన్ ఆక్సైడ్‌లను విచ్ఛిన్నం చేస్తుందని వారు అంటున్నారు.
ఒక కారు సంవత్సరకాలంలో 17 వేల కి.మీ. దూరం నడిస్తే విడుదలయ్యే నైట్రోజన్ ఆక్సైడ్లను ఒక ఇంటి పైకప్పు పెంకులపై పూసే టిటానియం డయాక్సైడ్ మిశ్రమం 97 శాతం వరకూ తొలగిస్తుందట. సుమారు పది లక్షల పైకప్పులపై ఈ పూతను పూస్తే.. 21 టన్నుల నైట్రోజన్ ఆక్సైడ్‌ను గాలిలో నుంచి తొలగించవచ్చట. ఒక మామూలు ఇంటి పైకప్పుపై ఈ పూతను పూసేందుకు కేవలం 5 డాలర్ల ఖర్చే అవుతుందని, అందువల్ల ఇది ఆర్థికంగా కూడా పెద్దగా భారం కాబోదని పేర్కొంటున్నారు.