నోరు జారిన రాహుల్ గాంధీ
బెర్కెలీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో నోరు జారారు. 'ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ పాత్ ఫార్వాడ్' కార్యక్రమంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ సీట్ల సంఖ్యను తప్పుగా చెప్పారు.
లోక్‌సభలో సీట్లు 545 అయితే 546 సీట్లని రాహుల్ పేర్కొన్నారు. దీంతో రాహుల్‌పై సోషల్‌మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. అంత పెద్ద కార్యక్రమానికి వెళ్తూ ఏం మాట్లాడాలో.. సిద్ధం కాలేదా అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. చిన్న తప్పులతో నెటిజన్లకు రాహుల్ దొరికిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి.