Berkeley
-
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
నోరు జారిన రాహుల్ గాంధీ
బెర్కెలీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాలిఫోర్నియాలో నోరు జారారు. 'ఇండియా ఎట్ 70: రిఫ్లెక్షన్స్ ఆన్ పాత్ ఫార్వాడ్' కార్యక్రమంలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ లోక్‌సభ సీట్ల సంఖ్యను తప్పుగా చెప్పారు. లోక్‌సభలో సీట్లు 545 అయితే 546 సీట్లని రాహుల్ పేర్కొన్నారు. దీంతో రాహుల్‌పై సోషల్‌మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. అంత పెద్ద కార్యక్రమానికి వెళ్తూ ఏం మాట్లాడాలో.. సిద్ధం కాలేదా అంటూ ట్వీట్లు వెల్లువెత్తాయి. చిన్న తప్పులతో నెటిజన్లకు రాహుల్ దొరికిపోయిన సంఘటనలు చాలానే ఉన్నాయి. -
రణరంగంగా కాలిఫోర్నియా వర్సిటీ
-
రణరంగంగా కాలిఫోర్నియా వర్సిటీ
లాస్ఏంజెలిస్: బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థుల ఆందోళనలతో అట్టుడికింది. వర్సిటీలో ట్రంప్ మద్దతుదారుడు, వివాదాస్పద ఎడిటర్ మైలో ఇనాపొలస్ కార్యక్రమానికి నిరసనగా బుధవారం రాత్రి విద్యార్థులు పెద్దపెట్టున నినదించారు. క్యాంపస్ అద్దాల్ని పగులగొట్టి, ఫర్నిచర్‌ను తగలబెట్టారు. పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారు బాష్పవాయువు ప్రయోగించారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో మైలో కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆందోళనలపై ట్విటర్లో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ వాక్ స్వాతంత్య్రాన్ని అనుమతించకుండా హింసాత్మకంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి నిధులు ఇవ్వబోమని హెచ్చరించారు.