
కాలిఫోర్నియా: 'చికిత్స కన్నా నివారణ మేలు' అనే మాట కరోనాకు సరిగ్గా సరిపోతుంది. మందు లేని ఈ మాయదారి రోగానికి మనం పాటించే జాగ్రత్తలే రక్షగా నిలుస్తాయి. అత్యవసరం కానిదే బయటకు వెళ్లకపోవడం, ముఖ్యంగా మాస్కు ధరించడం, మరీ ముఖ్యంగా ఆరడగుల భౌతిక దూరం పాటించడం. అన్నీ సరే కానీ.. ఆరడుగుల దూరం కరోనాను నిలువరించలేదని బాంబు పేల్చారు సైంటిస్టులు. కొన్నిసార్లు కరోనా వైరస్ కణాలు సుమారు 20 అడుగుల దూరం వరకు ప్రయాణించవచ్చని హెచ్చరిస్తున్నారు. సాంత బర్బరాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని వెల్లడించారు. (లిఫ్టుల్లో ఎదురెదురుగా నిలబడొద్దు)
వైరస్ వ్యాప్తిని నిర్దేశించే వాతావరణం!
ఈ అధ్యయనం ప్రకారం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, కొన్నిసార్లు మనిషి సాధారణంగా మాట్లాడే సమయంలోనూ నోటి నుంచి దాదాపు 40 వేల బిందువులు సెకనుకు వంద మీటర్ల మేర వ్యాప్తి చెందుతాయి. ఈ బిందువులను అధ్యయనకారులు రెండు రకాలుగా విభజించారు. పెద్ద పరిమాణంలో ఉండే స్థూల కణాలు తక్కువ దూరం ప్రయాణించి అక్కడే స్థిరపడుతాయి. కానీ సూక్ష్మ కణాలు వైరస్‌ను ఎక్కువ దూరం మోసుకెళ్లే సామర్థ్యం ఉండటంతో పాటు కొన్ని గంటల పాటు గాలిలోనే ఉండగలవన్న విషయాన్ని వెల్లడించారు. వాతావరణంలోని మార్పులు వైరస్ వ్యాప్తిని మరింత ప్రభావితం చేసే అవకాశముందని పేర్కొన్నారు. అమెరికాలోని సీడీసీ(సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) సూచించిన ఆరు అడుగుల భౌతిక దూరం అన్ని వేళలా పనిచేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు. చల్లని వాతావరణంలో వైరస్ కణాలు ఆరు అడుగులే కాకుండా ఆరు మీటర్ల(19.7 అడుగులు) వరకు వ్యాపిస్తాయని తెలిపారు. (ఎందుకు.. ఏమిటి.. ఎలా? )
Comments
Please login to add a commentAdd a comment