అరబిక్ మాట్లాడినందుకు దించేశారు | Pushed out From the plane | Sakshi
Sakshi News home page

అరబిక్ మాట్లాడినందుకు దించేశారు

Published Tue, Apr 19 2016 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

Pushed out From the plane

లాస్ ఏంజెలిస్: ఓ ముస్లిం విద్యార్థి తన అంకుల్‌తో అరబిక్‌లో మాట్లాడినందుకు విమానంలో నుంచి దించేశారు.  కాలిఫోర్నియా వర్సిటీకి చెందిన మఖ్‌జూమి లాస్‌ఏంజిలిస్ నుంచి ఓక్లాండ్‌కు వెళ్లేందుకు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానమెక్కాడు. తర్వాత.. ముందురోజు ఐరాస కార్యదర్శి బాన్‌కీమూన్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నట్లు, ఇస్లామిక్ స్టేట్ గురించి ప్రశ్న కూడా సంధించినట్లు చెప్పాడు. ఫోన్ సంభాషణ అనంతరం ముస్లిం సంప్రదాయం ప్రకారం అరబిక్ భాషలో ‘ఇన్‌షా అల్లా’ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇది విన్న తోటి ప్రయాణికురాలు భయంతో పరుగులు తీసింది. సిబ్బంది అతన్ని దించేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement