కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు.
బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్‌వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చారు మైకి హోతి.
మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్‌లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది.
Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk
— Mikey Hothi (@mikey_hothi) December 23, 2022
ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్!
Comments
Please login to add a commentAdd a comment