California City
-
అమెరికాలో భారత సంతతి వ్యక్తి ఘనత.. తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్
కాలిఫోర్నియా: భారత సంతతికి చెందిన మైకి హోతి అనే వ్యక్తి అమెరికాలో అరుదైన ఘనత సాధించారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ‘లోది’ నగర మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర చరిత్రలోనే తొలి సిక్కు మేయర్‌గా రికార్డ్ సృష్టించారు. మాజీ మేయర్ మార్క్ చాండ్లర్స్ పదవీ కాలం పూర్తవగా నవంబర్‌లో ఎన్నికలు జరిగాయి. మేయర్ ఎన్నిక కోసం బుధవారం భేటీ అయ్యారు కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్లు. బుధవారం జరిగిన సమావేశంలో.. కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్వుమన్ లీసా క్రెయిగ్.. హోతి పేరును మేయర్‌గా ప్రతిపాదించారు. ఆయనను మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. మరోవైపు.. లీసా క్రెయిగ్‌ను ఉప మేయర్‌గా ఎన్నుకున్నారు. అంతకు ముందు మైకి హోతి.. 5వ జిల్లాకు కౌన్సిలర్‌గా, ఉప మేయర్‌గానూ సేవలందించారు. మేయర్‌గా ఎన్నికైన విషయాన్ని స్వయంగా ఆయనే ట్వీట్ చేశారు. ‘ లోది నగర 117వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. ’ అని ట్విట్టర్లో రాసుకొచ్చారు మైకి హోతి. మైకి హోతి తల్లిదండ్రులు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన వారు. ఆర్మ్‌స్ట్రాంగ్ రోడ్లో సిక్కు ఆలయాన్ని స్థాపించడంలో ఆయన కుటుంబం కీలక పాత్ర పోషించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. Honored to be sworn in as the 117th Mayor of the City of Lodi #lodica #209 pic.twitter.com/dgmrYyz5gk — Mikey Hothi (@mikey_hothi) December 23, 2022 ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్! -
యాపిల్ కంపెనీకే షాకిచ్చాడు.. ఏకంగా రూ.140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి!
చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడక మానదు. ఈ మాటే చాలా సార్లు వినే ఉంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది భారతి సంతతికి చెందిన ఉద్యోగికి. అన్నం పెట్టిన కంపెనీకే కన్నం వేశాడు. దొరికినంత దోచుకున్నాడు, అయితే పాపం పండి చివరికి దోషిగా నలుగురిలో నిలబడ్డాడు. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన 52 ఏళ్ల ధీరేంద్ర ప్రసాద్.. కాలిఫోర్నియాలోని యాపిల్ సంస్థలో 2008-18 వరకు పనిచేశాడు. కంపెనీలో దొంగ ఇన్ వాయిస్ లు సృష్టించడం, ఎలక్ట్రానిక్ భాగాలు దొంగిలించడం, కంపోనీలో లేని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం లాంటివి చేశాడు. ఈ మోసం 2011 నుంచి ప్రారంభమై 2018 వరకు కొనసాగించాడు. అలా కంపెనీలో 17 మిలియన్ డాలర్లకు (భారత కరెన్సీ ప్రకారం) పైగా దోచుకున్నాడు. ఎట్టికేలకు ఈ విషయం బయటకు రావడంతో ప్రసాద్ కటకటాలపాలయ్యాడు. కోర్టులో దీనిపై విచారణ జరపగా.. ఇందులో రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎమ్ బేకర్ అనే మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలిపాడు. చివరికి కంపెనీని $17 మిలియన్లకు పైగా మోసం చేసినట్లు కోర్టులో అంగీకరించాడు. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి వాయిదా 2023 మార్చి 14న ఉండనుంది. అంతవరకు ప్రసాద్ పోలీసు కస్టడీలో ఉంచనున్నారు. ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ప్రోగ్రామ్ సహాయంతో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ప్రాసిక్యూషన్ జరిగింది. -
యాపిల్ తిక్క కుదిరింది.. ఉద్యోగులకు రూ.223 కోట్లు చెల్లింపు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తిక్క కుదిరింది. యాపిల్ తన స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు కోర్టు ఉత్తర్వుల మేరకు 29.9 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.223 కోట్లు) చెల్లించేందుకు కంపెనీ అంగీకరించింది. ఎనిమిదేళ్ల న్యాయ పోరాటం తర్వాత కోర్టులో ఉన్న ఓ వ్యవహారం కొలిక్కి రావడంతో ఉద్యోగులకు ఈ పరిహారం లభించింది. అసలు విషయానికి వస్తే.. యాపిల్ స్టోర్లలో పనిచేసే ఉద్యోగులకు తమ విధులు ముగించుకొని వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. అయితే, ఈ తనిఖీ ఉద్యోగులు పని సమయం ముగిసిన తర్వాత చేసేవారు. వారేమైనా బ్యాగుల వంటివి తెచ్చుకుంటే వాటిని కూడా నిశితంగా పరిశీలించేవారు. దీని వల్ల స్టోర్ల వద్ద ఎక్కువ సమయం పట్టేది. అయితే, కంపెనీ మాత్రం ఈ సమయానికి ఎటువంటి చెల్లింపులు చేసేది కాదు. ఈ తనిఖీ చేయడానికి పట్టే సమయానికి డబ్బులు చెల్లించకపోవడం అనేది కాలిఫోర్నియా చట్టాన్ని ఉల్లంఘిస్తోందని వారు పేర్కొన్నారు. దీనిపై గళం విప్పిన ఉద్యోగులు 2013లో కోర్టును ఆశ్రయించారు కార్మికులు ఎలక్ట్రానిక్ పరికరాలను దొంగలించి తమ బ్యాగుల్లో దాచకుండా చేయడానికి బ్యాగ్ తనిఖీ అవసరమని యాపిల్ పేర్కొంది. ఈ పాలసీని ఇష్టపడని ఎవరైనా పనికి బ్యాగులను తీసుకురాకూడదని కోర్టులో వాదించింది. 2015లో ఒక న్యాయస్థానం ఉద్యోగుల వ్యాజ్యాన్ని కొట్టివేసింది. కానీ, వారు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత కోర్టు ఇచ్చిన తీర్పు కేవలం కాలిఫోర్నియాలోని 52 యాపిల్ స్టోర్లలో కార్మికులను మాత్రమే వర్తించింది. ఈ యాపిల్ స్టోర్లలో 14,683 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి 1,286 డాలర్లు లభిస్తాయని న్యాయవాదులు కోర్టు ఫైలింగ్ లో తెలిపారు. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుపై మాట్లాడటానికి యాపిల్ నిరాకరించింది. డిసెంబర్ 2015లో ఉద్యోగులను తనిఖీ చేసే విధానాన్ని నిలిపివేసినట్లు కంపెనీ ఒప్పందంలో తెలిపింది. (చదవండి: ఆర్బీఐ రిటైర్డ్ ఉద్యోగినే బురిడీ కొట్టించిన కేటుగాడు!) -
ఆకాశంలో శాంతి చిహ్నం
అమెరికన్ రాక్ బ్యాండ్ సంస్థ ‘గ్రేట్ఫుల్ డెడ్’ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శనివారం కాలిఫోర్నియా నగరంలోని శాంతి చిహ్నం ఆకారం ఏర్పడేలా ఆకాశంలో చక్కర్లు కొడుతున్న విమానం. లెవీస్ స్టేడియం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఈ రాక్ బ్యాండ్ సంస్థ 1965 లో శాన్ఫ్రాన్సిస్కో నగరంలో ఏర్పాటైంది. రాక్, ఫోక్, బ్లూ గ్రాస్, రెగ్గే, కంట్రీ, స్పేస్ రాక్, జాజ్ వంటి పలు రకాల మ్యూజిక్ వైవిధ్యాలను ప్రదర్శించడంలో గ్రేట్ఫుల్ డెడ్ బృందం పేరుగాంచింది.