
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.
ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు.
ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా..
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment