GURUNANAK
-
Guru Nanak Jayanti: కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతి ఎందుకు చేస్తారంటే..
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. ఈ నెలలో పూజలు, వ్రతాలు, నోములు చేస్తుంటారు. ఇదే మాసంలోని ఈరోజు (నవంబర్ 15)కు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజున దేవ్ దీపావళి, కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి మూడు పర్వదినాలు కలసి వచ్చాయి. అయితే కార్తీక పౌర్ణమి నాడే గురునానక్ జయంతిని ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే..గురునానక్ జయంతి సిక్కులకు ఎంతో ముఖ్యమైన పండుగ. దీనిని సిక్కులు ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. దీనిని ‘గురుపర్వ’ లేదా ‘ప్రకాశ పర్వ’ అని కూడా అంటారు. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ ఈరోజునే జన్మించారు. ఆయన సిక్కుల మొదటి గురువు. గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది. సిక్కులు గురునానక్ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ రోజున గురుద్వారాలలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తారు.ఈ సంవత్సరం సిక్కులు గురునానక్ దేవ్ 555వ జయంతిని జరుపుకుంటున్నారు. ఆయన 1469వ సంవత్సరంలో కార్తీక పూర్ణిమ రోజున జన్మించారని చెబుతుంటారు. అందుకే ప్రతీయేటా గురునానక్ జయంతిని కార్తీక పూర్ణిమ రోజున జరుపుకుంటారు. గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు సిక్కులు ‘అఖండ పాత్’నిర్వహిస్తారు. గురుగ్రంథ సాహిబ్‌ను 48 గంటలపాటు నిరంతరం పఠిస్తారు.గురునానక్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ రోజు ఉదయాన్నే నగర కీర్తన నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కులు గురు గ్రంథ్ సాహిబ్‌ను పల్లకిలో మోస్తూ, షాబాద్ కీర్తనను ఆలపిస్తూ నగరంలో ఊరేగింపు నిర్వహించారు. ఈరోజంతా గురుద్వారాలలో కీర్తనలు ఆలపించనున్నారు. గురునానక్ దేవ్ బోధనలపై సిక్కు మత పెద్దలు ఉపన్యసించనున్నారు.గురునానక్ జయంతి రోజున గురుద్వారాలలో ప్రత్యేక ‘లంగర్’(అన్నదానం) నిర్వహించనున్నారు. దీనిలో అన్ని మతాలవారు కలిసి భోజనం చేస్తారు. ఇది సమాజానికి సమానత్వం, సౌభ్రాతృత్వం అనే సందేశాన్ని అందిస్తుంది. గురునానక్.. సమానత్వం, ప్రేమ, సేవ నిజాయితీలు అందరిలో ఉండాలనే సందేశాన్ని అందించారు. కులమతాలకు అతీతంగా అందరూ సోదరభావంలో మెలగాలని గురునానక్ తెలియజేశారు.ఇది కూడా చదవండి: Karthika Pournima: కార్తీక పౌర్ణమి విశిష్టత..! త్రిపుర పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారు? -
సీఎం జగన్‌తో సిక్కు మత పెద్దలు భేటీ
-
సిక్కు మత పెద్దలకు సీఎం జగన్ కీలక హామీ
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో సిక్కు మత పెద్దల విజ్ఞప్తిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. - సిక్కుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్. - గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు విజ్ఞప్తిపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. ఈ క్రమంలో గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. - గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు పూజారులు, పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. - గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు ప్రకటనపై సీఎం జగన్ అంగీకారం తెలిపారు. - వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేస్తామని స్పష్టం చేశారు. - ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు సహాయం అందిస్తామన్నారు. - వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. - పారిశ్రామికంగా కూడా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో చర్యలు ఉండాలని సీఎం జగన్ సూచించారు. 10 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇది కూడా చదవండి: విద్యార్థుల తరలింపు సీఎం జగన్ కృషి వల్లే సాధ్యమైంది: ముత్యాలరాజు -
Hyderabad: సిక్కుల ర్యాలీ: పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
గురుపూరబ్ ఉత్సవాలకు రండి
సాక్షి, అమరావతి: గురుసింగ్ సహ ధర్మ ప్రచార్ కమిటీ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈనెల 30న గురునానక్ జయంతి సందర్భంగా నిర్వహించే గురుపూరబ్ ఉత్సవాలకు హాజరు కావాలని వారు సీఎంను ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వానపత్రికను అందజేశారు. విజయవాడ గురునానక్ కాలనీలోని గురుద్వార్‌లో జరిగే ఉత్సవాలకు రావాలని వారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు. ► స్త్రీ సత్ సంఘ్ (మహిళా విభాగం) అధ్యక్షురాలు కులదీప్ కౌర్ మాతాజీ, సిక్కు కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఎస్ హర్మిందర్ సింగ్, శ్రీ గురుసింగ్ సభ అధ్యక్షులు ఎస్ కన్వల్జిత్ సింగ్, పింకి హర్విందర్ సింగ్ తదితరులు సీఎం వైఎస్ జగన్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ► విజయవాడ తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి దేవినేని అవినాష్ ముఖ్యమంత్రిని కలిశారు. సీఎంను కలిసిన ‘కియా’ ప్రతినిధులు కియా మోటార్స్ ప్రతినిధులు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. కియా మోటార్స్, ఇండియా ఎండీ కూక్ హ్యూన్ షిమ్, కియా మోటార్స్ లీగల్ హెచ్‌వోడీ జుడే లి, ప్రిన్సిపల్ అడ్వైజర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి తదితరులు సీఎంను కలిశారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కియా మోటార్స్ ప్రతినిధులు -
మహా గురుద్వారా నిర్మాణానికి సాయం చేస్తాం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సిక్ సొసైటీ కోసం వెస్ట్రన్ పార్ట్‌లోని మోకిలాలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడి అతిపెద్ద గురుద్వారా నిర్మించడానికి సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో గురునానక్ 550వ జయంతి వేడుకలను పురస్కరించుకొని గురుద్వారా ప్రబంధక్ కమిటీ ప్రతినిధులు గురుచరణ్ సింగ్ బగ్గా, బల్దేవ్సింగ్ బగ్గా ఆధ్వర్యంలో బహిరంగ సభ, భజన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం గురునానక్ తెలుగు సందేశ పుస్తకాన్ని మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ రామ్మోహన్, కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ ఆవిష్కరించారు. గురునానక్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం సెలవుగా ప్రకటించి గౌరవించిందని కేటీఆర్ తెలిపారు. సిక్ చావని సమస్యలను తెలంగాణ సిక్ సొసైటీ, తేజ్‌దీప్‌కౌర్‌తో కలసి వస్తే చర్చించి పరిష్కరిస్తామన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాలను, మతాలను గౌరవిస్తూ వారి పండుగలను ఘనంగా జరుపుకోవడానికి సాయం అందిస్తున్నామన్నారు. రోటరీ క్లబ్ నిర్వహించిన రక్తదాన శిబిరంలో 71 మంది సిక్కులు రక్తదానం చేశారు. రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో గురునానక్ జీవిత చరిత్ర తెలిపేలా ఫొటో ప్రదర్శన నిర్వహించింది. -
వినయమే రక్షణ కవచం
విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మతం లేదు. అతడు ఏ మతానికీ చెందిన వాడు కాదు. అతడు కాలానికి అతీతుడు. జనన మరణ చక్రానికి మించినవాడు. సృష్టికర్త ఈ విశ్వంలో ప్రతి ఒక్కరికీ ఆహారమూలాన్ని సృష్టించాడు. రాతిలోని పురుగుకు కూడా ఆహారాన్ని ఉంచాడు. మనిషికి పుట్టుక ఎంత సహజమో మరణమూ అంతే సహజం. ఈ ప్రపంచం తాత్కాలిక నివాసం... అని సృష్టికర్త తత్వాన్ని బోధించాడు గురు నానక్. గురు నానక్ దేవుడిలో ఏకత్వాన్ని విశ్వసించాడు. నానక్ గొప్ప కవి, సంగీతకారుడు, తత్వవేత్త, శాస్త్రాలను ఔపోశన పట్టిన వాడు.నానక్ హిందూ కుటుంబంలో పుట్టాడు. అయితే ఆయన తనను తాను ఒక మతానికి పరిమితం చేసుకోలేదు. అన్ని మతాలలో ఉన్న మంచి బోధనలను స్వీకరించి తనను తాను మహోన్నతమైన వ్యక్తిగా మలుచుకున్నాడు. తాను నమ్మిన మంచిని ఇతరులకు బోధించాడు. ‘మనం తినే దాన్ని ఇతరులతో పంచుకోవాలి. అవసరమైన వ్యక్తికి సహాయం చేయాలి. మనిషి తాను బతకడానికి డబ్బు సంపాదించాలి. అయితే అది దోపిడీ, మోసాలతో కూడుకున్నది కాకూడదు. నిజాయితీతో కూడిన సంపాదనతోనే జీవించాలని చెబుతూ... మానవులందరూ సమానమే. కులం, మతం, మత వివక్ష ఉండరాదని గురు నానక్ బోధించాడు. వివిధ వర్గాల ప్రజలను కలిసి కూర్చోమని ప్రోత్సహించాడు. సమసమాజాన్ని ఆకాంక్షించాడు. తాను నమ్మిన విలువలతో కూడిన సమాజ నిర్మాణం కోసం జీవితాన్ని అంకితం చేశాడు. సృష్టికర్తను నిత్యం ప్రార్థించాలి మనిషి తన సొంత ప్రయోజనం కోసం తోటి వ్యక్తిని మోసం చేయకూడదు. అందం, యవ్వనం పట్ల మితిమీరిన మక్కువను పెంచుకోరాదు. అలా మక్కువ పెంచుకున్నవాడు మలమూత్రపు పురుగుగా పుడతాడని హెచ్చరించాడు నానక్. మనిషి తన సంపద, బలం, శక్తి సామర్థ్యాలను చూసుకుని గర్వించరాదని కూడా చెప్పాడు గురునానక్. అలా అహంకరించిన మనిషి విషయంలో అతడి అహంకారమే అతడిని మింగేసే రాక్షసునిగా మారుతుందని చెప్పాడు. నిత్యం సృష్టికర్తను ప్రార్థిస్తూ వినయంగా జీవించాలి.ఆ వినయమే మనిషిని కాపాడే రక్షణ కవచమవుతుందని కూడా బోధించాడు. మనిషి గురువును ఎంచుకోవడంలో విజ్ఞత చూపించాలి. ఇక ఆ గురువే అతడిని నడిపిస్తాడు. సామాన్యుడికి సృష్టికర్తను బోధపరచగలిగిన వాడు గురువు. మనిషి గొప్ప మార్గంలో నడవడానికి, ‘దేవుడు ఉన్నాడు’ అని అనుకోవటానికి అవసరమైన విశ్వాసాన్ని మనిషిలో పాదుకొల్పగలిగిన వాడే గురువు అని గురువు ప్రాధాన్యతను వివరించాడు గురునానక్. – రవీందర్ కౌర్ -
కారిడార్ కల సాకారం
సిక్కుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సిక్కు మత సంస్థాపకుడు గురునానక్ 550వ జయంతి రోజైన శనివారం కర్తార్‌పూర్ కారిడార్ మొదలుకాబోతోంది. పంజాబ్‌లో ఉన్న దేరా బాబా నానక్ దేవాలయం నుంచి పాకిస్తాన్ గడ్డపై ఉన్న కర్తార్‌పూర్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాకు సిక్కు యాత్రీకులు నేరుగా వెళ్లేందుకు వీలుకల్పించే ఈ కారిడార్ వల్ల ఎంతో డబ్బు, సమయం ఆదా అవుతాయి. శతాబ్దాలుగా కోట్లాదిమందికి మార్గనిర్దేశం చేస్తున్న సమున్నత సామాజిక, సాంస్కృ తిక ధారకు గురునానక్ ఆద్యుడు. సిక్కుల తొలి సమష్టి జీవన వ్యవస్థను ఆయన కర్తార్‌పూర్‌లోనే ప్రారంభించారు. తన చివరి రోజులు కూడా అక్కడే గడిపారు. అందువల్లనే అది సిక్కులకు అత్యంత పవిత్ర క్షేత్రం. దురదృష్టవశాత్తూ విభజన సమయంలో రావి నదికి అటువైపున్న కర్తార్‌పూర్ ప్రాంతం పాకిస్తాన్ పరిధిలోనికి వెళ్లింది. భారత్–పాక్ సరిహద్దునుంచి కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దర్బార్ సాహిబ్... పంజాబ్‌లోని దేరా బాబా నానక్ దేవాలయం సమీపం నుంచి బైనాక్యులర్స్‌తో చూస్తే స్పష్టంగా కనబడుతుంటుంది. ఆ పవిత్ర క్షేత్రాన్ని స్వయంగా వెళ్లి, సందర్శించుకోలేనివారి కోసం అక్కడ ఎత్తయిన వేదిక నిర్మించారు. గట్టిగా పావుగంట కూడా పట్టని ప్రయాణం కాస్తా ఇరు దేశాల మధ్యా నెలకొన్న సమస్యల కారణంగా భక్త జనానికి వ్యయప్రయాసలు మిగిలిస్తోంది. కర్తార్‌పూర్ వెళ్లదల్చుకున్నవారు ముందు లాహోర్ వరకూ వెళ్లాలి. అక్కడినుంచి కర్తార్‌పూర్ చేరుకోవాలి. ఇదంతా 125 కిలోమీటర్ల దూరం. ఇతర లాంఛనాలు సరేసరి. ఏమైతేనేం... ఇన్నాళ్లకు కర్తార్‌పూర్ కారిడార్ మొదలవుతోంది. ఇరు దేశాల మధ్యా ఇప్పుడున్న పొరపొచ్చాల నేపథ్యంలో ఇది లేవనెత్తే ప్రశ్నలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సైన్యం ప్రవర్తన గురించి చెప్పుకోవాలి. అక్కడ ప్రభుత్వం గొంతు ఒకలా, పాక్ సైన్యం వైఖరి మరొకలా కనబడుతూ మన ప్రభుత్వానికి, సిక్కు భక్త జనానికి అయోమయాన్ని కలిగించాయి. పంజాబ్ నుంచి వచ్చే సిక్కులకు ఎలాంటి పత్రాలు అవసరం లేదని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ప్రక టించారు. కానీ పాక్ సైన్యం ఇక్కడికొచ్చేవారందరికీ భారతీయ పాస్‌పోర్టులు ఉండి తీరాలని చెప్పింది. ఈ నిబంధన పాటిస్తే కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయని మన దేశం భావిస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఈ పాస్‌పోర్టుల ఆధారంగా డేటాబేస్ రూపొందిస్తుందని, దీన్ని పాక్‌లోని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునే ప్రమాదం ఉన్నదని సందేహిస్తోంది. ఈ నిర్మాణం హడావుడిగా పూర్తి చేయడంపైనా అనుమానాలున్నాయి. కొన్ని నెలలక్రితం ఖలిస్తాన్ సంస్థలుగా చెప్పుకున్న కొన్ని 2020లో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించాయి. ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్‌ను అంతర్జాతీయంగా హోరెత్తించడం ఈ రిఫరెండం ఉద్దేశం. అది ఏదో మేర జరిగినట్టు అందరినీ నమ్మించాలంటే ఈ కారిడార్ ప్రారంభం అత్యవసరమని పాక్ సైన్యం భావిస్తున్నట్టు అనుమానాలున్నాయి. ఇవి కేవలం అనుమానాలే అని కొట్టిపారేయడానికి వీల్లేని రీతిలో పాకిస్తాన్ తీరుతెన్నులున్నాయి. కర్తార్‌పూర్ సందర్శనపై రూపొందించిన వీడియోలో ఉద్దేశపూర్వకంగా ఖలి స్తాన్ ఉద్యమ నాయకుడు భింద్రన్‌వాలే, మరో ఇద్దరు ఉన్న పోస్టర్ కనబడేలా పెట్టడం ఇందుకొక ఉదాహరణ. అంతేకాదు...దర్బారాసాహిబ్ గురుద్వారా వద్ద ఒక చిన్న స్తంభం నిర్మించి అందులో ఒక అద్దాల బాక్స్ అమర్చి, ఒక బాంబును ప్రదర్శనగా పెట్టారు. దానికింద ‘1971లో భారత సైన్యం ప్రయోగించిన బాంబు’ అంటూ ఒక వ్యాఖ్యానం ఉంచారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేసే ఉద్దేశంతో ప్రయోగించిన బాంబు పక్కనున్న బావిలో పడటంతో పెను ముప్పు తప్పిందని, ఇది వాహేగురు జీ సంకల్పబలమని ఆ స్తంభానికి పక్కనున్న శిలాఫలకంపై రాశారు. క్షేత్ర సందర్శకుల్లో భారత్ పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడమే దీనంతటి ఉద్దేశమని వేరే చెప్పనవసరం లేదు. కర్తార్ పూర్లో సిక్కులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని మరో అసంబద్ధ నిబంధన విధించింది. నిజానికి గురునానక్‌ను అనుసరించేవారు అన్ని మతాల్లోనూ ఉన్నారు. స్వర్ణదేవాలయంతో సహా సిక్కు గురుద్వారాలేవీ తమ మతస్తులను మాత్రమే అనుమతిస్తామన్న నిబంధన విధించవు. కేవలం శిరసుపై ఆచ్ఛాదన ఉంటే చాలు... ఏ మతాన్ని అవలంబించేవారికైనా గురుద్వారాల్లో ప్రవేశం ఉంటుంది. ఒకపక్క దర్బారా సాహిబ్‌ను సందర్శించుకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించా మని చెప్పుకుంటూనే ఆ మత విశ్వాసాలకూ, దాని విశాల దృక్పథానికీ భిన్నంగా ఆంక్షలు విధిం చడం, ఆలయ ప్రాంగణంలో తప్పుడు ప్రచారానికి దిగడం పాక్ దురుద్దేశాలకు అద్దం పడుతోంది. మొత్తానికి కర్తార్‌పూర్ కారిడార్ సాకారం కావడం శుభసూచకమే అయినా మన నిఘా వ్యవ స్థలూ, సైన్యం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పెంచింది. అసలు కర్తార్‌పూర్ సుల భంగా వెళ్లి రావడానికి ఇన్ని దశాబ్దాల సమయం పడుతుందని, రాకపోకలపై ఇన్ని ఆంక్షలుం టాయని విభజన సమయంలో ఎవరూ అనుకోలేదు. రావి నదికి ఆవలనున్న ఆ ప్రాంతానికి వంతెన దాటి వెళ్లేవారు. కానీ రాను రాను ఇరు దేశాల మధ్యా ఉద్రిక్తతలు పెరిగి, చివరకు 1965 నాటి యుద్ధంలో ఆ వంతెన ధ్వంసం కావడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. అసలు అక్కడి ప్రార్థనా మందిరం బాగోగుల్ని పాక్ ఎప్పుడూ పట్టించుకోలేదు. 1999లో అప్పటి ప్రధాని దివం గత వాజపేయి, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ల మధ్య చర్చలు జరిగి ఢిల్లీ–లాహోర్ బస్సు ప్రారం భమైన సందర్భంగా ఈ కారిడార్ గురించి వాజపేయి ప్రతిపాదించారు. అటు తర్వాతే దర్బారా సాహిబ్‌పై పాక్ శ్రద్ధపెట్టింది. కారిడార్ నిర్మాణం పనులు నిరుడు నవంబర్లోనే ప్రారంభమ య్యాయి. ఈ కారిడార్ కొత్త సమస్యలకూ, ఘర్షణలకూ కారణం కానీయరాదని, స్నేహ సంబం ధాలు పెంపొందించుకోవడానికి సమర్థంగా వినియోగించుకోవాలని పాక్ గ్రహించడం అవసరం. -
కర్తార్‌పూర్ యాత్రికులకు పాక్ శుభవార్త
ఇస్లామాబాద్ : సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు పాక్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొదటి రోజు ప్రవేశ రుసుమును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది. గతంలో సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు. తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా భారత్ నుంచి కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు అవసరమైన రెండు చర్యలు తీసుకున్నాం. కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే సరిపోతుందని, పాస్‌పోర్ట్ అవసరం లేదని, పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదని ట్వీట్ చేశారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి రుసుము వసూలు చేయమని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సిక్కులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ప్రతి ఏడాది సిక్కులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. నవంబర్ 9నుంచి కర్తార్‌పూర్ యాత్ర మొదలవనుంది. సిక్కుల గురువైన గురునానక్ దీనిని 1522 లో స్థాపించారు. చదవండి : కర్తార్‌పూర్ ద్వారా పాక్ ఆదాయం ఏడాదికి రూ.259కోట్లు -
వెనక్కి తగ్గని పాక్, ఏడాదికి రూ.259 కోట్లు ఆదాయం
న్యూఢిల్లీ : పంజాబ్‌లోని డేరా బాబా నానక్ మందిరానికి, పాక్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారాకు మధ్య సిక్కు యాత్రికుల రాకపోకలకు సంబంధించి ప్రతిష్టాత్మక కర్తార్‌పూర్ కారిడార్‌ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాంతాల మధ్య రాకపోకలకు సంబంధించి భారత్, పాక్ ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. వీసా అవసరం లేకుండా యాత్రికులు పాక్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లే అవకాశాన్ని ఈ కారిడార్ కల్పిస్తోంది. ప్రతిరోజు దాదాపు 5,000 మంది యాత్రికులను అనుమతించనున్నారు. అయితే ప్రతి యాత్రికుడి నుంచి పాక్ 20 డాలర్లు వసూలు చేసేందుకు నిర్ణయించింది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పాక్ వెనక్కు తగ్గలేదు. దీంతో.. భారతీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని భారత్ ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఈ విషయం అలా ఉంచితే.. సర్వీస్ చార్జీ వల్ల పాక్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి 259 కోట్ల రూపాయలు. దీనికి యాత్రికులు చేసే ఇతరత్రా ఖర్చులు కూడా తోడవనున్నాయి. ఇక్కడికి వెళ్లే యాత్రికులు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నిబంధనల ప్రకారం ప్రయాణికులు గరిష్టంగా రూ. 11వేలు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. ఈ యాత్రకు సంబంధించి ఒక ఆన్లైన్ పోర్టల్ prakashpurb550.mha.gov.inను ఏర్పాటు చేశారు. ఇందులో తమకు కావాల్సిన రోజుల్లో టికెట్లను ఆన్లైన్లో నమోదు చేసుకుంటే ప్రయాణానికి మూడు రోజుల ముందు సమాచారం ఇవ్వబడుతుంది. ఎల్లప్పుడూ ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే పాకిస్థాన్‌కు ఈ రాబడి కొంతమేర రక్షిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సిక్కు యాత్రికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఒప్పందం కుదుర్చుకున్నాయి. సిక్కు మత స్థాపకుడు గురునానక్ దేవ్ 550 జయంతి ఉత్సవాల సందర్భంగా నవంబర్ 9న కర్తార్‌పూర్ కారిడార్ భారత్ - పాక్‌లు సంయుక్తంగా ప్రారంభించనున్నాయి. చదవండి: కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఒక్కొక్కరికి 20 డాలర్లు; పాక్ చర్య సిగ్గుచేటు
న్యూఢిల్లీ : పాకిస్తాన్లో గల కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారా ప్రవేశానికై 20 డాలర్లు వసూలు చేయడం దారుణమని కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. తమ మత విశ్వాసంపై పాక్ వ్యాపారం చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ 550వ జయంతి సందర్భంగా... కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబర్ 9న ప్రారంభించనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌లోని సిక్కు తీర్థ యాత్రికులు వీసా లేకుండా పవిత్ర కర్తార్‌పూర్ సాహిబ్ వెళ్లే అవకాశం లభించింది. అయితే గురుద్వార ప్రవేశానికై ఒక్కో భక్తుడు 20 యూఎస్ డాలర్లు చెల్లించాలని పాక్ పేర్కొంది. అదే విధంగా ఈ కారిడార్‌ను ప్రారంభించడం వల్ల స్థానికులకు ఆతిథ్య రంగంలో ఉపాధి లభిస్తోందని ఇమ్రాన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై స్పందించిన హర్సిమ్రత్ కౌర్ సోషల్ మీడియా వేదికగా ఇమ్రాన్ ఖాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు... ‘ కర్తార్‌పూర్ సాహిబా సందర్శనకు వచ్చే భక్తుల నుంచి 20 డాలర్లు వసూలు చేస్తామని పాక్ చెప్పడం దారుణం. పేద భక్తుల పరిస్థితి ఏంటి? వారు ఎలా అంతమొత్తం చెల్లించగలరు. మా విశ్వాసంతో పాక్ వ్యాపారం చేయాలని చూస్తోంది. ప్రవేశ రుసుం వసూలు చేయడం వల్ల విదేశీ మారకద్రవ్యం పెరిగి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని.. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పడం నిజంగా సిగ్గుచేటు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. కాగా సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్ సాహెబ్ తన జీవితంలోని చివరి 18 ఏళ్ల కాలాన్ని కర్తార్‌పూర్ సాహెబ్ గురుద్వారాలో గడిపారు. 1539లో అక్కడే ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఈ గురుద్వార పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల కర్తార్‌పూర్(భారత్- పాకిస్థాన్ సరిహద్దు నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది) గ్రామంలో ఉంది. ఈ నేపథ్యంలో గురునానక్ 550 జయంతి సందర్భంగా అంతర్జాతీయ సరిహద్దు నుంచి డేరాబాబా నానక్ వరకు కారిడార్ నిర్మాణానికి భారత్ సంకల్పించింది. అటువైపు దార్బర్ సాహిబ్ వరకు కారిడార్‌ను పాక్ చేపట్టింది. The $20 fee each charged by Pak for #KartarpurSahib darshan is atrocious. How will a poor devotee pay this amount? Pakistan has made a business out of faith. @ImranKhanPTI's statement that this fee will boost Pak's economy & result in earning foreign exchange is highly shameful. pic.twitter.com/a0sidEDIPZ — Harsimrat Kaur Badal (@HarsimratBadal_) October 20, 2019 -
కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీ
న్యూఢిల్లీ : గురునానక్ దేవ్ సమాధి నెలకొన్న దర్బార్ సాహిబ్‌ను కలుపుతూ భారత్, పాకిస్థాన్‌లు కర్తార్‌పూర్ కారిడార్ ప్రాజెక్టును సంయుక్తంగా చేపట్టాయి. గురునానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా నవంబర్ 8న కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. డేరా బాబా నానక్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాను అనుసంధానించే 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి నవంబరు 8న ప్రారంభం కానుంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ శనివారం మాట్లాడుతూ.. కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల 8న ప్రారంభిస్తారని చెప్పారు. అంతకుముందు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల సభ్యులతో కూడిన బృందాన్ని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఆహ్వానించారు. పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ఆ రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ పర్వ్ ఉత్సవాలను నవంబరులో నిర్వహిస్తారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్‌పూర్ కారిడార్ గుండా పాకిస్థాన్‌లోని గురు నానక్ గురుద్వారాకు చేరుకుంటారు. పాకిస్థాన్‌లో కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పాల్గొంటారు. అదే రోజు భారతదేశం నుంచి కర్తార్‌పూర్ వెళ్ళే తొలి భక్త బృందంలో పాల్గొనాలని కెప్టెన్ అమరీందర్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్మోహన్ సింగ్ అంగీకరించారు. పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారాకు వెళ్లనున్న తొలి అఖిలపక్ష జాబితా (సిక్కుల ప్రతినిధి బృందం)లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కూడా ఉండనున్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కర్తార్‌పూర్ కారిడార్‌ను వచ్చే నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. గురునానక్ దేవ్ 550వ గురుపూరబ్ సందర్భంగా కారిడార్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
గురునానక్ ప్యాలెస్ కూల్చివేత
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ గురునానక్ ప్యాలెస్‌ను కొందరు దుండగులు కూల్చివేశారు. ఎంతో విలువైన తలుపులు, కిటికీలను కూడా అమ్ముకున్నారు. న్యూలాహోర్ రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలోని బథన్వాలా గ్రామంలో దాదాపు నాలుగు శతబ్దాల క్రితం ఈ ప్యాలెస్‌ను నిర్మించారు. భవనంలో సుమారు 16 పెద్ద పెద్ద గదులు, 4 వెంటిలేటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్యాలెస్‌లో గురు నానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల చిత్ర పటాలు కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ ప్యాలెస్‌ను చూడ్డానికి వస్తారు. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్యాలెస్‌ను కూల్చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే మహ్మద్ అన్వర్ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మహ్మద్ కుటుంబం కొన్ని తరాలుగా ఈ ఇంట్లోనే నివసిస్తున్నారని.. దాంతో వారు ఈ ప్యాలెస్‌ను తమ సొంత ఇంటిగా భావిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్ పాతబడటమే కాక శిథిలావస్థకు చేరటంతో వారే ఈ ప్యాలెస్‌ను కూల్చి వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
‘గురు’ కీర్తన్..