గురునానక్‌ ప్యాలెస్‌ కూల్చివేత | Guru Nanak Palace in Pakistan Punjab Partially Demolished By Locals | Sakshi
Sakshi News home page

కిటికీలు,తలుపులు అమ్ముకున్న దుండగులు

Published Mon, May 27 2019 5:51 PM | Last Updated on Mon, May 27 2019 5:55 PM

Guru Nanak Palace in Pakistan Punjab Partially Demolished By Locals - Sakshi

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ గురునాన‌క్ ప్యాలెస్‌ను కొందరు దుండ‌గులు కూల్చివేశారు. ఎంతో విలువైన తలుపులు, కిటికీలను కూడా అమ్ముకున్నారు.  న్యూలాహోర్‌ రోడ్డుకు 20 కిలోమీటర్ల దూరంలోని బథన్వాలా గ్రామంలో దాదాపు నాలుగు శతబ్దాల క్రితం ఈ ప్యాలెస్‌ను నిర్మించారు.  భవనంలో సుమారు 16 పెద్ద పెద్ద గదులు, 4 వెంటిలేటర్లు ఉన్నట్లు సమాచారం. ఈ ప్యాలెస్‌లో గురు నానక్‌తో పాటు కొందరు హిందూ రాజుల చిత్ర పటాలు కూడా ఉన్నట్లు తెలిసింది.

ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది పర్యాటకులు ఈ ప్యాలెస్‌ను చూడ్డానికి వస్తారు. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్యాలెస్‌ను కూల్చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే మహ్మద్‌ అన్వర్‌ అనే వ్యక్తి ఈ చర్యలకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మహ్మద్‌ కుటుంబం కొన్ని తరాలుగా ఈ ఇంట్లోనే నివసిస్తున్నారని.. దాంతో వారు ఈ ప్యాలెస్‌ను తమ సొంత ఇంటిగా భావిస్తున్నారని తెలిపారు. బిల్డింగ్‌ పాతబడటమే కాక శిథిలావస్థకు చేరటంతో వారే ఈ ప్యాలెస్‌ను కూల్చి వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement