
ఇస్లామాబాద్ : సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు పాక్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మొదటి రోజు ప్రవేశ రుసుమును రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి ఎంట్రీ ఫీజు వసూలు చేయడం లేదని తెలిపింది. గతంలో సిక్కు మత స్థాపకుడు గురునానక్ 550వ జయంతి(నవంబర్ 12) వేడుకలను జరుపకోవడానికి సిక్కులకు అవకాశం కల్పించడం కోసమే 9వ తేదీన కారిడార్‌ను ప్రారంభించినున్నట్టు ఇమ్రాన్ చెప్పారు.
తాజాగా పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా భారత్ నుంచి కర్తార్‌పూర్ సందర్శనకు వచ్చే సిక్కు యాత్రికులకు అవసరమైన రెండు చర్యలు తీసుకున్నాం. కర్తార్‌పూర్ సందర్శించే భారత యాత్రికులకు గుర్తింపు ఐడీ ఉంటే సరిపోతుందని, పాస్‌పోర్ట్ అవసరం లేదని, పది రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్ కూడా అవసరం లేదని ట్వీట్ చేశారు. అలాగే కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఎలాంటి రుసుము వసూలు చేయమని ఆ ట్వీట్‌లో ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని సిక్కులు అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తుంటారు. ప్రతి ఏడాది సిక్కులు అధిక సంఖ్యలో సందర్శిస్తుంటారు. నవంబర్ 9నుంచి కర్తార్‌పూర్ యాత్ర మొదలవనుంది. సిక్కుల గురువైన గురునానక్ దీనిని 1522 లో స్థాపించారు.
చదవండి : కర్తార్‌పూర్ ద్వారా పాక్ ఆదాయం ఏడాదికి రూ.259కోట్లు
Comments
Please login to add a commentAdd a comment