venkayya Naidu
-
ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఎపిసోడ్ పై వెంకయ్యనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
భారతీయ సంస్కృతి.. ప్రపంచానికి దిశానిర్దేశం: వెంకయ్య నాయుడు
ప్రశాంతమైన జనజీవన ప్రవాహానికీ సంస్కృతే ఒరవడి అని, ఉదాత్తమైన భావనల సమాహారమైన భారతీయ సంస్కృతి భవిష్యత్ ప్రపంచానికకి దిశానిర్దేశం చేయగలదని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దసరా దీపావళి పండుగలు సందర్భంగా సింగపూర్ తెలుగు వారందరితో కలిసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా "శ్రీ సాంస్కృతిక కళాసారథి" ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను సంతరింప చేస్తూ భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా హాజరై సింగపూర్ తెలుగు ప్రజలకు, నిర్వాహక బృందానికి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత రెండేళ్ళ కాలంలో సంగీత, నృత్య, సాహిత్య, ఆధ్యాత్మిక, నాటక, సంప్రదాయ కళారంగాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు, ఇతర సభ్యులకు అభినందనలు తెలిపారు. మన భాషా సంస్కృతులను పరిరక్షించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సంస్థలు ఒకే వేదిక మీదకు రావాలని పిలుపునిచ్చారు. ఆత్మీయ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కోశాధికారి వామరాజు సత్యమూర్తి హాజరయ్యారు. సింగపూర్ గాయని గాయకులచే సంప్రదాయక భక్తి గీతాలు, సాయి తేజస్వి, అభినయ నృత్యాలయ వారి నృత్య ప్రదర్శనలు, తేటతెలుగు పద్యాలాపన ప్రేక్షకులందరినీ అలరించాయి. శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపకులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ "తమ సంస్థ 2020లో ప్రారంభమై గత రెండు సంవత్సరాలుగా సుమారు 40 కి పైగా కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా అనేక తెలుగు సంస్థల సమన్వయంతో నిర్వహించిందన్నారు. తమ ద్వితీయ వార్షికోత్సవం వేడుకలను వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జరుపుకోవాలని జూలై నుంచి ఎదురు చూస్తున్నామని ఇన్నాళ్లకు తమ కల నెరవేరిందని" ఆనందం వ్యక్తం చేశారు. సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గం రాధిక మంగిపూడి, రామాంజనేయులు చామిరాజు, భాస్కర్ ఊలపల్లి, శ్రీధర్ భరద్వాజ్, రాంబాబు పాతూరి, సుధాకర్ జొన్నాదుల కలసి వెంకయ్య నాయుడుని అభిమానపూర్వకంగా సత్కరించారు. ఈ కార్యక్రమములో సింగపూర్‌లో ప్రఖ్యాత తెలుగు సంస్థలు, 'తెలంగాణ కల్చరల్ సొసైటీ', 'తెలుగు భాగవత ప్రచార సమితి' 'కాకతీయ సాంస్కృతిక పరివారం' సంస్థ సభ్యులు హాజరై శ్రీ సాంస్కృతిక కళాసారథిని అభినందించారు. -
జనంలో తిరగడమే ఇష్టం
సాక్షి, హైదరాబాద్: తనకు జనంలో తిరగడం, రాజకీయ నాయకుడిగా వారికి సేవ చేయడం ఎంతో ఇష్టమని.. ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా కొన్ని పరిమితులకు లోబడి ఉండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోవడం ఇబ్బందిగా ఉందని ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రాజకీయాలు కూడా ఒకప్పటిలా ఆరోగ్యకరంగా లేవని.. సిద్ధాంతాలు మారిపోయాయని చెప్పారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో యోధా లైఫ్‌లైన్ డయాగ్నొస్టిక్స్ సెంటర్‌ను ఆయన బుధవారం ప్రారంభించారు. వేదికపై ఉన్న కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ఆయన రాజకీయాల నుంచి బయటికొచ్చి మంచిపని చేశారని, మానసిక, శారీరక ప్రశాంతతకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ‘రాష్ట్రపతిగా అవకాశం వస్తే కచ్చితంగా చేపట్టి.. తెలుగువారి కీర్తిని మరింత పెంచాల’ని చిరంజీవి కోరగా.. వెంకయ్యనాయుడు తాను సిద్ధమే అన్నట్టుగా సంకేతం ఇచ్చారు. ‘ఉప రాష్ట్రపతిగా అడ్రస్ మారిందేగానీ నా డ్రస్ మారలేదు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇక్కడి నేలలో ఏదో మహిమ ఉందని, ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న సంస్థలకు మనవారే సీఈవోలుగా ఉన్నారని పేర్కొన్నారు. ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి.. దేశ సంస్కృతి, సంప్రదాయాలు, పద్ధతులు ఆరోగ్యకర జీవనానికి దోహాదపడతాయని.. ప్రజలు ఆరోగ్యం పట్ల దృష్టి సారించాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిలో మన దేశం ముందుందని.. పరిశోధకులు, డాక్టర్లు, వైద్య సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. అయితే కొందరి మోసపూరిత వ్యవహారాలతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని.. అవసరం లేకున్నా టెస్టులు చేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని.. ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కళాశాల పెట్టాలని కేంద్ర ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. చిరంజీవి ట్రస్టుకు రూ.25లక్షలు విరాళం భవిష్యత్‌లో రాబోయే కొన్నిరకాల జబ్బులను జీనోమిక్ టెక్నాలజీతో ముందుగానే తెలుసుకోవచ్చని, అలాంటి వైద్యసేవలు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటం సంతోషకరమని సినీ నటుడు చిరంజీవి అన్నారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ బతికి ఉండేవాడన్నారు. ఈ సందర్భంగా నిరుపేద కళాకారులకు వైద్యపరీక్షల్లో రాయితీ కల్పించాలని చిరంజీవి కోరగా.. ‘మా’ అసోసియేషన్ (సినీ నటుల సంఘం) సభ్యులకు 50 శాతం రాయితీ ఇస్తామని డయగ్నొస్టిక్స్ నిర్వాహకుడు సుధాకర్ కంచికచర్ల ప్రకటించారు. అంతేకాకుండా చిరంజీవి ట్రస్టుకు విరాళంగా రూ.25 లక్షల చెక్కును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి తలసాని చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, చెస్ క్రీడాకారిణి హారిక ద్రోణవల్లి, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, చాముండేశ్వరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: సిక్కుల ర్యాలీ: పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సిక్కు మత గురువు గురునానక్ జయంతి ఉత్సవాల్లో భాగంగా బుధవారం ర్యాలీ జరగనుంది. అశోక్ బజార్ గురుద్వార నుంచి మొదలై మళ్లీ అక్కడికే చేరుతుంది. ఈ నేపథ్యంలో సుల్తాన్ బజార్, చార్మినార్, గోషామహల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఇవి శివాజీ బ్రిడ్జి జంక్షన్, ఆప్జల్ గంజ్ జంక్షన్, రంగ్ మహల్ జంక్షన్, నయాపూల్,శాంతి ఫైర్ వర్క్స్ ప్రాంతాల్లో అమలులో ఉండనున్నాయి. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నా మార్గాలు ఎంచుకోవాలని అధికారులు కోరారు. ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బుధవారం నగరంలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం దిగుతారు. అక్కడ నుంచి గ్రీన్ ల్యాండ్స్‌లోని యోథ డయాగ్నస్టిక్స్‌కు వెళ్తారు. సాయంత్రం 5.50 గంటలకు అక్కడ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం.29 కు వెళ్లనున్నారు. ఆయా సమయాల్లో, ఆయా మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. -
ఉపరాష్ట్రపతిని కలిసిన విజయసాయిరెడ్డి
ఢిల్లీ : వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్ విజయసాయిరెడ్డి బుధవారం ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిశారు. వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులకు సంబంధించిన నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సమర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచాలన్నారు. టీ ఉత్పత్తులకు బ్రాండ్ ప్రమోషన్ చేపట్టడంతో పాటు పొగాకు ఉత్పత్తులపై బ్యాలెన్స్ పద్ధతి రావాలన్నారు. పొగాకు ఉత్పత్తులను కేవలం ఎగుమతుల వరకే పరిమితం చేయాలి.. ఇలా చేయడం వల్ల రైతులకు, రైతుకూలీలకు నష్టం జరగదని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ
హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్రం సుసంపన్న భవిష్యత్ దిశగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అంటూ రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు. (తెలంగాణ అమరవీరులకు కేసీఆర్ నివాళి) రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడు భాషల్లో ట్వీట్ చేశారు. ‘తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. (కేసీఆరే స్టార్) ప్రధాని నరేంద్ర మోదీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను’ అంటూ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను’అంటూ మరో ట్వీట్లో ఏపీ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ప్రజలందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకంక్షలు!! కేసీఆర్ గారి బాటలొ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ప్రతి తెలంగాణ బిడ్డకు వందనం!! ఉద్యమ ప్రస్థానంలో అమరులైన వీరులకు జోహార్లు !!జై తెలంగాణ !! జై జై తెలంగాణ !!’ అంటూ మాజీ ఎంపీ కవిత ట్వీట్ చేశారు. (కలలు నెరవేరుతున్న కాలం) తెలంగాణ రాష్ట్ర సోదర సోదరీమణులకు నమస్కారం! తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతదేశం గర్వించే సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం తెలుగు వారి సొంతం. కష్టపడి పనిచేసే తెలంగాణ ప్రజలు దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయం. — President of India (@rashtrapatibhvn) June 2, 2020 తెలంగాణ ప్రజలకు రాష్ట్రావతరణ దిన శుభాకాంక్షలు. ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నో క్షేత్రాలో తమ ప్రతిభను చాటుతున్నారు. దేశ ప్రగతిలో ఈ రాష్ట్రం ఓ ముఖ్య భూమిక పోషిస్తోంది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి మరియు శ్రేయస్సుకై నేను ప్రార్ధిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. కృషి మరియు పట్టుదల, ఈ సంస్కృతికి మారు పేరు. దేశ పురోభివృద్ధిలో ఈ రాష్ట్ర భూమిక ఎంతో గణనీయమైనది. ఈ రాష్ట్ర ప్రజల అన్ని ప్రయత్నాలూ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. — Narendra Modi (@narendramodi) June 2, 2020 తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, సహజవనరులతోపాటు భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తున్న తెలంగాణ.. వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతితో దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగిస్తూ.. మరింత సమృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana pic.twitter.com/zsTM3HemRF — Vice President of India (@VPSecretariat) June 2, 2020 -
ఉపరాష్ట్రపతితో భేటీ కానున్న చిరంజీవి
న్యూఢిల్లీ: తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా ఈనెల 2న విడుదలై బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దీంతో ఎంతో చరిత్రాత్మాక నేపథ్యం ఉన్న ఈ సినిమాను పలువురు రాజకీయ ప్రముఖుల చేత వీక్షింపచేయాలని మెగాస్టార్ చిరంజీవి భావిస్తున్నారు. దీనిలో భాగంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు చిరంజీవి బుధవారం ఢిల్లీకి పయనమయ్యారు. ఉప రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా ఆయన నివాసంలో ఈ రోజు సాయంత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ప్రదర్శన జరగనున్నది. వెంకయ్యనాయుడితో కలిసి చిరంజీవి సినిమాను వీక్షించనున్నారు. అనంతరం ‘సైరా’ విశేషాలను వారిరువరు చర్చించుకోనున్నారు. అదేవిధంగా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్టు సమాచారం. సైరా సినిమా చూడాలని చిరంజీవి వారిరువురిని కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా ఈనెల 5న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు. అదేవిధంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీతో భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
‘చిగురుమళ్ల’కు అరుదైన గౌరవం
భద్రాచలంటౌన్: ఒకే కవి 101 పుస్తకాలను రచించడం, వాటిని ముద్రించడం, ఒకే వేదికపై అన్నింటినీ ఆవిష్కరించడం ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అరుదైన ఘట్టం. ఇది భద్రాచలం వాసి అయిన కవి చిగురుమళ్ల శ్రీనివాస్‌కు సాధ్యమైంది. ఈ పుస్తకాలను భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఇప్పటివరకు ఒకే కవి రాసిన వంద పుస్తకాలను ఒకేసారి ఆవిష్కరించిన దాఖలాలు లేవు. సుమారు ఐదేళ్ల కఠోరశ్రమ, దీక్షతో ఆయన ఈ పుస్తకాలను ముద్రించారు. ఒక్కో సామాజిక అంశంపై ఒక్కో పుస్తకం చొప్పున ప్రచురించడం విశేషం. అంతేకాక జూలై 6న ప్రపంచ వ్యాప్తంగా 101 శతక పుస్తకాలను 101 వేదికలపై ఒకే రోజు ఆవిష్కరించబోతుండడం మరో విశేషం. శ్రీనివా స్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. మానవీయ విలువలు చాటి చెప్పడం కోసం అమ్మ శతకం, నాన్న శతకం, మేలుకొలుపు, చద్దిమాట వంటి శతకాలను రచించారు. సామాజిక రుగ్మతలపై కూడా తన కలాన్ని ఎక్కుపెట్టారు. మద్యపాన శతకం, ధూమపాన శతకం, గడ్డి శతకం, హారితహారంపై శతకాలు రాయడం ఆయన సృజనాత్మకతకు నిదర్శనం. యువతలో దేశభక్తిని ప్రేరేపించేలా స్వాతంత్య్ర శతకం, భరతబిడ్డ, భరతవీర, వీరభారతి, వీరభూమి, జయభారతి, జాతీయ సమైక్య త, జై జవాన్ వంటి శతకాలను రచించారు. ఇవేకాకుండా అన్నదాత శతకం, పంట పొలము శతకం, సొంత ఊరు శతకం, ఆడపిల్ల శతకం, స్వచ్ఛభారత్ శతకం వంటి గొప్ప సామాజిక ప్రయోజనంతో కూడిన విషయాలపై ఆదర్శవంతమైన కవిత్వం రచించారు. కాగా, ఇంతటి మహోన్నత శతకాలను రచించిన శ్రీనివాస్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. -
ద్రోహంలో ఇద్దరూ భాగస్తులే!
మన నూతన రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడానికి, మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి, మన రాష్ట్రం అవినీతికి, అకృత్యాలకు, అధికార దాహానికి, కులమత తత్వాలకు విలయమవుతున్న పరిస్థితికి మోదీ ఎంత కారణమో, చంద్రబాబు అంతకుమించి కారణం. నిజానికి మన రాష్ట్రంలో మోదీ, బీజేపీ బలమెంత? అలాంటి మోదీకి ఈ రాష్ట్రంలో చోటు కల్పించిందెవరు? మోదీకి ఏపీలో కొత్త ఊపిరిలూది వస్తాదునుచేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్నది చంద్రబాబు కాదా? ఈ స్థితిలో రానున్న సాధారణ ఎన్నికలలో ఇటు శాసనసభ స్థానాలలోనూ, అటు పార్లమెంట్ స్థానాలలోనూ తెలుగుదేశం (ఏపీ)ని, బీజేపీని ఓడించటమే తెలుగు ప్రజల కర్తవ్యం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీసం ఆవిర్భావ దినోత్సవం కూడా లేకుండా, ఊరూపేరూ లేని అనాథగా మార్చిన ఘనత తెలుగుదేశం (వి.సి) అధినేత చంద్రబాబుదే. ఇక్కడ తెలుగుదేశం (వి.సి) అనడంలో నా ఉద్దేశం తెలుగుదేశం (వెన్నుపోటు చంద్రబాబు) పార్టీ అనే. ఇప్పుడున్న ఏపీ అధికార పార్టీని ప్రతిసారీ చంద్రబాబు తెలుగుదేశం అనడాన్ని సులభతరం చేయడమే నా ఉద్దేశం. ఎవరెంత నటనా చాతుర్యం చూపి, గావుకేకలేసి దీన్ని ఎన్టీఆర్ స్థాపించిన ఒరిజినల్ తెలుగుదేశం అని చెప్పబూనినా అది వాస్తవం కాదు అని అందరం ఎరి గిందే. పైగా కమ్యూనిస్టుపార్టీలతో సహా అన్ని రాజ కీయ పార్టీలకు బ్రాకెట్లలో పేర్లు పెట్టి అసలు పేర్లుగా చలామణి అవడం మనమెరిగిందే కదా. పైగా తెలుగుదేశం (వి.సి) అనకుండా తెలుగుదేశం పార్టీ అని అంటే ఎన్టీఆర్ ఏలోకంలో ఉన్నా, నా ప్రథమ విరోధి, నా జామాత దశమగ్రహం అధీనంలో ఉన్న పార్టీని, నేను తెలుగుజాతి పట్ల భక్తిశ్రద్ధలతో స్థాపించిన పార్టీపేరుతో పిలుస్తారా అని ఆగ్రహిస్తారేమో అన్న భయం ఏమూలో నాలో దాగివుంది. ఈ అంశానికి ఇంత ప్రాధాన్యత ఎందుకిస్తున్నానంటే నిజమైన ఎన్టీఆర్ అభిమానులు, ఆరాధకులు ఎవరైనా ఉంటే ఆనాడు ఎన్టీఆర్ తాను గెలిపించినవారితోనే చెప్పుదెబ్బలు తిన్న స్థితిని, అలా తనను అవమానించినవారి దుశ్చర్యల గురించి ఈ తరానికి కూడా స్పష్టంగా, మారు మర్చిపోలేనట్లు నిరంతరం గుర్తుచేస్తూ ఉండాలనే భావనతోనే తప్ప మరొకటి కాదు. ఇది వ్యక్తిపట్ల ద్వేషంతో రాస్తున్నది కాదు. మానవునిలో ఉండదగని అతి దుర్మార్గమైన గుణం ‘కృతఘ్నత’ పట్ల ద్వేషంతోనే అని పాఠకులు గ్రహించాలి. జనం దేవునిగా కొలిచే ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వెంకన్న చౌదరి అని సంబోధించి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం (వి.సి.) పార్టీ కులతత్వాన్ని బాహాటంగా ప్రదర్శించిన ఎంపీ మురళీమోహన్ కానీ, బ్రాహ్మణ వ్యతిరేకతతో రగిలి పోతూ, దాన్ని రగిలిస్తున్న తన పార్టీ విధానాన్ని నిర్లజ్జగా బహిర్గతం చేస్తూ, తిరుమల దేవుని ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గూర్చి ఎవడీ రమణ దీక్షితులు? బొక్కలో తోసి, పోలీసులు నాలుగు తగిలిస్తే సరి అంటూ అధికార దురహంకారాన్ని ప్రదర్శిస్తూ మంత్రి సోమిరెడ్డి అన్న సుభాషితాలను కానీ ప్రపంచమంతా నివ్వెరపోయి చూడటం తెలిసిందే. అలాగే తాను స్వయంగా దళితుడై ఉండి కూడా తోటి దళిత యువకుడిని కులంపేరుతో పరుష దూషణతో అవమానించిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య వంటివారందరూ బడుగు బలహీన ప్రజాసమూహాలకు సంఘం లో తగు గౌరవం, రాజకీయ ప్రాధాన్యం కల్పించిన ఎన్టీఆర్ అసలు తెలుగుదేశం పార్టీ వారసులు కాగలరా? అయితే వీరందరూ తర్వాత నాలుక కరుచుకుని, ఏదో నోరు జారి అన్నామనీ, ఆవేశంలో అన్నామనీ, కొడుకును మందలించినట్లు మందలించామనీ తమ తమ దుర్బాషితాలకు సంజాయిషీ చెప్తూ క్షమాపణ చెప్పారనుకోండి. గత నాలుగైదు ఏళ్లుగా మన రాష్ట్రంలో ఇసుక నమిలే ఇసుకాసురులు, మట్టి బొక్కే మహిమాన్వితులు, కంకరను కూడా కరకరలాడించే కాంట్రాక్టాసురులు ఇలా మానవులకు సంబంధించిన ప్రతి భౌతిక సంపదను బొక్కుతున్న పాలక దోపిడీదారులను కళ్లారా చూస్తున్నప్పుడు, అలాంటివారికి పాలనా తాళాలను అప్పచెప్పి అమాయకంగా, ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్లుగా పాలకుల వంచనాత్మక వాగ్దానాలను నమ్మి ఓటేసిన మన ప్రజలు కోల్పోయిన సంపద, సుఖసంతోషాల ముందు– ఆ‘వెం కన్న’ కోల్పోయిన ఐశ్వర్యం ఏపాటి అనిపిస్తుంది. ఈ తెలుగుదేశం (వి.సి.) తరఫున మన ముఖ్యమంత్రి చంద్రబాబు అఖండ ‘రాజకీయ చాణక్యానికి’ ఎక్కడో ఒక మూల విరుద్ధభాసాలంకారం మాదిరి ఒకింత అభినందన కూడా లేకపోలేదు. ఎంత గుండెలు తీసిన బంటు అయితే తప్ప నాలుగు సంవత్సరాలు కేంద్రంలో మోదీ పాలనతో చెట్టపట్టాలేసుకుని హనీమూన్ తిరిగి, ఆయనను ఇంద్రుడు, చంద్రుడు, అవతార పురుషుడు అంటున్న నేటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి జంట కవుల మాదిరి ఎన్డీఏని కీర్తించిన పెద్దమనిషి, మన ముఖ్యమంత్రి చంద్రబాబు, మోదీ హోదా వద్దు.. ఇవ్వం అంటే, అవును– మాకు హోదా ఎందుకు? వద్దే వద్దు అన్నదీ చంద్రబాబే. అంధ్రప్రదేశ్ రాజధాని ప్రారంభోత్సవానికి హాజరైనప్పుడు తెచ్చిన మంచినీళ్లు, ఆ పాత్ర అవే ముద్దు అన్నది మర్చిపోయారా? మీకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తా! అది చాలు తీసుకోండి అని మోదీ గద్దిస్తే ‘అవునవును హోదావల్ల ఏం ఒరుగుతుంది? అవి పొందిన రాష్ట్రాలలో ఏం అభివృద్ధి ఉంది? (ఆయన మంత్రివర్గంలో మంత్రులు కొందరు అవి పొందిన రాష్ట్రాలలో పరిశ్రమలు స్థాపించేందుకు పరుగులు తీస్తున్నా) మాకు ప్యాకేజీనే కావాలి’ అని అనగల ఎన్నో నాలుకలున్న నాయకుడు. అంతేకాదు నరేంద్రమోదీ ముందు ఎంతో వినయంగా అణకువ ప్రదర్శించిన పెద్దమనిషి మన చంద్రబాబు. అయితే మన చంద్రబాబు కేవలం మోదీ భక్తుడే అనుకుంటే పొరపడతాం. ఈయన తన స్వార్థం లేకుండా ఏ నిర్ణయం తీసుకోడు. ‘హోదా’ అయితే పరిశ్రమలు పెట్టేవారు తమంతతాముగా ప్రత్యేక లాభాపేక్షతో మన రాష్ట్రానికి వస్తారు. అది లేకపోతే మన ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిం చాలి. అలా ‘ప్రత్యేకత’ చూపడంలో అమ్యామ్యాలు తదితర వ్యక్తిగత ప్రయోజనాలకు ఆస్కారం ఉంటుంది. అలాగే పోలవరం కేంద్రమే నిర్మిస్తానన్నప్పటికీ, అది మాకే ఇవ్వండి మేము నిర్మించుకుంటాం అని అర్థించి మరీ తెచ్చుకున్నారు. అదీ భోక్త హోదా కోసమే. తవ్వుకోదలచుకుంటే ‘బంగా రుగని’ అన్ని కాంట్రాక్టులలోనూ అంతో ఇంతో తమకు, తమ అనుచర గణానికి తగిన ‘వాటా’కు ఆస్కారం ఉంటుంది. 2014 ఎన్నికల్లో అవసరార్థం అవకాశవాదంతో మోదీ ఆకర్షణను వాడుకుందాం అని మోదీ ఎన్డీఏలో చేరి, సినీ నటుడు పవన్ కల్యాణ్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి అతనితో కూడా కలిసి, చావుదప్పి కన్ను లొట్టబోయినట్లు కేవలం 1.6 శాతం ఓట్లతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ‘అధికారాంతమునందు చూడవలెరా ఆ అయ్య సౌఖ్యముల్’ అన్నట్లు.. ఇంకో ఏడాదిలో సాధారణ ఎన్నికలు రానున్నాయి. ఈ నాలుగేళ్ల అనుభవంతో అటు కేంద్రంలో మోదీ పాలనపైన అంతకంటే ఎక్కువగా ఇంతవరకు ఆయన జిగ్నీ దోస్త్‌గా ఉన్న మన చంద్రబాబు అసలు రంగు, స్వార్థ దురహంకార, కుల మతతత్వ పాలక స్వభావంపై దేశ ప్రజలతోపాటు తెలుగు ప్రజలలో గ్రహింపు పెరిగింది. ప్రధానంగా వైసీపీ, వామపక్షాలు, ఇతర స్వతంత్ర ప్రజా సంస్థల కృషి వలన ప్రత్యేక హోదా పట్ల ప్రజలలో చైతన్యం పెరిగింది. ఇన్నాళ్లూ ప్రత్యేక హోదా రాక పోవడంపట్ల వారిలో, అటు మోదీ, ఇటు బాబుల తోడు దొంగల వ్యవహారం క్రమేపీ బయటపడసాగింది. ఇకనేం. ఊసరవెల్లి నుంచి (రాజకీయ) రంగులు మార్చగల చంద్రబాబు తాను ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా పోరాడుతున్న నేతగానూ, అలాగే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కకపోవడానికి ఇన్నాళ్లు తాను ‘సహజీవనం’ నెరపిన మోదీయే అసలు దొంగ అయినట్లు– తాను ఆ మోదీ చేతిలో మోసపోయినట్లు ఫోజు పెట్టి– ఒక అవకాశవాద నాటకానికి తెరలేపారు. ఆయన భక్త బ్యాండ్ మీడియా చేసే భజన సారాంశం జనం చూస్తున్నదే, గ్రహిస్తున్నదే. ఇక్కడ చివరిగా చెప్పవలసిన ప్రధానాంశం ఉంది. మన నూతన రాష్ట్ర అభివృద్ధి జరగకపోవడానికి, మనకు ప్రత్యేక హోదా రాకపోవడానికి, మన రాష్ట్రం అవినీతికి, అకృత్యాలకు, అధికార దాహానికి, కులమత తత్వాలకు విలయమవుతున్న పరిస్థితికి మోదీ ఎంత కారణమో, చంద్రబాబు అంతకుమించి కారణం. నిజానికి మన రాష్ట్రంలో మోదీ, బీజేపీ బలమెంత? అలాంటి మోదీకి ఈ రాష్ట్రంలో చోటు కల్పించిందెవరు? మోదీకి ఏపీలో కొత్త ఊపిరిలూది వస్తాదునుచేసి ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్లు నటిస్తున్న బాబు నైజం అందరికీ తెలిసిందే. ఈ స్థితిలో రానున్న సాధారణ ఎన్నికలలో ఇటు శాసనసభ స్థానాలలోనూ, అటు పార్లమెంట్ స్థానాలలోనూ టీడీపీ (ఏపీ)ని, బీజేపీని ఓడించటమే తెలుగు ప్రజల కర్తవ్యం. ఇప్పుడు ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో పెరుగుతున్న బాబు వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారానో బాబుకు మేలుచేసే యత్నం తెలుగు ప్రజలకు అన్యాయం చేసినట్లే. మోదీ, చంద్రబాబులు ఇరువురూ చేసిన ద్రోహానికి ఈ రెండు పార్టీలనూ వచ్చే ఎన్నికలలో మట్టి కరిపించాలి. ఇది కాకుండా, ‘తృతీయ ఫ్రంట్’ అంటూ లేదా ముక్కోణపు పోటీ అంటూ విన్యాసాలు చేస్తే అది తెలిసో తెలియకో చంద్రబాబును ఓటమి నుండి కాపాడే చర్యే అవుతుంది. ఈ కీలక ఎన్నికల వరకైనా వైఎస్సార్సీపీ గెలుపునకు దోహదపడి ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా నిలపాలి! డాక్టర్ ఏపీ విఠల్, వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
హిందూ మతం ఒక జీవన శైలి: ఉప రాష్ట్రపతి
సాక్షి, తిరుమల: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూమతాన్ని మతంగా చూడకూడదని, దానిని ఒక జీవన శైలిగా చూడాలని చెప్పారు. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని వెంకయాయనాయుడు తెలిపారు. తిరుమలకు వీఐపీలు అవసరాన్ని బట్ట వస్తే సామాన్య భక్తులకు అవకాశం లభిస్తుందని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దంపతులిద్దరు శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ఈనెల 11వ తేదీ నుంచి 16 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. సంక్రాంతి పండుగను బంధువులతో జరుపుకునేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. -
జన హృదయూల్లో ముళ్లపూడికి చిరస్థానం
♦ హరిశ్చంద్రప్రసాద్ విగ్రహావిష్కరణలో ♦ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తణుకు : భావితరం, యువతరంతో పాటు రాబోయే తరాలను గుర్తు చేయడానికి దివంగత పారిశ్రామికవేత్త డాక్టర్ ముళ్లపూడి హరిశ్చంద్రప్రసాద్ జీవితం ఆదర్శప్రాయంగా నిలుస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ, పట్టణ పేదరిక నిర్మూలన, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తణుకు రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రపతి రోడ్డును ఆనుకుని జెడ్పీ షాపింగ్ కాంప్లెక్స్ ఆవరణలో ఏర్పాటు చేసిన ముళ్లపూడి కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వెంకయ్యనాయుడు మాట్లాడారు. సమాజంలో సంస్కారవంతుల్ని గౌరవించుకోవడం ద్వారా మనల్ని మనం గౌరవించుకున్నట్లేనని చెప్పారు. ముళ్లపూడి విగ్రహాన్ని ఆవిష్కరించుకుని జిల్లా ప్రజలు తమను తాము గౌరవించుకున్నారన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందన్నారు. అన్ని రంగాలపై ప్రత్యేక ముద్ర వేసుకున్న ముళ్లపూడి విలువలను వారసత్వంగా అందించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విగ్రహ శిల్పి రాజ్‌కుమార్ వడయార్, రైతుసంఘం అధ్యక్షుడు బొల్లిన విశ్వనాధంలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య, ఎమ్మెల్యేలు బూరుగుపల్లి శేషారావు, పులపర్తి రామాంజనేయులు, వేటుకూరి శివరామరాజు, మునిసిపల్ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్, ఏఎంసీ చైర్మన్ బసవా రామకృష్ణ, జెడ్పీటీసీ సభ్యులు ఆత్మకూరి బులిదొరరాజు, మునిసిపల్ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా, మునిసిపల్ మాజీ చైర్మన్ ముళ్లపూడి రేణుక, ఆంధ్రాసుగర్స్ ఎండీ పెండ్యాల నరేంద్రనాథ్‌చౌదరి, మాజీ ఎమ్మెల్సీ, జేఎండీ ముళ్లపూడి నరేంద్రనాథ్, జేఎండీలు ముళ్లపూడి తిమ్మరాజా, పెండ్యాల అచ్యుతరామయ్య, వార్డు కౌన్సిలర్ మల్లిన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.