సాక్షి, తిరుమల: ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. గురువారం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూమతాన్ని మతంగా చూడకూడదని, దానిని ఒక జీవన శైలిగా చూడాలని చెప్పారు.
మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని వెంకయాయనాయుడు తెలిపారు. తిరుమలకు వీఐపీలు అవసరాన్ని బట్ట వస్తే సామాన్య భక్తులకు అవకాశం లభిస్తుందని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దంపతులు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. దంపతులిద్దరు శ్రీవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేదపండితులు వారిని ఆశీర్వదించారు. ఈనెల 11వ తేదీ నుంచి 16 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. సంక్రాంతి పండుగను బంధువులతో జరుపుకునేందుకు ఆయన ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వెంకయ్య పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment