బాలీవుడ్ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రెగ్నెంట్‌తో ఉండి కూడా వరుస సినిమాల ప్రమోషన్లు, షూటింగ్‌లతో బిజీగా ఉండే నటి. బిలియన్ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు విచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ లగ్జరీయస్ వివాహానికి హజరైన నటి దీపికా పదుకొణె డిఫెరెంట్ లుక్‌తో మెస్మరైజ్ చేశారు. ఎవ్వరూ ఊహించని విధంగా రాజుల కాలం నాటి దుస్తులు, నగలతో దేవకన్యలా మెరిసింది.
దీపీకా ఈ వివాహ వేడుకలో 20వ శతాబ్దం నాటి టోరానీ సింధీ చోగా సల్వార్ ధరించింది. ముఖ్యంగా ఆమె కంఠానికి ధరించిన చోకర్ నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీపికా ధరించిన నగ సిక్కు సామ్రాజ్యం మొదటి పాలకుడు మహారాజా రంజిత్ సింగ్ నాటి కాలంలోని నగ. చెప్పాలంటే ఆయన దీన్ని చేతి పట్టి లేదా మోచేతి ఆభరణంగా ధరించేవారు. సిక్కు కళాత్మకతకు ఈ నగ అద్భుతమైన ఉదాహరణ. ఆ నగలో ఆకట్టుకునే రీతీలో జెమ్‌సెట్‌తో ఉంది. మధ్యలో ఓవల్ షేప్‌లో 150 క్యారెట్ల బరువుతో ఒక జెమ్. దాని చుట్టూ రెండు వరుసల నీలమణి రాళ్లు ఉంటాయి.
ఆ నగ బాజుబ్యాండ్ సిక్కు హస్తకళకు నిదర్శనం. మహారాజు రంజిత్ సింగ్‌కు ఆభరణాలు, విలువైన రాళ్ల అన్న మక్కువ. ఆయన ఖజానా(లాహోర్ తోషఖానా) కోహ్ ఇ నూర్ వజ్రాలకు నిలయంగా ఉంది. అయితే ఇప్పుడది బ్రిటిష్ కిరీటం అధీనంలో ఉంది. మహారాజా రంజిత్ సింగ్ ఆభరణాల సేకరణల ఎలా ఉండేదనేందుకు ఈ నగను రూపొందించిన విధానమే నిదర్శనం. కాగా, ఆంగ్లో-సిక్కు యుద్ధం తర్వాత అతని లాహోర్ తోషఖానా బ్రిటిష్ పాలకుల చేతుల్లోకి వచ్చింది. 19వ శతాబ్దంలో, రంజిత్ సింగ్, అతని వారసుడు షేర్ సింగ్ మరణానంతరం, అతని చిన్న కుమారుడు పదేళ్ల వయసులో దులీప్ సింగ్ వారసుడిగా ఎంపికయ్యాడు.
పంజాబ్ విలీనమైన తర్వాత, అతని తల్లి మహారాణి జిందన్ కౌర్ అరెస్టయ్యి, నేపాల్‌కు బహిష్కరించబడింది. దీంతో అతను పంజాబ్‌పై ఈస్ట్ ఇండియా కంపెనీకి సంతకం చేయవలసి వచ్చింది. కోహ్-ఇ-నూర్ వజ్రాలే కాకుండా, సిక్కు రాజ్యం నుంచి కొల్లగొట్టబడిన ఇతర ఆభరణాలలో తైమూర్ రూబీ అని పిలువబడే 224 పెద్ద ముత్యాలతో కూడిన మరొక ప్రసిద్ధ హారము కూడా ఉంది. 1820 నుంచి 1830 మధ్య కాలంలో స్వర్ణకారుడు హఫీజ్ ముహమ్మద్ ముల్తానీ చేసిన మహారాజా రంజిత్ సింగ్ సింహాసనం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉంది.
(చదవండి: అన్నం లేదా రోటీ: బరువు తగ్గేందుకు ఏది మంచిది? నిపుణులు ఏమంటున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment