న్యూఢిల్లీ : పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌగిలింత అనేది కేవలం ఒక్క సెకన్ మూవ్‌మెంట్ అంతే.. అదేమీ రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కాదంటూ బీజేపీకి చురకలంటించారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి హాజరైన సిద్ధూ ఈ సందర్భంగా తాను గతంలో పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకోవడాన్ని మరోసారి సమర్ధించుకున్నారు. ఈ విషయం గురించి సిద్ధూ మాట్లాడుతూ.. ‘ఎప్పుడైనా ఇద్దరు పంజాబీలు ఎదురుపడితే కౌగిలించుకుంటారు.. పంజాబ్‌లో ఇది చాలా సర్వ సాధారణం. ఇది కేవలం ఒక్క సెకన్ మూవ్‌మెంట్ అంతే.. రాఫెల్ డీల్ అంతా ప్రమాదకరం కూడా కాదం’టూ బీజేపీపై పరోక్ష విమర్శలు చేశారు.
The hug(with Pakistan Army Chief) was for hardly a second, it was not a #RafaleDeal . When two Punjabis meet they hug each other, its normal practice in Punjab.: Navjot Sidhu in Lahore pic.twitter.com/zZemyh0qls
— ANI (@ANI) November 27, 2018
అంతేకాక ఈ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణం ఇరు దేశాల ప్రజలను దగ్గర చేసి, శాంతిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. భారత్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా డేరా బాబా నానక్ నుంచి కర్తార్‌పూర్ నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఈ మార్గంలోనే రహదారి నిర్మించేందుకు వెంకయ్య నాయుడు శంకుస్థాపన చేశారు.
Comments
Please login to add a commentAdd a comment