
ఘనంగా గురు గోవింద్‌సింగ్ జయంత్యుత్సవాలు: మోదీ
సిక్కుల చివరి మతగురువు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగానే కాకుండా, భారతీయులున్న ప్రతీ దేశంలోనూ ఘనంగా జరుపుతామని ప్రధాని మోదీ ప్రకటించారు.
న్యూఢిల్లీ : సిక్కుల చివరి మతగురువు గోవింద్ సింగ్ 350వ జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగానే కాకుండా, భారతీయులున్న ప్రతీ దేశంలోనూ ఘనంగా జరుపుతామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఉత్సవాల నిర్వహణకు రూ.100 కోట్లను కేటాయించామని, నిర్వహణ ఏర్పాట్ల పర్యవేక్షణకు కమిటీ వేస్తామని చెప్పారు.
సిక్కుల జనరల్ బాబా బందా సింగ్ బహదూర్ అమరుడై 300 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారమిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. సిక్కుల విజయనాదం ‘జో బోలే సో నిహాల్’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. చరిత్రను విస్మరించినవారు చరిత్రను సృష్టించలేరన్నారు.