
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ–కశ్మీర్‌లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అకాలీదళ్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సిక్కుల ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్‌లో సిక్కు సమాజానికి చెందిన బాలికలను బలవంతంగా మతం మార్పిడి చేసి, వివాహం చేస్తున్నట్లు ఆయనకు వివరించారు. ఢిల్లీ బీజేపీ నేత ఆర్‌పీ సింగ్ నేతృత్వంలోని బృందం కిషన్‌రెడ్డికి మెమోరాండం సమర్పించింది.
చదవండి:
ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్‌ఐఏ దర్యాప్తు
Drone Attack Jammu: మరో ఉగ్రకుట్ర భగ్నం