ఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌లో ఆయన భార్య పాయల్ అబ్దుల్లాకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో తన భార్యతో విడాకులను కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీం కోర్టు ఆశ్రయించగా.. జస్టిస్ సుధాన్షు ధులియా, జస్టిస్ అహ్సానుదిన్ అమానుల్లా ధర్మాసనం విచారణ జరిపి ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆయన భార్యకు నోటీసులు జారీ చేసింది.
ఒమర్ అబ్దుల్లా ఇప్పటికే 15 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారని ఆయన తరఫు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఇన్ని ఏళ్లపాటు విడిగా ఉన్న వారి వివాహం బంధం సజీవంగా లేదని కోర్టుకు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కేసు ఆర్టికల్ 142ను ఉపయోగించి తన క్లైంట్ ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేయాలని కోర్టును కోరారు.
2016తో తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని ఒమర్ అబ్దుల్లా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా.. ఆయన చెప్పిన కారణాలు సరైనవి కాదని, నిరూపించాడానికి అవకాశం లేదని విడాకుల పిటిషన్‌ను తిరస్కరిచింది. అనతరం ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించటంతో ఒమర్ అబ్దుల్లా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఒమర్ అబ్దుల్లా, పాయల్ ఢిల్లీలోని ఒబేరాయ్‌లో పని చేస్తున్న సమయంలో తొలిసారి కలిశారు. అనంతరం వారు 1, సెప్టెంబర్ 1994న పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి విడిగానే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment