Different religions
-
‘కశ్మీర్లో బలవంతపు మతమార్పిళ్లు’
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ–కశ్మీర్లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి అకాలీదళ్ నేతల బృందం ఫిర్యాదు చేసింది. మంగళవారం కేంద్ర మంత్రిని కలిసిన సిక్కుల ప్రతినిధి బృందం జమ్మూ కశ్మీర్లో సిక్కు సమాజానికి చెందిన బాలికలను బలవంతంగా మతం మార్పిడి చేసి, వివాహం చేస్తున్నట్లు ఆయనకు వివరించారు. ఢిల్లీ బీజేపీ నేత ఆర్పీ సింగ్ నేతృత్వంలోని బృందం కిషన్‌రెడ్డికి మెమోరాండం సమర్పించింది. చదవండి: ఏకంగా రక్షణ వ్యవస్థనే లక్ష్యం.. డ్రోన్ల దాడిపై ఎన్ఐఏ దర్యాప్తు Drone Attack Jammu: మరో ఉగ్రకుట్ర భగ్నం -
నచ్చిన వారితో ఉండొచ్చు; సంచలన తీర్పు
అలహాబాద్: యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పింది. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్పూర్కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆచూకీ కనిపెట్టిన పూజా కుటుంబ సభ్యులు వారిద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేజర్లమైన తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు. భర్తతోనే కలిసి ఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు. చదవండి: ఆ గేయం వెనకనున్న గాయాలెన్నో?! -
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐఏఎస్ టాపర్స్
న్యూఢిల్లీ : నంబర్ వన్ ఎప్పుడూ నం.1నే కోరుకుంటుంది. మరి ప్రేమ విషయంలో...ఈ పట్టింపులు ఉండవు. ప్రేమకు నం1, నం.2, కులం, జాతి, మతాలతో పనిలేదు. దానికి తెలిసిందల్లా ప్రేమను పంచడం. ప్రతి ప్రేమికులు తామే ప్రపంచంలోకెల్లా నంబర్ వన్ జోడి అనుకుంటారు. ఇప్పుడు ఈ ప్రేమ కబుర్లు ఎందుకంటే టీనా దబి, అథర్ ఆమీర్ ఉల్ షఫీ ఖాన్ జోడి గుర్తుందా? మూడేళ్ల క్రితం సివిల్ సర్వీస్ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే మొదటి ర్యాంకు సాధించిన భోపాల్‌కు చెందిన టీనా దబి, అదే పరీక్షలో రెండో ర్యాంకు సాధించిన కాశ్మీర్‌కు చెందిన అథల్ ఆమీర్ ఖాన్లు ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఈ జోడీ శనివారం దక్షిణ కశ్మీర్‌లోని పహల్గామ్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ కాడర్‌కు చెందిన టీనా దబి ప్రస్తుతం అజ్మీర్‌లో సేవలు అందిస్తున్నారు. శిక్షణలో ఉండగా వీరుద్దరు ప్రేమించుకున్నారు. శిక్షణ అయిపోయిన తర్వాత నిశ్చితార్థం చేసుకున్న వీరు మూడు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకోవాలని ముందే అనుకున్నారు. కానీ వీరు తమ ప్రేమను గోప్యంగా ఉంచాలనుకోలేదు. వీరివురు కలిసి ఉన్న ఫోటోలను ఫేస్బుక్లో పోస్టు చేసేవారు. చాలా మంది వీరి ప్రేమను మెచ్చుకోగా, కొందరు మాత్రం విమర్శించారు. కొందరు టీనాను ఉద్ధేశించి నువు హిందువు అయి ఉండి ఒక ముస్లింను ఎలా పెళ్లి చేసుకుంటావు అని విమర్శించారు. అందుకు టీనా గట్టిగానే సమాధానం చెప్పింది. ‘స్వతంత్ర భావాలు గల స్త్రీగా నాకు నచ్చిన వ్యక్తిని ప్రేమించే హక్కు, పెళ్లి చేసుకునే హక్కు ఉంది. నా నిర్ణయం పట్ల నా కుటుంబ సభ్యులు, స్నేహితులు చాలా సంతోషంగా ఉన్నారు’ అని బదులిచ్చింది. వీరి ప్రేమ గురించి టీనాను అడగ్గా ఖాన్‌ను చూడగానే తొలి చూపులోనే ప్రేమలో పడిపోయాను అన్నారు. దళితుల్లో తొలిసారి మొదటి ర్యాంకు సాధించిన మీరు ఇకమీదట దళితులకు స్ఫూర్తిగా ఉండనున్నారా అని అడగ్గా అలాంటిదేమిలేదని, తాను సాధించాల్సింది ఎంతో ఉందని తెలిపింది. శ్రమ, దేవుడి అనుగ్రహం వల్ల తాను మొదటి ర్యాంకు సాధించినట్లు చెప్పింది. టీనా తల్లి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాగా ఆమె తండ్రి ప్రస్తుతం ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. -
సర్వమతాల సారం ఒక్కటే: ఎమ్మెల్యే ప్రభాకర్
ఏఎస్‌రావునగర్: విభిన్న మతాల విశ్వాసాలపై అవగాహన లేక పోవటం వల్లే అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయని, సర్వమతాల సారం ఒక్కటేనని వక్తలు అన్నారు. జమాతే ఇస్లామ్ హింద్ (జేఐహెచ్) సికింద్రాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏఎస్‌రావునగర్ గ్రౌండ్లో సర్వమత సమ్మేళనం పేరుతో జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌తో పాటు ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్యఅతిధులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ధర్మం నాలుగు పదాల మీద నడిచినప్పడే విశ్వ మానవాళి క్షేమంగా ఉంటుందని అన్నారు. సుమన్ మాట్లాడుతూ ఈశ్వర్, అల్లా సమానమేనని, కొంత మంది స్వార్థపరుల కారణంగా విభేదాలు వస్తున్నాయన్నారు. జెఐహెచ్ గ్రేటర్ అధ్యక్షులు మహ్మద్ రషోదుద్ధీన్, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ పజ్జూరి పావనీరెడ్డి, కాలనీ నాయకులు పాల్గొన్నారు.