
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్
ఏఎస్‌రావునగర్: విభిన్న మతాల విశ్వాసాలపై అవగాహన లేక పోవటం వల్లే అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయని, సర్వమతాల సారం ఒక్కటేనని వక్తలు అన్నారు. జమాతే ఇస్లామ్ హింద్ (జేఐహెచ్) సికింద్రాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఏఎస్‌రావునగర్ గ్రౌండ్‌లో సర్వమత సమ్మేళనం పేరుతో జరిగిన ‘ఈద్ మిలాప్’ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో పాటు ప్రముఖ సినీనటుడు సుమన్ ముఖ్యఅతిధులుగా హజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ధర్మం నాలుగు పదాల మీద నడిచినప్పడే విశ్వ మానవాళి క్షేమంగా ఉంటుందని అన్నారు. సుమన్ మాట్లాడుతూ ఈశ్వర్, అల్లా సమానమేనని, కొంత మంది స్వార్థపరుల కారణంగా విభేదాలు వస్తున్నాయన్నారు. జెఐహెచ్ గ్రేటర్ అధ్యక్షులు మహ్మద్ రషోదుద్ధీన్, ఏఎస్‌రావునగర్ కార్పొరేటర్ పజ్జూరి పావనీరెడ్డి, కాలనీ నాయకులు పాల్గొన్నారు.