
మన దేశంలోని రాజస్థాన్‌లోగల ఒక గ్రామం ‘వితంతువుల గ్రామం’గా పేరొందింది. ఈ గ్రామానికి చెందిన మగవారు అకాలంగా మృత్యువాత పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి వితంతువులు కుటుంబాన్ని పోషించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. రోజుకు 10 గంటల పాటు బండరాళ్లను పగులగొట్టే పనులు చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తుంటారు.
సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో..
రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలోని బుధ్‌పూర్ గ్రామంలో వితంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామంలో పురుషులు త్వరగా మృతి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని గనులలో పనిచేస్తున్న పురుషులు సిలికోసిస్ అనే అత్యంత ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నారు. సరైన సమయంలో వారికి తగిన చికిత్స అందకపోవడంతో అకాల మరణానికి గురవుతున్నారు.
చిన్నారుల బాల్యం బుగ్గిపాలు
ఇంటికి పెద్దదిక్కు మరణించడంతో ఆ ఇంటిలోని మహిళలపై కుటుంబ పోషణభారం పడుతుంది. బాధిత కుటుంబాల్లోని పిల్లలు కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉంటారు. ఫలితంగా వారి బాల్యం బుగ్గిపాలవుతున్నదనే వాదనలు వినిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వ్యాధి బారినపడిన పురుషులకు ఆ విషయం 50 శాతం వ్యాధి ముదిరాక తెలుస్తోంది. దీంతో చికిత్స పూర్తిస్థాయిలో అందేలోగానే వారు కన్నుమూస్తున్నారు. ఇక్కడి గనుల్లో పనిచేసే కూలీలకు ఆయా గనుల యజమానులు తగిన రక్షణ పరికరాలు కూడా అందించడం లేదనే వాదన వినిపిస్తుంటుంది. కార్మికుడు ఎవరైనా చనిపోయినా బాధిత కుటుంబాన్ని యజమానులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..
Comments
Please login to add a commentAdd a comment