Islamic State Group Terrorist
-
'జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తెలియదు'
లండన్: సిరియాలో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, బ్రిటన్ జాతీయుడు జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదని ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేశారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతమయిందో లేదో కచ్చితంగా చెప్పలేమని కామెరూన్ చెప్పారు. వేలమంది కంఠాలను తెగకోసిన నరరూప రాక్షసుడు జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ)ని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం పెంటగాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. -
మలేసియా ఎయిర్‌లైన్స్ సైట్‌పై హ్యాకర్ల దాడి!
హాంగ్‌కాంగ్: ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఉగ్రవాదుల మద్దతుదారులు, మలేసియా ఎయిర్‌లైన్స్ అధికారుల మధ్య సోమవారం సైబర్ పోరు హోరాహోరీగా కొనసాగింది. మలేసియా ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లోకి హ్యాకర్లు చొరబడటంతో తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 404 విమానం అదృశ్యమైందని, సైబర్ కాలిఫేట్ హ్యాకింగ్ చేసినట్లు వెబ్సైట్లో సందేశాన్ని ఉంచటంతో కలకలం రేగింది. విమానయాన సంస్థ సర్వర్ల నుంచి సేకరించిన డేటాను నాశనం చేస్తామని హ్యాకర్లు హెచ్చరించారు. ‘లిజర్డ్ స్క్వాడ్’ అనే సంస్థ దీన్ని తమ పనిగా ట్విట్టర్లో పేర్కొంది. తలకు టోపీ, కోట్ ధరించిన ఓ బల్లి బొమ్మను హ్యాకర్లు వెబ్సైట్లో ఉంచారు. తమ వెబ్సైట్ హ్యాకింగ్‌కు గురి కాలేదని, ఇంటర్నెట్ డొమైన్‌లోకి హ్యాకర్లు చొరబడి వినియోగదారులను దారి మళ్లిస్తున్నట్లు మలేషియా విమానయాన సంస్థ తెలిపింది.