బ్రిటన్ దేశస్తునికి వీడ్కోలు పలుకుతున్న క్వారంటైన్ అధికారులు
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బ్రిటన్ దేశస్తుడు క్‌లైవ్‌కుల్లీ(56) తిరుపతి శ్రీపద్మావతి నిలయంలోని క్వారంటైన్ నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. యూకేకు చెందిన క్‌లైవ్‌కుల్లీ గత నెల 23న శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో అతను పోలీసుల సహకారంతో తిరుచానూరు శ్రీపద్మావతి నిలయంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లో వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు.
వైద్యపరీక్షల అనంతరం అతనికి నెగిటివ్ అని తేలడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. బ్రిటన్ ఎంబసీ ఇండియాలో ఉంటున్న తమ దేశస్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆయన తన స్వస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్‌లో ఊహించిన విధంగా వసతి సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు క్వారంటైన్ సెంటర్ వైద్యసిబ్బంది, పర్యవేక్షకులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment