British citizen
-
క్వారంటైన్ నుంచి బ్రిటిషర్ డిశ్చార్జ్
-
క్వారంటైన్ నుంచి బ్రిటన్ దేశస్తుడు డిశ్చార్జ్
తిరుపతి అన్నమయ్య సర్కిల్: తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసిన బ్రిటన్ దేశస్తుడు క్‌లైవ్‌కుల్లీ(56) తిరుపతి శ్రీపద్మావతి నిలయంలోని క్వారంటైన్ నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. యూకేకు చెందిన క్‌లైవ్‌కుల్లీ గత నెల 23న శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో అతను పోలీసుల సహకారంతో తిరుచానూరు శ్రీపద్మావతి నిలయంలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లో వైద్య పర్యవేక్షణలో ఉన్నాడు. వైద్యపరీక్షల అనంతరం అతనికి నెగిటివ్ అని తేలడంతో గురువారం డిశ్చార్జ్ చేశారు. బ్రిటన్ ఎంబసీ ఇండియాలో ఉంటున్న తమ దేశస్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఆయన తన స్వస్థలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ సెంటర్లో ఊహించిన విధంగా వసతి సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఆయనకు క్వారంటైన్ సెంటర్ వైద్యసిబ్బంది, పర్యవేక్షకులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. -
మిషెల్‌కు బెయిల్ ఇవ్వొద్దు
న్యూఢిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న బ్రిటన్ పౌరుడు క్రిస్టియన్ మిషెల్‌కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ ఢిల్లీలోని ఓ కోర్టును కోరింది. భారత్ తరఫున సరైన సాక్ష్యాలను సమర్పించకపోవడంతోనే ఇటలీలోని ఓ న్యాయస్థానం అగస్టా కేసును కొట్టివేసిందని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం మిషెల్‌ను 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఉత్తర్వులు జారీచేసింది. మిషెల్‌కు విధించిన నాలుగు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో అధికారులు ఆయన్ను బుధవారం కోర్టు ముందు హాజరుపరిచారు. మిషెల్ న్యాయవాది జోసెఫ్ వాదిస్తూ.. ఆయన డిస్లెక్సియా వ్యాధితో బాధపడుతున్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. -
కరుణతో వస్తాడో.. కసాయి అవుతాడో..!
లండన్: జిహాదీ జాన్.. ఈ పేరు ఇప్పుడు దాదాపుగా అందరికీ సుపరిచితమే.. కసాయి అనే పదం అతడికి సరిగ్గా సరిపోతుంది. నల్లటి ముసుగు ధరించి కేవలం కళ్లు మాత్రమే కనిపించేలా ఉండి చేతులో ఓ పదునైనా కత్తితో కెమెరా ముందు నిల్చుని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బందీలుగా పట్టుకెళ్లిన అమాయకుల గొంతుకలను కోసిపారేసి కరడుగట్టిన ఉన్మాది. మొన్న అమెరికా జరిపిన వైమానికి దాడుల్లో ప్రాణాలుకోల్పోయాడని ఇస్లామిక్ స్టేట్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ పేరు మాసిపోతుందనగా ఇప్పుడు అదే పేరును తలపించేలా మరోపేరు తెరపైకి వచ్చింది. అదే 'జిహాదీ జాక్'. ఇతడు జిహాదీ జాన్ తమ్ముడా అని అనుకుంటే పొరబడ్డట్టే.. ఎందుకంటే, జిహాదీ జాక్ అనే వ్యక్తి ఇప్పుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరిన తొలి బ్రిటన్ సిటిజన్ గా కనిపించనున్నాడు. బ్రిటన్ లోని ఆక్స్ ఫర్డ్ లో చెర్వెల్ పాఠశాలలో విద్యనభ్యసించిన జాక్ లెట్స్ అనే ఇతడు మంచి విద్యార్థి, ఫుట్ బాల్ ప్లేయర్, చురుకైనా వాడు, ఎప్పుడూ స్నేహితులతో చలాకీగా ఉండేవాడు. 18 ఏళ్లు వచ్చేసరికి కువైట్‌లో అరబిక్ విద్యను అభ్యసిస్తానని వెళ్లిన అతడు అనూహ్యంగా ఐసిస్ లో చేరాడు. తాను సిరియా వెళ్లి ఉగ్రవాదుల్లో చేరిపోయానని 2014 సెప్టెంబర్ లో చెప్పినట్లు అతడి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. జాక్ తల్లిదండ్రులు ఆక్స్ ఫర్డ్ నగరంలో నివసిస్తున్నారు. ఏ క్షణం తమ కుమారుడికి ఏమవుతుందో అని ఒక తల్లిదండ్రులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అసలు అతడు అలా ఎందుకు మారాడో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు, స్నేహితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం 100 మంది ఉగ్రవాదులవరకు చనిపోయారు. అయితే, ఈ ఫైటింగ్ లో జిహాదీ జాక్ పాల్గొన్నాడో లేదో తెలియడం లేదు. ఏదేమైనా తనతల్లిదండ్రుల కోరిక నెరవేరి తిరిగి జాక్ ఇంటికి వస్తాడో.. లేక ఇటీవల ప్రాణాలు కోల్పోయిన జిహాదీ జాన్ గా మారి అమాయకుల ప్రాణాలు హరిస్తాడో చూడాలి. -
'జిహాదీ జాన్ చనిపోయాడో లేదో తెలియదు'
లండన్: సిరియాలో అమెరికా వైమానిక దళాలు జరిపిన దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, బ్రిటన్ జాతీయుడు జిహాదీ జాన్ చనిపోయాడో లేదో ఇంకా తెలియదని ఇంగ్లండ్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అన్నారు. జిహాదీ జాన్‌ను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడి చేశారని, అయితే ఈ ఆపరేషన్ విజయవంతమయిందో లేదో కచ్చితంగా చెప్పలేమని కామెరూన్ చెప్పారు. వేలమంది కంఠాలను తెగకోసిన నరరూప రాక్షసుడు జిహాదీ జాన్(మహ్మద్ ఎమ్వాజీ)ని ఎలాగైనా మట్టుపెట్టాలని అమెరికా మిలటరీ సేనలు దాడులు నిర్వహించాయి. జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించిన ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో మహ్మద్ ఎమ్వాజీ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం పెంటగాన్ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.