మోదీకి యూకే ఘన స్వాగతం
లండన్: ప్రధాని మోదీ గురువారం ప్రధానిగా తన తొలి బ్రిటన్ పర్యటనను ప్రారంభించారు. బ్రిటన్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, మేకిన్ ఇండయాకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్‌లోని కింగ చార్లెస్ స్ట్రీట్ వద్ద ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత కామెరాన్ తో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు,,మోదీ బ్రిటన్‌లోని సిక్కు మతస్తుల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. యూకేలో అడుగుపెట్టిన మోదీకి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో బ్రిటన్ విదేశాంగ, కామన్‌వెల్త్ శాఖ సహాయమంత్రి హ్యూగొ స్వైర్, ఆ దేశంలో భారత హై కమిషనర్ రంజన్ మథాయి, భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ జేమ్స్ డేవిడ్ ఎవాన్, భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ తదితరులు స్వాగతం పలికారు.
యూకేకు స్వాగతం’ అంటూ కామెరాన్ ట్వీట్ చేశారు. మోదీ రాకను నిరసిస్తూ ఆవాజ్ నెట్‌వర్క్, ‘క్యాస్ట్‌వాచ్‌యూకే’ సహా పలు సంఘాలు ‘మోదీ నాట్ వెల్‌కమ్’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. షెడ్యూల్‌లో మోదీ.. బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి అంజలి ఘటించడం, బ్రిటన్ పార్లమెంట్‌లో, లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో ప్రఖ్యాత కంపెనీల సీఈఓల సమావేశంలో ప్రసంగాలు, ఎలిజబెత్ మహారాణి 2తో మధ్యాహ్న భోజనం, వెంబ్లీ స్టేడియంలో బ్రిటన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రసంగించడం.. తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చివరగా టాటా కంపెనీకి చెందిన జాగ్వార్ లాండ్‌రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు.
12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తత్వవేత్త బసవేశ్వర విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం అంకారాలో జరిగే జీ 20 సదస్సులో పాల్గొనేందుకు శనివారం టర్కీ వెళ్తారు. గత దశాబ్ద కాలంలో భారత ప్రధాని యూకే పర్యటించడం ఇదే ప్రథమం.మోదీ పర్యటన సందర్భంగా బ్రిటన్‌లో ఉంటున్న దాదాపు 15 లక్షల భారతీయులకు సంబంధించిన వీడియోనుకా మెరాన్ కార్యాలయం విడుదల చేసింది. కాగా,భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తున్న సిక్కు అతివాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని చర్చల సందర్భంగా బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు మోదీ విజ్ఞప్తి చేసే అవకాశముంది..
‘అసహనా’న్ని ప్రస్తావించండి.. మోదీ యూకే పర్యటన సందర్భంగా 200 మంది ప్రముఖ రచయితలు కామెరాన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. భరత్‌తో పెరుగుతున్న భయానక, అసహన వాతావరణంపై మోదీని ప్రశ్నించాలని లేఖలో కోరారు.