british parliament
-
గొప్పగా మాట్లాడి వస్తే ఇలాగేనా చెక్ చేసేది ?
న్యూఢిల్లీ: పాక్ బాలికల విద్య, హక్కుల ఉద్యమకారిణి మలాలా యూసఫ్జాయ్లాగా తానేమీ స్వదేశం వదిలిపోలేదని, సొంత కశ్మీర్లో హాయిగా ఉన్నానంటూ బ్రిటన్ పార్లమెంట్ భవనంలో ప్రసంగించిన కశ్మీర్ యువతి యానా మిర్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. బ్రిటన్ నుంచి విమానంలో తిరిగొచ్చాక ఆమె బ్యాగులను ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తనిఖీచేయడమే ఆమె ఆగ్రహానికి లోనయ్యారు. బ్రిటన్‌లో భారత్ గురించి గొప్పగా ప్రసంగించిన నాలాంటి వ్యక్తిని ఇలాగేనా అవమానించేది?. ఖరీదైన లూయిస్ విట్టన్ బ్రాండ్ షాపింగ్ ఖాళీ సంచులు తెచి్చనందుకే బిల్లులు ఎగ్గొట్టిన దొంగలా చూస్తున్నారు. నన్ను వాళ్లు ఇండియా మీడియా యోధురాలిగా భావిస్తే మీరేమో ఇక్కడ నన్ను బ్రాండ్ స్మగ్లర్లా భావించి పరువు తీస్తున్నారు’’ అని అధికారులతో స్వరం పెంచి మాట్లాడారు. అధికారులతో వాగ్వాదం తాలూకు వీడియోను స్వయంగా కెమెరాతో షూట్‌చేసి ‘ఎక్స్’లో షేర్చేశారు. దీనిపై ఢిల్లీ కస్టమ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. ‘‘ అంతర్జాతీయ ప్రయాణికుల బ్యాగులను స్కానింగ్ చేయడం సర్వసాధారణం. గౌరవం చట్టాలకు అతీతం కాదు. బ్యాగ్ స్కానింగ్‌కు ఆమె ఒప్పకోలేదు’ అని అన్నారు. -
‘నేను మలాలా కాదు.. భారతదేశంలో సురక్షితంగా ఉన్నా’
లండన్: ప్రపంచవేదికపై భారతదేశ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ ప్రచారాన్ని కశ్మీర్ సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్ తీవ్రంగా ఖండించారు. బ్రిటన్ పార్లమెంట్లో ఏర్పాటు చేసిన ‘సంకల్ప్ దివాస్’ కార్యక్రమంలో యానా మీర్ ప్రసంగించారు. భారత్‌లో అంతర్భాగం అయిన కశ్మీర్లో తనకు భద్రత, స్వేచ్ఛ ఉందని తెలిపారు. ఈ విషయంలో పాకిస్తాన్ భారత్‌పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆమె తిప్పికొట్టారు. ‘నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని కాదు. ఎందుకంటే నేను నా దేశంలో స్వేచ్ఛగా, సురక్షితంగా ఉన్నా. భారతదేశంలో అంతర్భాంగా ఉన్న నా మాతృభూమి కశ్మీర్లో ఉన్నా. నేను ఎప్పుడూ అక్కడి నా దేశం నుంచి శరణార్థిలా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని అస్సలు కాను. నా దేశాన్ని, నా మాతృభూమి (కశ్మీర్)ను అణచివేయబడిన ప్రాంతమని వ్యాఖ్యానించిన మాటలను తీవ్రంగా తప్పుపడుతున్నా. సోషల్ మీడియా, ప్రపంచ మీడియాలో ఉన్న టూల్‌కిట్ సభ్యులు నా దేశంలోని కశ్మీర్‌ను సందర్శించకుండా అణచివేత పేరుతో వండివార్చిన తప్పుడు కథనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా’ అని అన్నారు. I am not a Malala I am free and safe in my homeland #Kashmir, which is part of India I will never need to runaway from my homeland and seek refuge in your country: Yana Mir @MirYanaSY in UK Parliament. #SankalpDiwas pic.twitter.com/3C5k2uAzBZ — Sajid Yousuf Shah (@TheSkandar) February 22, 2024 ‘భారతీయులను మతం ప్రాతిపాదికన చూడటం ఆపేయండి. ఆ ప్రాతిపాదికతో మా దేశాన్ని ముక్కలు చేయటాన్ని మేము అనుమతించం. ఈ ఏడాది ‘సంకల్ప్ దివాస్’ యూకే, పాకిస్తాన్లో ఉన్న భారత వ్యతిరేకులు.. ప్రపంచ మీడియా, ప్రపంచ మానవ హక్కుల వేదికలపై భారత్‌పై దుష్ప్రచారాన్ని ఆపేయాలని ఆశిస్తున్నా. ఉగ్రవాదం మూలంగా వేలాది కశ్మీరీ తల్లులు తమ పిల్లలను పొగొట్టుకున్నారు. నా కశ్మీరీ సమాజం ఇక నుంచి ప్రశాంతగా జీవించాలనుకుంటుంది. కృతజ్ఞతలు.. జైహింద్.. ’ అని యానా మీర్ తెలిపారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల మధ్య విభేదాలు సృష్టించే విధంగా వార్తలను ప్రచురించవద్దని ఆమె అంతర్జాతీయ మీడియాకు విజ్ఞప్తి చేశారు. జమ్మూ కశ్మీర్లో వైవిధ్యాన్ని పెంపొందించడంలో ఆమె చేసిన కృషికి ‘డైవర్సిటీ అంబాసిడర్ అవార్డు’తో ఆమెను సత్కరించారు. ప్రతికూల మీడియా కథనాలను ప్రతిఘటిస్తూ డి రాడికలైజేషన్, యువత అభివృద్ధిలో భారత సైన్యం తీసుకుంటున్న చొరవలను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసించారు. ఆమె మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్‌గా మారింది. -
బ్రిటన్ పార్లమెంటేరియన్లకు ‘స్ప్రెడింగ్ జాయ్’
లండన్: జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్, ఎండీ జోయ్ అలుక్కాస్ తన స్వీయ జీవిత చరిత్ర ‘స్ప్రెడింగ్ జాయ్’ను బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులకు అందజేశారు. బ్రిటిష్ సౌత్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ కామర్స్ (బీఎస్ఐసీసీ) లండన్‌లోని గ్రిమాండ్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ పార్లమెంట్ సభ్యులు మారి్టన్ డే, వీరేంద్ర శర్మ, స్టీఫెన్ టిమ్స్ సహా బరోనెస్ ఉడ్డీన్లకు తన ఆత్మకథను బహూకరించారు. బ్రిటిష్ పార్లమెంటేరియన్స్కు నా కథను తెలియజేయటం ఎంతో సంతోషాన్ని ఇచి్చందని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జోయ్ అలుక్కాస్ ఈ సందర్భంగా అన్నారు. కాగా ఇటీవల తన ఆత్మ కథను భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా జోయ్ అలుక్కాస్ అందజేశారు. -
గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు. London, UK | I was felicitated by the British Parliament as a Bengali so it was a nice feeling. It was in the Parliament. They had contacted me six months ago. They do this award every year and I got it: BCCI President Sourav Ganguly pic.twitter.com/Q8k3PdiO2k — ANI (@ANI) July 13, 2022 కాగా, జులై 13 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్ పార్లమెంట్ గంగూలీని గౌరవించింది. ఆ మ్యాచ్‌లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్ సింగ్ (69), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్)లు మరపురాని ఇన్నింగ్స్‌ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం కెప్టెన్ గంగూలీ షర్ట్ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్‌గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్ పార్లమెంట్ నిన్న దాదాను సత్కరించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‌లోనూ రోహిత్ సేన 1-0లో ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ.. -
ప్రాతఃస్మరణీయుడు
నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. ‘ఒక నల్లజాతీయుడిని ప్రజాప్రతినిధిగా చూసుకోవడానికి బ్రిటిష్ ప్రజలు సిద్ధంగా లేరు.’ ఇది 1886లో నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ సాలిస్బరీ చేసిన ప్రకటన. ఆ సంవత్సరం బ్రిటిష్ పార్లమెంట్ దిగువ సభ ప్రతినిధుల సభకు జరిగిన ఎన్నికలలో లిబరల్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆసియా వాసిని గురించి కన్జర్వేటివ్ పార్టీ వాడైన సాలిస్బరీ ఈ మాట అన్నాడు. ఆయనే దాదాభాయ్ నౌరోజీ. ఆసియా నుంచి బ్రిటిష్ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి ఆసియా వాసి ఆయనే. ఆయన భారతీయుడు కావడం ఇంకొక చరిత్రాత్మక సంఘటన. మొత్తం బ్రిటిష్ జాతీయులంతా ఆయనను వ్యతిరేకించలేదు. ఆయనకు మద్దతుగా ఒక అద్భుత వనిత, చరిత్ర మహిళ నిలిచారు. ఆమె ఫ్లారెన్స్ నైటింగేల్. ‘నల్లజాతీయుడు’ అంటూ సాలిస్బరీ అత్యంత సంస్కార హీనంగా మాట్లాడినా అది నౌరోజీ విషయంలో వరమే అయింది. అప్పటికి ఇంకా రవి అస్తమించని సామ్రాజ్యంగానే వెలిగిపోతున్న బ్రిటిష్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రి కాబట్టి ఆయన చేసిన వ్యాఖ్య పత్రికలలో ప్రముఖ స్థానం సంపాదించింది. దీనితో రాత్రికి రాత్రి నౌరోజీ ఇంగ్లండ్‌లో ప్రముఖ వ్యక్తి అయిపోయారు. సాక్షాత్తు ఇంగ్లండ్ ప్రధాని ప్రస్తావించిన ఆ నల్లజాతీయుడు ఎవరు? ఆయన దాదా భాయ్ నౌరోజీ (సెప్టెంబర్ 4,1825–జూన్ 30, 1917)! భారతదేశంలో బొంబాయి నగరం నుంచి వచ్చారు. అయినా తెల్లవాళ్లలాగే పాలిపోయినట్టు కనిపించే శరీరం వర్ణంతో ఉండే నౌరోజీని నల్లజాతీయుడు అని ఎందుకంటున్నారు అన్న సందేహం కూడా అప్పుడే వచ్చింది. చర్చ మొదలైంది. నౌరోజీ అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాతఃస్మరణీయుడు. ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు. మూడు పర్యాయాలు జాతీయ కాంగ్రెస్ వార్షిక సభలకు అధ్యక్షత వహించిన నాయకుడు. బొంబాయిలోనే గుజరాతీ మాట్లాడే పేద కుటుంబంలో నౌరోజీ పుట్టారు. ఆయన నాలుగో ఏటనే తండ్రి నౌరోజీ పలాన్జీ దోర్దీ కన్నుమూశారు. కుమారుడిని పెంచే బాధ్యత తల్లి మానేక్బాయి మీద పడింది. ఆమె కొడుకును బాగా చదివించింది. ఆయన ఎలిఫెన్‌స్టోన్ ఇనిస్టిట్యూట్‌లో చదివారు. తరువాత అక్కడే ఆచార్య పదవిని పొందారు. తన జొరాస్ట్రియన్ మతంలో సంస్కరణల కోసం ఆయన పాటు పడ్డారు. 1855లో వ్యాపారం కోసం ఇంగ్లండ్ వెళ్లారు. కొద్దికాలం తరువాత తన సొంత జౌళి పరిశ్రమను స్థాపించారు. ఇంగ్లండ్‌లో భారతీయుడు స్థాపించిన తొలి వాణిజ్య సంస్థ అదే. భారతదేశ దుస్థితికి కారణం– భారతీయ జీవనం గురించి ఆంగ్లేయులకి తెలియకపోవడమేనన్నారాయన. 1833 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ పాలకుల నుంచి 20 ఏళ్ల పాటు భారత్‌ను లీజ్‌కు తీసుకున్నారు. 1853లో ఈ లీజ్‌ను కొనసాగించడానికి ప్రతిపాదన వచ్చింది. దీనిని నౌరోజీ తీవ్రంగా వ్యతిరేకించారు. నౌరోజీ మళ్లీ 1892లో జరిగిన ఎన్నికలలో ఫిన్స్‌బరీ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కానీ ఈసారి ఈ ‘నల్లజాతీయుడు’ విజయం సాధించాడు. తక్కువ ఓట్లతోనే నెగ్గి ఉండవచ్చు. కానీ చరిత్ర సృష్టించాడు. నల్లవాడి గెలుపుని జీర్ణించుకోలేని ప్రత్యర్థి, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి మళ్లీ ఓట్లు లెక్కించాలని కోరాడు. అదే జరిగింది. మొదట కేవలం మూడు ఓట్లు ఆధిక్యం ఉంది. తిరిగి లెక్కించినప్పుడు ఆ సంఖ్య ఐదుకు చేరింది. అప్పటికి కూడా ఆయనను గేలి చేయడం మానలేదు. దాదాభాయ్ నేరో మెజారిటీ (అత్తెసరు ఓట్లతో గెలిచినవాడు) అని పిలిచేవారు, తెల్లజాతీయులు. కానీ వాటిని పట్టించుకోలేదాయన. ‘మనం ప్రధానంగా యుద్ధం చేయవలసింది పార్లమెంటులోనే’ అనే వారాయన. నిజంగానే ఆ యుద్ధంలో విజయం సాధించారు. అక్కడి సంప్రదాయం ప్రకారం బైబిల్ మీద ప్రమాణం చేసి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ తాను పార్శీ మతస్తుడు కాబట్టి నౌరోజీ అందుకు అంగీకరించలేదు. చిత్రంగా జెండా అవస్తా మీద ప్రమాణం చేయడానికి ఆయనకు అనుమతి లభించింది. ఒక సందర్భంలో నౌరోజీ గురించి, ఆయన పార్లమెంటరీ సేవల గురించి బాలగంగాధర తిలక్ చేసిన వ్యాఖ్య అద్భుతంగా అనిపిస్తుంది– ‘బ్రిటిష్ పార్లమెంట్‌కి ఒక సభ్యుని ఎన్నుకునే అధికారం మా 28 కోట్ల భారతీయులకు ఇస్తే, మేం తప్పనిసరిగా నౌరోజీనే ఎన్నుకుని ఉండేవాళ్లం’. పార్లమెంటులో ఉన్నది మూడేళ్లే అయినా నిర్మాణాత్మకమైన కృషి చేశారు నౌరోజీ. ఆ సమరానికి అనేక కోణాలు ఉన్నాయి. అందులో రెండు ముఖ్యమైనవి. ఒకటి – భారతదేశంలో ఇంగ్లండ్ చేస్తున్న ఆర్థిక దోపిడీ. రెండు– భారతదేశానికి స్వయం ప్రతిపత్తి. మూడు– మహిళలకు ఓటు హక్కు. భారత జాతీయ కాంగ్రెస్ తొలితరం నేతలంతా విధేయులే. బ్రిటిష్ జాతి భారతదేశం నుంచి వెళ్లిపోవాలని, సంపూర్ణ స్వాతంత్య్రం భారతీయుల పరం కావాలని ఆశించిన వారు కారు. స్వయం ప్రతిపత్తి, డొమీనియన్ స్థాయి కల్పిస్తే అదే చాలునన్న భావమే వారికి ఉంది. అయినా ఇంగ్లండ్ మూలంగా భారతదేశం ఎంత నష్టపోతున్నదో వారి దేశంలోనే, వారి పార్లమెంటు వేదికగానే నినదించదలిచినవారు నౌరోజీ. రాజకీయానికి ఆర్థిక కోణం ఎంత అవసరమో భారతీయులకు చెప్పినవారు నౌరోజీ. అందుకే రాజకీయాలకు నౌరోజీ గణాంకాలు కూడా నేర్పారని అంటూ ఉండేవారు. తన భావాలను, వాస్తవాలను ‘పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా’ అన్న పుస్తకంలో నౌరోజీ అమోఘంగా నమోదు చేశారు. డ్రెయిన్ థియరీ ఆయన మేధో జనితమే. 1886 ప్రాంతంలో భారత జాతీయాదాయం ఎంత? అంటే ఈస్టిండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరికానికి భారతదేశం దఖలు పడ్డ దరిమిలా, ఇరవై ఎనిమిదేళ్లకు ఆర్థిక పరిస్థితి గురించి నౌరోజీ సంధించిన ప్రశ్న ఇది. బహుశా బ్రిటిష్ ఇండియాలో జరుగుతున్న ఆర్థిక దోపిడీ గురించి గణాంకాల ఆధారంగా వెలువడిన తొలి ప్రశ్న ఇదే కావచ్చు. జాతీయాదాయం గురించి అధికారులు చెబుతున్న గణాంకాలను తాను విశ్వసించలేనని కరాఖండీగా చెప్పేశారాయన. ‘ది ఇండియన్ ఎకనమిస్ట్’ అన్న ఒక్క పత్రిక మాత్రమే ఇలాంటి వివరాలు ప్రచురిస్తూ ఉండేది. ఆ పత్రిక కూడా చాలినంతగా సమాచారం ఇవ్వడం లేదని ఆయన వాదన. అసలు అధికారుల లెక్కలు తప్పుతోవ పట్టించే విధంగా ఉన్నాయని అనేవారు నౌరోజీ. భారత్ అభివృద్ధి పథంలో సాగిపోతోంది అంటూ నోటిమాటగా చెప్పే మాటలు సరికావని కూడా తేల్చి చెప్పారాయన. దేశంలో సగటు వార్షిక తలసరి ఆదాయం ఎంత? ఇది చెప్పాలి అన్నారు. ఆకలితో నకనకలాడిపోతూ శ్రమించే కార్మికుడిని బట్టి కాదు, కార్మికుడు ఆరోగ్యంతో ఉంటే అతడి అవసరాలు ఎలా ఉంటాయో, ఆ ఆదాయం ఆధారంగా వివరాలు చెప్పాలని కోరారు. ఈ ప్రశ్నలు ఎందుకు వేయవలసి వచ్చిందో కూడా చెప్పారు నౌరోజీ. బ్రిటిష్ అధికారులు ఇచ్చిన గణాంకాల ప్రకారం 1867–1870 సంవత్సరాలలో సగటున భారతీయుడి తలసరి ఆదాయం ఏటా రూ. 20 మాత్రమే. శ్రామికుడు ఆరోగ్యంగా పనిచేయాలంటే ఉండవలసిన ఆదాయం రూ. 34. పై తరగతుల వారికీ, మధ్య తరగతుల వారికీ జాతీయాదాయంలో ఎక్కువ వాటా దక్కుతోంది. పేదలకి మాత్రం కనీస అవసరాలకు కూడా ఆదాయం అందడం లేదు. కాబట్టి బ్రిటిష్ ఇండియాలో రెండు భారతాలు ఉన్నాయని నిర్ధారించారాయన. సౌభాగ్యంతో వెలుగొందుతున్న భారత్ ఒకటి. ఇది బ్రిటిష్ వారికీ, కొందరు విదేశీయులకీ పరిమితం. రెండవది పేద భారతం. ఇది పేద భారతీయుల పరం. భారతీయుల మీద బ్రిటిష్ పాలకుల వివక్ష పన్నుల విషయంలో ఇంకా స్పష్టంగా తెలుస్తూ ఉంటుందని నౌరోజీ ఉదాహరణలతో చెప్పారు. పన్ను విధింపులో ఇది మరీ సుస్పష్టం. ఇంగ్లండ్‌లో విధించే ఆదాయం పన్ను 8 శాతం. అదే భారతదేశంలో మాత్రం 15 శాతం పన్ను విధించేవారు. మాంచెస్టర్ నుంచి దిగుమతి అయ్యే జౌళి ఉత్పత్తుల మీద సుంకం ఎత్తివేయడం గురించి ఇంగ్లండ్ కుత్సితానికి నిదర్శనంగా కనిపిస్తుంది. దీనితో భారతదేశంలోని జౌళి పరిశ్రమ నాశనం కావడానికి పునాది వేసినట్టయింది. ప్రభుత్వం తెచ్చే రుణాలకి అధిక వడ్డీ చెల్లించడం, ఐరోపావారు అందించే సేవలకి విపరీతంగా చెల్లింపులు చేయడం– ఈ రెండింటితోనే భారత్‌లో పేదరికం వీరవిహారం చేస్తోందని నౌరోజీ విశ్లేషించి చూపారు. భారతీయుల మీద భారం ఎక్కువగానే పడుతున్నదంటూ 1870లో నాటి ప్రధాని గ్లాడ్‌స్టోన్ వెల్లడించిన సంగతి గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు, మరో 23 సంవత్సరాల తరువాత ఆయనే భారత్ భరిస్తున్న సైనిక వ్యయం ప్రమాదకర స్థాయిలో ఉందని కూడా అన్నాడు. అయినా బ్రిటన్ తన అవసరాల కోసం సైన్యాన్ని వినియోగించుకున్నప్పుడు తన వాటా తాను భరించవలసి ఉంటుందని కూడా నౌరోజీ అభిప్రాయం వ్యక్తం చేశారు. 37 ఏళ్ల గణాంకాలను పరిశీలించిన తరువాత నౌరోజీ ఎగుమతి, దిగుమతుల వివరాలు కూడా ఇచ్చారు. భారత్ నుంచి జరిగిన ఎగుమతుల కంటే, దిగుమతుల విలువ 50 కోట్లకు పెరిగిందని ఆయన తేల్చారు. రైల్వేల నిర్మాణం కూడా బ్రిటన్ అవసరాలకే ఎక్కువ ఉపయోగపడుతున్నది తప్పితే సాధారణ భారతీయుడికి అందుబాటులోకి రావడం లేదని నౌరోజీ ఆక్రోశించారు. అంటే రైల్వే వ్యవస్థ నిర్మాణం కోసం తెచ్చిన విదేశీ రుణభారం భారత్ మీద పడేది. ఈ వాదనలను బట్టి బ్రిటిష్ ప్రభుత్వం వైలీ కమిషన్ నియమించింది. భారతదేశంలో జరిగే ఆదాయ వ్యయాల గురించి నివేదిక ఇవ్వడానికి ఉద్దేశించిన కమిషన్ ఇది. పరిపాలనా వ్యయం, సైనిక వ్యయం భారత్, ఇంగ్లండ్ ఏ నిష్పత్తిలో భరించాలన్న అంశాన్ని సిఫారసు చేయడం కూడా ఈ కమిషన్ ఉద్దేశం. నౌరోజీ సేవలు చరిత్రపుటలకి అందేవి కావు. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు 1894లో ఆయనకు ఒక లేఖ రాశారు– ‘పిల్లలు తండ్రి వైపు చూస్తున్నట్టు, భారతీయులు మీ వైపు చూస్తున్నారు. ఇక్కడ అచ్చంగా ఉన్న భావన ఇదే.’ దక్షిణాఫ్రికాలో భారతీయుల, విస్తృతార్థంలో చెప్పాలంటే నల్లజాతీయుల కడగండ్లను తీర్చడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చించవలసిందని నౌరోజీ ఎంపీగా ఉండగా గాంధీజీ రెండు పర్యాయాలు లేఖల ద్వారా కోరారు. గాంధీజీ ఆయనలో తండ్రిని చూశారు. కానీ జాతి ఆయనను ‘గ్రాండ్ ఓల్డ్మన్ ఆఫ్ ఇండియా’గా గౌరవించింది. ∙డా. గోపరాజు నారాయణరావు -
హాట్ టాపిక్‌గా మంత్రి వ్యవహారం
-
హాట్ టాపిక్‌గా మంత్రి రాజీనామా వ్యవహారం
లండన్ : సాధారణంగా ఎవరైనా కాస్త ఆసల్యం అయితే క్షమాపణలు చెప్పి సరిపెడుతుంటారు. కానీ, ఇక్కడ ఓ మంత్రి తన పదవికే రాజీనామా చేయటం బ్రిటన్‌లో కలకలం రేపింది. మంత్రి మైకేల్ బేట్స్ తన పదవికి రాజీనామా చేసి అర్థంతరంగా సభ నుంచి నిష్క్రమించారు. ఈ ఉదంతం బ్రిటన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బుధవారం హౌస్ ఆఫ్ లార్డ్స్(ఎగువ సభ) సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఆ సమయంలో లేబర్ పార్టీ నేత బరోనెస్ రుత్ లిస్టర్ ఓ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. అయితే దానికి సమాధానం చెప్పాల్సిన మంత్రి మైకేల్ బేట్స్(డీఎఫ్ఐ శాఖ) తన సీట్లో లేరు. సభకు ఆయన కాస్త ఆలస్యంగా వచ్చారు. హుటాహుటిన తన కుర్చీ వద్దకు వచ్చిన బేట్స్... ‘సభకు ఆలస్యంగా వచ్చినందుకు సిగ్గు పడుతున్నా.నా రాజీనామా లేఖను ప్రధానికి అందజేస్తా. లిస్టర్‌కు నా క్షమాపణలు’’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఆయన వెళ్తున్న సమయంలో కొందరు సభ్యులు వద్దని ఆయన్ని ఆపే యత్నం చేయగా.. మరికొందరు అదంతా ఆయన సరదాగా చేస్తున్నారని నవ్వుకున్నారు. కానీ, అవేం పట్టన్నట్లు బేట్స్ బయటికి వెళ్లిపోయి మళ్లీ తిరిగి లోపలికి రాలేదు. ఇదంతా కేవలం నిమిషం వ్యవధిలో జరగటం విశేషం. ఇంత చిన్న విషయానికి క్షమాపణలు చెబితే సరిపోయేదని.. రాజీనామా వ్యవహారం మరీ అతిగా ఉందని తోటి సభ్యులు చెబుతున్నారు. దీనిపై లిస్టర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదన్న ఆమె.. తక్షణమే రాజీనామా ఉపసంహరణ చేసుకోవాలని బేట్స్ కు సూచించారు. అయితే ఆయన రాజీనామా తిరస్కరణకు గురైందని.. పదవిలో కొనసాగుతారని లార్డ్స్ ఆఫ్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. బేట్స్ 2008 నుంచి లార్డ్స్ ఆఫ్ హౌజ్ లో సభ్యుడిగా ఉన్నారు. 2016 నుంచి ఆయన మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇన్నేళ్లలో ఏనాడూ తాను సభకు ఆలస్యం కాలేదని ఆయన తర్వాత తోటి సభ్యుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. ఈయనగారి వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
ముందస్తు ఎన్నికలకు పార్లమెంట్ ఆమోదం
-
ముందస్తు ఎన్నికలకు పార్లమెంట్ ఆమోదం
లండన్ : బ్రిటన్ ప్రధానమంత్రి థెరెసా మే అనూహ్య నిర్ణయానికి పార్లమెంట్ మద్దతుగా నిలిచింది. జూన్ 8న ముందస్తు ఎన్నికలు నిర్వహించాలనే థెరెసా నిర్ణయాన్ని పార్లమెంట్ ఆమోదించింది. ముందస్తు ఎన్నికల నిర్ణయంపై నేడు జరిగిన ఓటింగ్ ప్రక్రియలో 522 మంది సభ్యులు ముందస్తు ఎన్నికల నిర్ణయానికి అనుకూలంగా ఓటు వేయగా.. 13 మంది ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మొత్తం బ్రిటన్ పార్లమెంట్లో 650 మంది సిట్టింగ్ ఎంపీలున్నారు. మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్షాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతూ థెరెసా మే, మూడేళ్లు ముందస్తుగా ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. మంగళవారం ప్రధానమంత్రి మే తన డౌనింగ్ స్ట్రీట్ నివాసం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగాక దేశంలో కొన్నేళ్లపాటు రాజకీయ సుస్థిరత నెలకొనాలంటే ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. దీంతో బ్రిటిష్ రాజకీయాల్లో మరో లేటెస్ట్ ట్విస్ట్‌గా ముందస్తు ఎన్నికలు చర్చకు వచ్చాయి. గతేడాదే యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగి, ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. బ్రెగ్జిట్ రెఫరాండం ముగియగానే, ఆ దేశ ప్రధానిగా ఉన్న డేవిడ్ కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన మే ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ ముందస్తు ఎన్నికల ప్రక్రియ బ్రెగ్జిట్ చర్చలను జాప్యం చేయనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
అతడు మా దేశంలో ఇంగ్లిష్ నేర్పాడు
లండన్: బ్రిటిష్ పార్లమెంట్‌పై దాడికి యత్నించిన దుండగుడు ఖలీద్ మసూద్ తమ దేశంలో కొంతకాలం ఉన్నాడని సౌదీ అరేబియా ప్రకటించింది. 2005నవంబర్ నుంచి 2006నవంబర్ వరకూ, 2008 ఏప్రిల్ నుంచి 2009 ఏప్రిల్ వరకు వర్క్వీసాపై తమ దేశంలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేశాడని తెలిపింది. 2015 మార్చిలో తిరిగి ఆరు రోజులపాటు ఇక్కడే గడిపాడని పేర్కొంది. ఖలీద్ మసూద్ అసలు పేరు ఆడ్రియన్ ఎల్మ్స్ అని బ్రిటన్‌లోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం వెల్లడించింది. హింసా ప్రవృత్తి కలిగిన అతడిపై పలు నేరారోపణలున్నాయని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం ఉదయం మసూద్ మితిమీరిన వేగంతో కారునడిపి పలువురి మృతికి కారణమైన ఇతడు ఓ పోలీసు అధికారిని కూడా పొడిచి చంపాడు. అనంతరం భద్రతా అధికారుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. -
‘మా పార్లమెంటులో ట్రంప్ అస్సలొద్దు’
లండన్: తమ పార్లమెంటులో ప్రసంగించేందుకు తాము అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను అనుమతించబోమని, ఆయనకు స్వాగతం కూడా పలకబోమని బ్రిటన్ హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ స్పష్టం చేశారు. తాము జాతి వివక్ష, లింగవివక్ష చూపేవారికి తాము పూర్తిగా విరుద్ధం అని అన్నారు. హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ జాన్ బెర్కో మీడియాతో మాట్లాడుతూ ‘కామన్స్‌లో ప్రసంగించడాన్ని మేం చాలా గట్టిగా వ్యతిరేకిస్తాం. అలా ప్రసంగించడమనేది ఊరికే వచ్చే అవకాశం మాత్రం కాదు. గౌరవ ప్రదంగా మాత్రమే దాన్ని అందుకోగలగాలి. ట్రంప్ వలసదారులపై నిషేధం విధించడానికి ముందే ట్రంప్ వెస్ట్ మినిస్టర్ హాల్లో ప్రసంగించడాన్ని వ్యక్తిగతంగా పూర్తిగా వ్యతిరేకించాను. ఇక ఆయన నిషేధం విధించిన తర్వాత గట్టిగా నా వ్యతిరేకతను సమర్థిస్తున్నాను. నాతోపాటే ఎంతో మంది కూడా.. అయితే, అమెరికాతో మాకున్న సంబంధాలను గౌరవిస్తాం. ఒక వేళ ఆయన దేశ పర్యటనకు వస్తే దానికి కావాల్సిన ఏర్పాట్లను ఒక స్పీకర్‌గా చేస్తాను’ అని చెప్పారు. ఇటీవలె తమ దేశానికి రావాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మే ట్రంప్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
ఊగే పార్లమెంట్... సేమ్ అలాగే!
బ్రిటిష్ పార్లమెంట్ భవనానికి మరమ్మతులు వచ్చాయిట! చాలా పాత భవనం కదా... వచ్చే ఉంటాయి.. అయితే ఏంటి అంటున్నారా? ఈ మరమ్మతులు చేయాలంటే భవనాన్ని ఖాళీ చేయాలి కదా? ఇవి కాస్తా పూర్తయ్యేందుకు ఆరేళ్లకుపైగా సమయం పడుతుందట. మరి అప్పటివరకూ సమావేశాలు ఎక్కడ నడపాలి? అన్నది సందేహం. సరే... ఏదో ఒక భవనంలోకి మారిపోదామంటే బోలెడు ఖర్చు. పైగా అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉండేందుకు తగ్గ భవనం కూడా అందుబాటులో ఉండాలి. ఈ సమస్యకు జెన్స్లర్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ చూపుతున్న పరిష్కారమే... ఈ ఫొటోలు. ప్రస్తుతం పార్లమెంటు భవనమున్న ప్యాలెస్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్‌కు ఆనుకుని కేవలం పది మీటర్ల దూరంలో మాత్రమే ఉండే థేమ్స్ నదిపై ఓ తాత్కాలిక భవనాన్ని కట్టేస్తే సరిపోతుందని అంటోంది ఈ సంస్థ. ‘ప్రాజెక్ట్ పొసైడన్’ పేరుతో జెన్స్లర్ ప్రతిపాదిస్తున్న ఈ తేలియాడే పార్లమెంటు భవనం దాదాపు 8600 చదరపు మీటర్ల వైశాల్యంలో ఉంటుంది. దాదాపు 250 మీటర్ల పొడవు ఉండే ఈ తాత్కాలిక భవనాన్ని ఉక్కు, కలపల సాయంతో కడతారు. వెస్ట్‌మినిస్టర్ హాల్ (బ్రిటన్ పార్లమెంటు ఉన్న భవనం) పైకప్పు ఆకారాన్ని పోలి ఉండేలా దీన్ని డిజైన్ చేసింది జెన్స్లర్. అంతేకాదు... ఈ తేలియాడే తాత్కాలిక పార్లమెంటు భవనాన్ని బ్రిటన్‌లోని వేర్వేరు నౌకాశ్రయాల్లో ముక్కలు ముక్కలుగా నిర్మించి అన్నింటినీ థేమ్స్ నది ద్వారా తీసుకొచ్చి జోడిస్తారు. పార్లమెంటు భవనం మరమ్మతులు పూర్తయిన తరువాత దీన్ని ఇంకోచోటికి తరలించి మ్యూజియమ్గానో... ఇంకో ఇతర అవసరం కోసమో వాడుకోవచ్చునని అంటోంది జెన్స్లర్. తమ డిజైన్‌ను స్వీకరించాలని నిర్ణయిస్తే అది బ్రిటన్ ప్రభుత్వానికి దాదాపు 180 కోట్ల పౌండ్ల డబ్బు ఆదా చేస్తుందని, ఈ అంచనా కూడా బ్రిటిష్ పార్లమెంట్ కమిటీ చేసిందేనని అంటోంది ఈ కంపెనీ. అన్నింటికీ మించి... థేమ్స్ నదిపై ఈ సరికొత్త పార్లమెంటు భవనం మరో టూరిస్ట్ అట్రాక్షన్‌గా మారినా ఆశ్చర్యం లేదు. పాత భవనం మరమ్మతులు అయ్యేవరకు, ఆ పక్కనే పార్లమెంటు సమావేశాలకోసం థేమ్స్ నదిపై నిర్మాణం కాబోతున్న కొత్త భవనం నమూనా. -
బ్రిటీష్ పార్లమెంట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
కరీంనగర్ : తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని బ్రిటీష్ పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ఎంపీలు విరేంద్రశర్మ, సీమ మల్హోత్ర, రూప హక్, ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి అశిశ్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వ్యవస్థాపక సభ్యులు, ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బ్రిటీష్ పార్లమెంట్లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు పవిత్రారెడ్డి, ఈవెంట్ ఇన్చార్జి నగేశ్‌రెడ్డి, అడ్వైజరి బోర్డు చైర్మన్ ఉదయ్‌నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రత్నాకర్, కల్చరల్ సెక్రటరి శ్వేతారెడ్డి, తెలంగాణ టీజాక్ చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అతనో బఫూన్, పిచ్చోడు!
లండన్: ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ఎంపీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయనో 'బఫూన్', 'పిచ్చివాడు' అంటూ విమర్శలు చేశారు. అయితే ఆయనను బ్రిటన్‌లో అడుగుపెట్టకుండా శాశ్వతంగా నిషేధించాలన్న తీర్మానాన్ని మాత్రం ఏకగ్రీవంగా తోసిపుచ్చారు. బ్రిటన్‌లో ప్రవేశించకుండా ట్రంప్‌ను నిషేధించాలన్న తీర్మానంపై బ్రిటన్ పార్లమెంటులో వాడీవేడి చర్చ జరిగింది. ఆయన రాకను నిషేధించాలంటూ దాదాపు 5 లక్షల మంది ఓ ఆన్లైన్ పిటిషన్‌పై సంతకం చేసిన నేపథ్యంలో బ్రిటన్ పార్లమెంటు ఈ అంశంపై చర్చ చేపట్టింది. బ్రిటన్‌లో ట్రంప్‌కు భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయి. తన రాకను నిషేధించాలన్న ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ బ్రిటన్‌లోని తన పెట్టుబడులను ఉపసంహరిస్తానని హెచ్చరించారు. కానీ ట్రంప్ అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన స్కాట్లాండ్ రాష్ట్రం ఎంపీలే ఆయనను తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ బ్రిటన్ రాకుండా నిషేధించాలని చర్చ సందర్భంగా వారు గట్టిగా డిమాండ్ చేయడం గమనార్హం. అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలికంగా నిషేధించాలని, అక్రమ వలసదారులు రాకుండా సరిహద్దులు మూసివేయాలని ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఎంపీలు గేవిన్ రాబిన్సన్, అలెక్స్ చాక్ తీవ్రంగా తప్పుబట్టారు. తనవైపు జనాలను ఆకర్షించుకునేందుకు ట్రంప్ బఫూన్లా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆలోచన ధోరణి హేతుబద్ధంగా లేదని ఎంపీలు విమర్శించారు. -
మోదీకి యూకే ఘన స్వాగతం
లండన్: ప్రధాని మోదీ గురువారం ప్రధానిగా తన తొలి బ్రిటన్ పర్యటనను ప్రారంభించారు. బ్రిటన్‌తో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, మేకిన్ ఇండయాకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా 3 రోజుల పర్యటనకు శ్రీకారం చుట్టారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ లండన్‌లోని కింగ చార్లెస్ స్ట్రీట్ వద్ద ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్‌తో ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత కామెరాన్ తో మోదీ ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొన్నారు. అంతకుముందు,,మోదీ బ్రిటన్‌లోని సిక్కు మతస్తుల ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. యూకేలో అడుగుపెట్టిన మోదీకి లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో బ్రిటన్ విదేశాంగ, కామన్వెల్త్ శాఖ సహాయమంత్రి హ్యూగొ స్వైర్, ఆ దేశంలో భారత హై కమిషనర్ రంజన్ మథాయి, భారత్‌లో బ్రిటన్ హై కమిషనర్ జేమ్స్ డేవిడ్ ఎవాన్, భారతీయ సంతతికి చెందిన బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ తదితరులు స్వాగతం పలికారు. యూకేకు స్వాగతం’ అంటూ కామెరాన్ ట్వీట్ చేశారు. మోదీ రాకను నిరసిస్తూ ఆవాజ్ నెట్వర్క్, ‘క్యాస్ట్వాచ్యూకే’ సహా పలు సంఘాలు ‘మోదీ నాట్ వెల్కమ్’ పేరుతో ప్రదర్శన నిర్వహించారు. షెడ్యూల్లో మోదీ.. బ్రిటన్ పార్లమెంట్ స్క్వేర్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహానికి అంజలి ఘటించడం, బ్రిటన్ పార్లమెంట్లో, లండన్‌లోని గిల్డ్‌హాల్‌లో ప్రఖ్యాత కంపెనీల సీఈఓల సమావేశంలో ప్రసంగాలు, ఎలిజబెత్ మహారాణి 2తో మధ్యాహ్న భోజనం, వెంబ్లీ స్టేడియంలో బ్రిటన్‌లోని భారతీయులనుద్దేశించి ప్రసంగించడం.. తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చివరగా టాటా కంపెనీకి చెందిన జాగ్వార్ లాండ్రోవర్ కర్మాగారాన్ని సందర్శిస్తారు. 12వ శతాబ్దానికి చెందిన ప్రముఖ తత్వవేత్త బసవేశ్వర విగ్రహావిష్కరణ, అంబేద్కర్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవం అనంతరం అంకారాలో జరిగే జీ 20 సదస్సులో పాల్గొనేందుకు శనివారం టర్కీ వెళ్తారు. గత దశాబ్ద కాలంలో భారత ప్రధాని యూకే పర్యటించడం ఇదే ప్రథమం.మోదీ పర్యటన సందర్భంగా బ్రిటన్‌లో ఉంటున్న దాదాపు 15 లక్షల భారతీయులకు సంబంధించిన వీడియోనుకా మెరాన్ కార్యాలయం విడుదల చేసింది. కాగా,భారత్‌లో ప్రత్యేక ఖలిస్థాన్ ఉద్యమాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ప్రయత్నిస్తున్న సిక్కు అతివాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని చర్చల సందర్భంగా బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు మోదీ విజ్ఞప్తి చేసే అవకాశముంది.. ‘అసహనా’న్ని ప్రస్తావించండి.. మోదీ యూకే పర్యటన సందర్భంగా 200 మంది ప్రముఖ రచయితలు కామెరాన్‌కు ఓ విజ్ఞప్తి చేశారు. భరత్‌తో పెరుగుతున్న భయానక, అసహన వాతావరణంపై మోదీని ప్రశ్నించాలని లేఖలో కోరారు. -
‘ఉగ్ర’ దేశాలను ఒంటరిని చేయాలి
ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకి చేయాలి ♦ బ్రిటన్ పార్లమెంట్ సభ్యులనుద్దేశించి ప్రసంగించిన భారత ప్రధాని ♦ మోదీకి బ్రిటన్ ఎంపీల స్టాండింగ్ ఒవేషన్ లండన్: ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ సాయం చేస్తున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చేవారిని బహిష్కరించి, ఏకాకిని చేసే విషయంలో ఒక అంతర్జాతీయ తీర్మానం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అలాగే, ఉగ్రవాదంపై నిజాయితీగా పోరు చేస్తున్న దేశాలకు బాసటగా నిలిచే విషయంలోనూ ఒక్కమాటపై నిలవాలన్నారు. బ్రిటన్ ఎంపీలను ఉద్దేశించి గురువారం మోదీ ప్రసంగించారు. యూకే పార్లమెంట్‌లోని రాయల్ గ్యాలరీలో ఎంపీలనుద్దేశించి ప్రసంగిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ అక్కడికి అడుగుపెట్టగానే.. బ్రిటన్ ఎంపీలంతా లేచి నిల్చొని స్వాగతం పలికారు. పార్లమెంట్‌లోని రాయల్ గ్యాలరీ నుంచి 25 నిమిషాల పాటు ప్రసంగించిన మోదీ.. సమకాలీన సమాజపు అతిపెద్ద ప్రమాదమైన ఉగ్రవాదంపై పోరును అంతర్జాతీయ సమాజం ఐకమత్యంగా సాగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఉగ్రవాద సంస్థల మధ్య తేడాను, దేశాల మధ్య వివక్షను చూపొద్దని పిలుపునిచ్చారు. అఫ్ఘాన్ భవిష్యత్తు అఫ్ఘాన్ ప్రజల ఆకాంక్షల మేరకే ఉండాలి కానీ.. ఇతరుల ఆశల మేరకో.. లేక ఇతర దేశాల అనవసర భయాల మేరకో ఉండకూడదని స్పష్టం చేశారు. బ్రిటన్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం లభించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్న మోదీ.. ప్రస్తుత సమాజానికి కూడా ఆధునికత ప్రమాణం లండనేనన్నారు. ‘భారత్ ప్రపంచ దేశాలకు ఇప్పుడు అవకాశాల స్వర్గధామం. ఈ సమయంలో మీరు భారత్‌లో పర్యటిస్తే ఆ సానుకూల మార్పును మీరు కూడా గుర్తిస్తారు’ అన్నారు. భారత్‌లో ‘సమాఖ్య వ్యవస్థ స్థానంలో టీమ్ ఇండియా’ భావనను తీసుకువచ్చామన్నారు. భారత్, యూకేల చరిత్రాత్మక భాగస్వామ్యం గురించి చెబుతూ.. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, తాజా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను మోదీ గుర్తు చేశారు. మోదీ ప్రసంగంలోని చతురోక్తులకు బ్రిటన్ ఎంపీలు పలుమార్లు నవ్వుల్తో స్పందించారు. ఇటీవలి ఎన్నికల్లో కామెరాన్ ఉపయోగించిన నినాదం ‘మళ్లీ ఒకసారి.. కామెరాన్ ప్రభుత్వం’ అనేది తనదేనని, దానికి తనకు కామెరాన్ రాయల్టీ ఇవ్వాలని మోదీ చమత్కరించారు. అంతకుముందు, పార్లమెంట్ వెలుపల మోదీ, కామెరాన్‌లు మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. హక్కుల ఉల్లంఘనలపై ప్రశ్నించండి! భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై మోదీని ప్రశ్నించాలంటూ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెరెమీ కార్బిన్ సహా 46 మంది ఎంపీలు బ్రిటన్ ప్రధాని కామెరాన్‌కు ఒక పార్లమెంటరీ తీర్మానాన్ని పంపించారు. ఆశలకు వెలుగుచుక్క భారత్.. ‘ఆశలకు, అవకాశాలను సరికొత్త వెలుగుచుక్కగా భారత్ అవతరిస్తోంది. రక్షణ, వాణిజ్యం, గృహనిర్మాణం, సేవలు, తదితర రంగాల్లో భారత్‌లో అపార అవకాశాలున్నాయి. భారత్‌లో పాలనలో పారదర్శకత, నిర్ణయాల్లో వేగం, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ.. మొదలైన సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. గాంధీజీ చెప్పిన ప్రకారం.. మార్పు మాలోనే ప్రారంభమైంది. అందరికి విద్యుత్తు, తాగునీరు, ఇల్లు, పారిశుద్ధ్య వసతి మొదలైన లక్ష్యాల సాధనకు గడవును నిర్దేశించుకుని పని చేస్తున్నాం. భారతీయ చరిత్రలో చాలా భాగం బ్రిటన్ పార్లమెంట్‌లోనే లిఖితమైంది’ అని మోదీ పేర్కొన్నారు. -
అసహనాన్ని సహించం..!
భారత్‌లో అసహనంపై యూకేలో స్పందించిన మోదీ ♦ అసహన ఘటనల్ని తీవ్రంగా తీసుకుంటామని స్పష్టీకరణ ♦ {బిటన్ ప్రధానితో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న మోదీ ♦ పౌర అణు ఒప్పందం సహా రూ.90,500 కోట్ల విలువైన ఒప్పందాలు లండన్: స్వదేశంలో తీవ్రస్థాయి విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ దేశంలో నెలకొన్న అసహన వాతావరణంపై స్పందించని ప్రధాని మోదీకి.. విదేశంలో ఆ అంశంపై స్పందించాల్సివచ్చింది. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో చర్చల అనంతరం మోదీ, కామెరాన్‌లు సంయుక్తంగా పాల్గొన్న మీడియా సమావేశంలో అసహనంపై, 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ విలేకరి మోదీని ప్రశ్నించారు. దానికి.. భారత్‌లోని ఏ భాగంలోనూ అసహనానికి సంబంధించిన ఘటనలను సహించబోమని మోదీ హామీ ఇచ్చారు. ‘గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీలు నడయాడిన నేల భారత్. దేశ మౌలిక విలువలకు వ్యతిరేకంగా జరిగే ఏ ఘటనలనైనా భారతీయ సంస్కృతి ఆమోదించదు. అసహనాన్ని భారత్ అంగీకరించబోదు. ఏ చిన్న ఘటననైనా.. 125 కోట్ల ప్రజలున్న భారతావనిలో దాని ప్రాముఖ్యత ఏ స్థాయిదైనా.. భారత్ ఆమోదించబోదు. మా దృష్టిలో ప్రతీ అసహన ఘటనా తీవ్రమైనదే. వాటిని సహించబోం. వాటిపై చట్టం కఠినంగా వ్యవహరిస్తుంది. పౌరులందరి ప్రాణాలు, ఆలోచనలకు రక్షణ కల్పించే రాజ్యాంగం ఉన్న ప్రజాస్వామ్య దేశం భారత్’ అంటూ మోదీ సమాధానమిచ్చారు. ‘గతంలో మీరు ప్రధానిగా ఉన్నప్పుడు గుజరాత్ అల్లర్లను కారణంగా చూపి మోదీకి యూకేలో అడుగుపెట్టే అవకాశమివ్వలేదు. ఇప్పుడు అదే మోదీని స్వాగతించడం ఎలా ఉంది?’ అన్న గార్డియన్ పత్రికకు చెందిన విలేకరి ప్రశ్నకు కామెరాన్ సమాధానమిస్తూ.. ‘భారత ప్రజలిచ్చిన అద్భుతమైన, భారీ తీర్పుతో ప్రధాని హోదాలో యూకే వచ్చిన మోదీని స్వాగతించడం సంతోషంగా ఉంది’ అన్నారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. బ్రిటన్‌కు రాకుండా గతంలో కూడా తననెవరూ నిరోధించలేదని, 2003లో తాను యూకే వచ్చానని గుర్తు చేశారు. పౌర అణు ఒప్పందం.. మోదీ పర్యటన సందర్భంగా భారత్, బ్రిటన్ల మధ్య పౌర అణు ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం విషయంలో భారత్‌కు మద్దతిస్తున్నట్లు బ్రిటన్ పునరుద్ఘాటించింది. ఇరుదేశాల మధ్య 900 కోట్ల పౌండ్ల (రూ.90,500 కోట్లు) ఒప్పందాలు కుదిరాయి. రక్షణ, సైబర్ సెక్యూరిటీపై సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఈ వివరాలను మోదీ, కామెరాన్‌లు వెల్లడించారు. పుణే, హైదరాబాద్‌లలో కొత్త సాంకేతిక కేంద్రాల ఏర్పాటులో సహకారంపై ఒక ఒప్పందం కుదిరింది. ‘భారత్‌లో పెట్టుబడుల విషయంలోనెంబర్ వన్ భాగస్వామి కావాలనుకుంటున్నాం. ప్రభుత్వ ప్రాయోజిత రూపీ బాండ్లు సహా 100 కోట్ల పౌండ్ల విలువైన బాండ్ల విడుదలతో.. విదేశాల్లో రూపీ ట్రేడింగ్‌లో లండన్ తొలి స్థానంలో నిలవాలన్నది మా లక్ష్యం’ అని కామెరాన్ చెప్పారు. భారత్‌లో పెట్టుబడులను ఆకర్షించే విషయంలో లండన్‌ను కేంద్రంగా చేసుకోవాలనుకుంటున్నట్లు మోదీ తెలిపారు. భారత రైల్వేల ప్రస్థానం లండన్‌లోనే మొదలైందన్న మోదీ.. రైల్వే రూపీ బాండ్‌ను లండన్‌లో ఆవిష్కరించడం సంతోషకరమన్నారు. -
బ్రిటన్ గడ్డపై మోదీ
భారత్-బ్రిటన్ల మధ్య చిరకాలంగా ఉన్న సంబంధాలు మరో మలుపు తీసుకోబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం మూడు రోజుల పర్యటన కోసం బ్రిటన్ చేరుకున్నారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టత కోసం 2006లో మన్మోహన్సింగ్ పర్యటించాక తర్వాత మన ప్రధాని ఒకరు ఆ దేశాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఇందుకు భిన్నంగా 2010లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక డేవిడ్ కామెరాన్ మన దేశంలో మూడుసార్లు పర్యటించారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. శరవేగంతో ఎదిగే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కూడా గుర్తింపు పొందింది. అందుకు అవసరమైన వనరులూ, శక్తిసామర్థ్యాలూ భారత్‌కు పుష్కలంగా ఉన్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్న మాట. దీనికి తోడు ఏ దేశంలోనూ లేనివిధంగా మన దేశంలో పాతికేళ్ల లోపున్న యువత 60 కోట్లమంది ఉన్నారు. అంతేకాదు...బ్రిటన్‌లో కంటే మన దేశంలోనే శత కోటీశ్వరుల సంఖ్య ఎక్కువట. ఇన్ని అనుకూలాంశాలున్న దేశంతో ఎవరైనా మరింత సాన్నిహిత్యాన్ని కోరుకుంటారు. మన దేశంతో వాణిజ్య సంబంధాలున్న తొలి 25 దేశాల్లో బ్రిటన్ 18వ స్థానంలో ఉంది. ఇరు దేశాలమధ్యా ఉన్న వాణిజ్యం విలువ ప్రస్తుతం 1,434 కోట్ల డాలర్లు. ఈమధ్యకాలంలో మన దేశంలో బ్రిటన్‌కు సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఇతోధికంగా పెరిగాయి. మరోపక్క యూరప్‌లోని మిగిలిన దేశాలకంటే బ్రిటన్‌లోనే భారత్ పెట్టుబడులు ఎక్కువగా ఉన్నాయి. అక్కడున్న దాదాపు 700 భారతీయ వ్యాపార సంస్థల్లో, పరిశ్రమల్లో 1,10,000మంది సిబ్బంది పనిచేస్తున్నారు. మరోపక్క బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కూడా ఇటీవలికాలంలో కోలుకుంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం, నిరుద్యోగం తగ్గుముఖం పట్టడం అందుకు నిదర్శనం. ఇరు దేశాలమధ్యా ద్వైపాక్షిక సంబంధాల స్థాయిని మరింత పెంచడానికి మోదీ పర్యటన దోహదపడుతుందని కామెరాన్ ఆశాభావంతో ఉన్నారు. దానికి అనుగుణంగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాలమధ్యా 1,500 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదరబోతున్నాయి. ఇందులో 20 హాక్ ట్రైనర్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం కూడా భాగమే. ఈ విమానాల కొనుగోలుకు 2004లో తొలిసారి ఒప్పందం కుదిరాక ఇంతవరకూ మన వైమానిక దళం ఈ తరహా విమానాలు 123 కొనుగోలు చేసింది. ఒప్పందాన్ని అనుసరించి ఇందులో కొన్ని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)లో తయారయ్యాయి. టోనీ బ్లెయిర్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా ఇరు దేశాలమధ్యా వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. అయినా సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్ సమస్య విషయంలోగానీ, కశ్మీర్ సమస్యపైగానీ ఇరు దేశాలమధ్యా ఏకాభిప్రాయం లేకపోవడమే ఇందుకు కారణం. కశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో జరుగుతున్న జాప్యంవల్లే దక్షిణాసియాలో మత తీవ్రవాదం పెచ్చరిల్లుతున్నదని...ఆఫ్ఘాన్‌లో ప్రశాంతత ఏర్పడాలంటే ముందు క శ్మీర్ పరిష్కారం కావాలని 2009లో అప్పటి బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ మిలిబాండ్ వ్యాఖ్యానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కశ్మీర్ భారత్‌లో విడదీయరాని భాగమని అప్పట్లో మన దేశం స్పష్టంచేసింది. మిలిబాండ్ దాన్ని విస్మరించి పాక్‌పై పక్షపాతం ప్రదర్శించారని విమర్శించింది. అంతేకాదు...2010లో అఫ్ఘాన్ సమస్యపై నిర్వహించిన లండన్ కాన్ఫరెన్స్ద్వారా తాలిబన్లను ప్రధాన స్రవంతికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరిగింది. ఇది పాకిస్తాన్‌కు మేలు చేయడమే అవుతుందని, సమస్య తీవ్రతనూ, దాని పుట్టుకనూ విస్మరించడమే అవుతుందని మన దేశం హెచ్చరించింది. మరోపక్క వాతావరణ మార్పులు, బ్రిటన్‌లో భారత విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం తదితర అంశాల్లో కూడా ఇరు దేశాలకూ వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా మూడు నెలలక్రితం బ్రిటన్ వలస నిబంధనల్లో చేసిన మార్పులవల్ల వేలాదిమంది భారతీయ నర్సులకు అక్కడ ఉపాధి అవకాశాలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆరేళ్ల తర్వాత 35,000 పౌండ్ల జీతాన్ని పొందగలిగేవారే తమ దేశంలో ఉండటానికి అర్హులని తాజా నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పుడున్న వేతనాలను దృష్టిలో ఉంచుకుంటే ఆరేళ్ల తర్వాత ఆ స్థాయికి చేరగలవారి సంఖ్య చాలా తక్కువుంటుందని ఆందోళన వ్యక్తమైంది. ఆ ప్రాతిపదికన లెక్కలేసి రాగల రెండేళ్లలో చాలామందిని బయటకు పంపే ఉద్దేశం బ్రిటన్‌కు ఉంది. ఇది మాత్రమే కాదు...నర్సింగ్ శిక్షణా కేంద్రాలకు నిధుల కేటాయింపును కూడా బ్రిటన్ సర్కారు గణనీయంగా తగ్గించింది. విదేశీయులకు అవకాశాలు లభించకుండా చేయడమే ఈ చర్యలోని ఆంతర్యమని విమర్శలు చెలరేగాయి. ఒకపక్క రక్షణతో సహా వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలను విస్తరించుకుని లాభపడాలని చూస్తున్న బ్రిటన్...మన దేశంనుంచి వెళ్లే విద్యార్థులకూ, వృత్తిగత నిపుణులకూ అవకాశాలను కుదించేలా చేయడం ఆందోళన కలిగించే అంశం. యూరప్ దేశాలన్నిటి పెట్టుబడులకంటే బ్రిటన్‌లో మన దేశం పెట్టుబడులే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి పౌరులకిచ్చే వెసులుబాటు మన దేశంనుంచి వెళ్లేవారికి ఇవ్వకపోవడం అన్యాయమవుతుందని తోచకపోవడం విచిత్రం. ఇవన్నీ నరేంద్ర మోదీ పర్యటనలో చర్చకొస్తాయి. బ్రిటన్ పార్లమెంటునుద్దేశించి మన ప్రధాని ఒకరు ప్రసంగించడం ఇదే తొలిసారి. ఈ అవకాశాన్ని గురువారం నరేంద్ర మోదీ సమర్థవంతంగానే వినియోగించుకున్నారు. ఉగ్రవాదంపై ప్రపంచమంతా ఒకే గొంతుతో మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఈ అంశంలో బ్రిటన్ ఆలోచనా తీరును దృష్టిలో పెట్టుకునే ఆయన ఇలా చెప్పవలసి వచ్చింది. దౌత్యంలో నిర్మొహమాటంగా ఉండటం, మన వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం అవసరం. మోదీ ఆ పని చేశారు. మొత్తానికి ఆయన పర్యటన ఇరు దేశాల సంబంధాలనూ మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లగలదని ఆశించాలి. -
భారత్ సరికొత్త ఆశాకిరణం: మోదీ
లండన్: ఆర్థిక మందగమనం నుంచి బ్రిటన్ పునరుత్థానం చెందిన తీరు ఆసక్తికరమని, అదేసమయంలో ప్రస్తుతం ప్రపంచానికి భారత్ సరికొత్త ఆశాకిరణమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఉమ్మడిగా గళమెత్తాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఐరాసలో ఉగ్రవాదంపై ఒకే నిర్వచనం ఉండేలా అందరూ మద్దతు పలుకాలని బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ కోరారు. భారత ప్రధానమంత్రి బ్రిటన్ పార్లమెంటులో ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మోదీ మాట్లాడుతూ భారత సమాఖ్య విధానాన్ని ఇప్పుడో కొత్త అర్థం చెబుతున్నామని, భారత సమాఖ్య అంటే టీమిండియా అన్నది మా దృక్పథమని పేర్కొన్నారు. మారుతున్న భారతాన్ని చూడాలంటే మీరు భారత్‌ను సందర్శించాలని చెప్పారు. భారత్-బ్రిటన్ ఆర్థిక బంధం కొత్త పుంతలు తొక్కుతున్నదన్నారు. భారత్‌లో కొత్త రంగాల్లో పెట్టుబడులకు తలుపులు తెరిచామని చెప్పారు. అణుశక్తి, పునరుత్పాదక వనరుల విషయంలో బ్రిటన్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు. పర్యావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉమ్మడి బాధ్యతతో ముందుకు సాగాల్సిన అవసరముందని చెప్పారు. కలల భారత సాకారం ఇప్పుడు మనముందు నిలిచి ఉందని, భారత్ ప్రగతితో ప్రపంచంలో ఆరోవంతు మానవాళి తలరాత మారుతుందని పేర్కొన్నారు. -
బిగ్‌బీకి ‘గ్లోబల్ డైవర్సిటీ’ అవార్డు
నేడు బ్రిటన్ పార్లమెంటులో ప్రదానం ముంబై: బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ గురువారం ప్రతిష్టాత్మక ‘గ్లోబల్ డైవర్సిటీ అవార్డు’ను అందుకోనున్నారు. బుధవారం బ్రిటన్ పార్లమెంటులో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. అమితాబ్ ఈ మేరకు తన బ్లాగులో పోస్టు రాశారు. కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది.