
బ్రిటీష్ పార్లమెంట్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
కరీంనగర్ : తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని బ్రిటీష్ పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర రెండో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ ఎంపీలు విరేంద్రశర్మ, సీమ మల్హోత్ర, రూప హక్, ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి అశిశ్ శర్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు.
అనంతరం తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం వ్యవస్థాపక సభ్యులు, ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్‌సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. బ్రిటీష్ పార్లమెంట్‌లో ఆవిర్భావ వేడుకలు నిర్వహించుకోవడం మరిచిపోలేని అనుభూతి అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ ఫోరం అధ్యక్షుడు సిక్క చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు పవిత్రారెడ్డి, ఈవెంట్ ఇన్‌చార్జి నగేశ్‌రెడ్డి, అడ్వైజరి బోర్డు చైర్మన్ ఉదయ్‌నాగరాజు, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రత్నాకర్, కల్చరల్ సెక్రటరి శ్వేతారెడ్డి, తెలంగాణ టీజాక్ చైర్మన్ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.