
వాషింగ్టన్ : కొలంబస్ నగరానికి చెందిన కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ (CTA) ఆధ్వర్యములో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అనంతరం ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆటలు , బోనాల నృత్య కార్యక్రమాలు అందరిని అలరించాయి. నేతన్నలు తయారుచేసిన కాటన్ దుస్తువులతో చేసిన ఫ్యాషన్ షో అందరిని ఆకట్టుకుంది. ఈ సంబరాలలో ప్రముఖ నటి ప్రగ్యా జైస్వాల్ , సింగర్ కౌసల్య , మిమిక్రి రమేష్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. CTA అధ్యక్షుడు మనోజ్ పోకల మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లో NRI లు భాగస్వాములు కావాలని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు , కళలు సాకారం కావడానికి NRIలు ముఖ్య భూమిక పోషించాలని కోరారు.
డబ్లిన్ మేయర్ స్టువర్ట్ హారిస్, వరంగల్ మాజీ ఎమ్మెల్యే రాజేశ్వర్ రావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. రాజేశ్వర్ రావు గారు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సాధించడంలో NRI ముఖ్యమైన పాత్రా పోషించారని, దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నదని కొనియాడారు. ఈ కార్యక్రమములో మనోజ్ పోకల , శ్రీధర్ బిల్లకంటి, అమర్ మూలమళ్ళ ,అశోక్ ఇల్లందుల , శ్రీకాంత్ గడ్డం, అనిల్ వాది, సజిత్ దేశినేని , శ్రవణ్ చిదురుప్పా , శ్రీనివాస్ సలాన్ద్రి , అనిల్ దండపనేని ,బాల లబ్బిశెట్టి , శ్రీనివాస్ కొంపల్లి, రమేష్ మధు వెంకట్ తాళ్లపల్లి , శ్రీనివాస్ ఆకుల రామకృష్ణ ,విక్రమ్ ,శ్రావణి , మహేష్ పోకల , వేణు కంజర్ల రోహిత్, కమల్ , రజినీకాంత్ ,వంశీ , రాధాకృష్ణ ,భాస్కర్, ,వేణు పాల్గొన్నారు.








Comments
Please login to add a commentAdd a comment