గ్లాస్గో : స్కాట్‌లాండ్ స్వతంత్ర దేశం అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ విభజనకు వ్యతిరేకంగా స్కాట్‌లాండ్ ప్రజలు తీర్పు ఇచ్చే దిశగా ఓటింగ్ ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా వెలువడిన ఫలితాల్లో దేశ విభజన వద్దంటూ 54.33 శాతం మంది ఓటేశారు. 45.67 శాతం మంది ప్రత్యేకం దేశం కావాలని కోరుతూ ఓటేశారు.
మొత్తం 32 కౌంటీలు ఉండగా 25 కౌంటీల్లో ఫలితాలు వెలువడుతున్నాయి. 25 కౌంటీల్లో కేవలం 4 కౌంటీల్లో మాత్రమే విభజనకు అనుకూలంగా మెజార్టీ ఓటర్లు తీర్పు ఇచ్చారు. 21 కౌంటీల్లో విభజనకు వ్యతిరేకంగా.. సమైక్యానికి మద్దతుగా ఓటేశారు. ఈ ఫలితాలను బట్టి బ్రిటన్ భవితవ్యానికి ఢోకా ఉండకపోవచ్చని అంతర్జాతీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.