టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..! | Need to kidnap Sachin Tendulkar to train England cricket team, says David Cameron | Sakshi
Sakshi News home page

టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..!

Published Sat, Dec 3 2016 11:52 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..!

టెండూల్కర్ ని కిడ్నాప్ చేయాలి..!

బ్రిటన్  మాజీ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ భారత క్రికెట్ సంచలనం  సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  ఇండియాలో  టూర్ లో అష్టకష్టాలు పడుతున్న  ఇంగ్లాండ్ టీంకు శిక్షణ ఇవ్వడానికి సచిన్ ను కిడ్నాప్ చేయాలంటూ చమత్కరించారు.
 
హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ లో   పాల్గొంటున్న  కామెరూన్ శనివారం ఈ  కమెంట్స్ చేశారు.   ప్రస్తుతం దేశంలో ఇరు  దేశాల మధ్య జరుగుతున్న సిరీస్ ని దృష్టిలో పెట్టుకుని కామెరూన్ చతురోక్తులు విసిరారు. టెండూల్కర్ ని కిడ్నాప్ చేసి, తమ ఆటగాళ్లకు ట్రయినింగ్ ఇప్పించాలన్నారు. మరోవైపు సచిన్  కూడా  సమావేశానికి హాజరు కానున్నారు.

తాను ఇండియాకువచ్చిన ప్రతీసారీ దేశ పురోగతి, సామర్థ్యాన్ని చూసి ఎంతో ముగ్ధుణ్నవుతున్నానని వ్యాఖ్యానించారు.  దీంతో  సభలో చప్పట్లుమారు మోగాయి.  ఇరుదేశాలమధ్య చరిత్ర, సంస్కృతి  భాగస్వామ్యంతోపాటు ఉద్యోగాలు, పెట్టుబడులు ఆధారంగా  "ఆధునిక భాగస్వామ్యం"  పట్ల తనకు మక్కువ ఎక్కువన్నారు.

కాగా ఇంగ్లాండ్ -భారత్ మధ్య జరుగుతున్న  అయిదు   మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో  రెండింటినీ భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement