జాఫ్నాలో బ్రిటన్ ప్రధానిని చుట్టుముట్టిన తమిళులు
శ్రీలంకలో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు చేదు అనుభవం ఎదురైంది.
శ్రీలంకలో పర్యటిస్తున్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కు చేదు అనుభవం ఎదురైంది. జాఫ్పాలో వేలాది మంది తమిళ నిరసనకారులు కామెరాన్ కాన్వాయ్ ను చుట్టుముట్టారు. యుద్దంలో దెబ్బతిన్న ఉత్తర ప్రాంతాన్ని సందర్శించేందుకు వెళ్లుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
శ్రీలంక సేనలతో జరిగిన యుద్ధంలో తప్పిపోయిన తమ కుటుంబ సభ్యుల ఫోటోలను బ్రిటన్ ప్రధానికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. సివిల్ వార్ సందర్భంగా తమ కుటుంబాలకు చెందిన సభ్యులు కనిపించకుండా పోయారని కామెరాన్ దృష్టి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
శ్రీలంకలో జరుగుతున్న కామన్ వెల్త్ శిఖరాగ్ర సభలో పాల్గొనేందుకు కామెరాన్ కొలొంబోకు చేరుకున్నారు. జాఫ్నా ప్రాంత తొలి తమిళ ముఖ్యమంత్రి, మాజీ న్యాయమూర్తి సీవీ విఘ్నేశ్వరన్ ను కలుసుకోవడానికి కామెరాన్ వెళుతుండగా ఘటన సంభవించింది. గత 25 ఏళ్లుగా జరుగుతున్న సివిల్ వార్ 2009లో ముగిసింది.