సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్ | David Cameron buys used £1,500 Nissan Micra for his wife Samantha | Sakshi
Sakshi News home page

సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్

Published Mon, May 23 2016 6:49 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్

సమంతకు ప్రధాని సెకండ్ హ్యాండ్ కారు గిఫ్ట్

లండన్: బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ ఓ సెకండ్ హ్యాండ్ కారు కొన్నారు. అది కూడా తన భార్య సమంతకు గిఫ్ట్గా ఇవ్వడం కోసం. ఆయన చూసి చూడగానే ఆ కారుపై మనసుపడి తన భార్యకు గిఫ్ట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన దాదాపు 1,495 ఫౌండ్లు వెచ్చించి ఈ కారును తీసుకున్నారు. తన నియోజకవర్గం మినిస్టర్ లోవెల్లో గల ఓ సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణానికి వెళ్లిన కామెరూన్ 2004 నిస్సాన్ మైక్రా బ్లూకారును కొనేశారు. ఈ కారు అమ్మిన యజమాని లేయిన్ హ్యారీస్ ఈ విషయంపై వివరణ ఇస్తూ

'శుక్రవారం రాత్రి నాకు ఒక ఫోన్ వచ్చింది. ప్రధాని కామెరాన్ తన కార్లు షెడ్లలో ఓ కారును చూసేందుకు వస్తున్నారని. కానీ, నా సహచరుల్లో ఎవరో ఆటపట్టిస్తున్నారని అనుకున్నాను. కానీ, ఆయన నిజంగానే నా వద్దకు వచ్చేసరికి నమ్మలేకపోయాను. కనీసం అరగంటపాటు కారును చూస్తూ ఇక్కడే గడిపారు. ఇలాంటి కార్లు బ్రిటన్ లో తయారుచేస్తే బాగుంటుందని అన్నారు. ఆయన చాలా సాన్నిహిత్యంతో ఉండే వ్యక్తి. వేరే వారు కార్లు కొనేందుకు వచ్చినప్పుడు ఎలా ఉంటారో ఆయన కూడా అలాగే ఉన్నారు. కారు ఇన్సూరెన్స్ వివరాలు.. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందన్న విషయాలు అడిగి తెలుసుకున్నారు' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement