
ఒకప్పుడు సినిమాల్లో నటించడానికి హీరో లక్షల్లో రెమ్యునరేషన్ తీసుకుంటే.. హీరోయిన్లు వేలల్లో తీసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి.. చిన్న హీరో సైతం కోట్ల రూపాయాల పారితోషికం పుచ్చుకుంటున్నాడు. ఒక్క హిట్ పడితే చాలు రెమ్యునరేషన్‌ని డబుల్ చేస్తున్నారు. అయితే హీరోలో పోలిస్తే హీరోయిన్లకు రెమ్యునరేషన్ చాలా తక్కువే. కానీ కొంతమంది నటీమణులు మాత్రం హీరోకి సమానంగా...ఇంకా చెప్పాలంటే రూపాయి ఎక్కువే కానీ తక్కువ కాకుండా తీసుకుంటున్నారు. మార్కెట్‌లో వాళ్లకు ఉన్న డిమాండ్‌ని బట్టి నిర్మాతలే వాళ్లకు అంతలా పెంచేస్తున్నారు.
మొన్నటి వరకు ఓక్కో సినిమాకు రూ.3 కోట్లు తీసుకునే సాయి పల్లవి(Sai Pallavi).. తండేల్‌కి రూ.5 కోట్ల వరకు పారితోషికంగా పుచ్చుకుందట. హీరో నాగచైతన్య రెమ్యునరేషన్ కూడా ఇంచు మించు అంతే ఉంటుంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి ఓ సినిమా కోసం తన పారితోషికాన్ని అమాంతం నాలుగు రెట్లు పెంచేసింది. బాలీవుడ్‌లో ఆమె నటిస్తున్న తొలి సినిమా ‘రామాయణ’ కోసం ఆమె దాదాపు రూ. 20 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. ఆ రెండింటికి కలిపి రూ.20 కోట్లు ఆఫర్ చేశారట నిర్మాతలు.
మరోవైపు సమంత(Samantha) కూడా తన రెమ్యునరేషన్‌ని పెంచేసింది. ఖుషీ వరకు రూ.3 కోట్లు తీసుకున్న సామ్.. సిటాడెల్ హనీ బన్నీకి ఏకంగా రూ.8 కోట్లు పారితోషికంగా తీసుకుందట. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోందన్న ‘రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ వెబ్ సిరీస్ కోసం ఏకంగా రూ.10 కోట్లు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. సూపర్‌హిట్ సిరీస్‌లతో ఆకట్టుకునే దర్శకద్వయం రాజ్, డీకే (Raj and DK) ఈ వెబ్ సిరీస్‌ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆదిత్యరాయ్ కపూర్, సమంతతో పాటు కీలకపాత్రలో అలీ ఫజల్ కూడా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment