రెమ్యునరేషన్‌ పెంచేసిన సమంత.. ‘సిటాడెల్‌’ కోసం అన్ని కోట్లా? | Samantha Ruth Prabhu Charges A Whopping Remuneration For Citadel | Sakshi
Sakshi News home page

Samantha: రెమ్యునరేషన్‌ పెంచేసిన సమంత.. ‘సిటాడెల్‌’ కోసం అన్ని కోట్లా?

Published Wed, Aug 7 2024 4:26 PM | Last Updated on Wed, Aug 7 2024 4:41 PM

Samantha Takes Huge Remuneration For Citadel Honey Bunny Web Series

సాధారణంగా సౌత్‌ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. కోటి వరకు రెమ్యునరేషన్‌ తీసుకుంటారు. స్టార్‌ హీరోయిన్లు అయితే రూ. 2-3 కోట్ల వరకు తీసుకుంటారు. ఇక నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఒక్కో సినిమాకు రూ. 5 కోట్ల వరకు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.  కానీ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఆ రికార్డులు బద్దలు కొడుతూ.. రూ. 10 కోట్ల పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

తొలి హీరోయిన్‌గా రికార్డు!
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ల లిస్ట్‌లో సమంత ఇప్పటికీ ముందు వరుసలో ఉంటుంది. అనారోగ్యం కారణంగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సామ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఆమె కోసం చాలా మంది దర్శకనిర్మాతలు ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో తాను ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్‌ చేసే పనిలో పడింది సామ్‌. 

(చదవండి: వివాదంలో చిక్కుకున్న యాంకర్ సుమ.. ఏమైందంటే?)

ఇక ఆమె నటించిన వెబ్‌ సిరీస్‌ సిటాడెల్‌-హనీ బన్నీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సామ్‌ యాక్షన్‌ సీన్స్‌ అదరగొట్టేసింది. అయితే ఈ సిరీస్‌ కోసం సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. తన కష్టానికి తగ్గట్టే రెమ్యునరేషన్‌ని కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఏకంగా రూ. 10 కోట్ల వరకు పారితోషికంగా తీసుకుందట. సౌత్‌ హీరోయిన్లలో ఇప్పటివరకు ఏ హీరోయిన్‌ కూడా ఇంత మొత్తంలో తీసుకోలేదు.

సమంతకు కొత్తేమి కాదు..
రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకోవడం సమంతకు కొత్తేమి కాదు. ఇండస్ట్రీకి వచ్చిన అతితక్కువ రోజుల్లోనే తన పారితోషికాన్ని రూ. కోటికి పెంచేసింది. స్టార్‌ హీరోయిన్లు అంతా రూ. కోటి తీసుకుంటున్న సమయంలో.. సామ్‌ 3 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకుంది. అలాగే ఐటమ్‌ సాంగ్స్‌కి కూడా అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకున్న నటి సమంతనే. 

(చదవండి: ప్రముఖ నటికి ఇదేం బుద్ధి? మరీ ఇంత మోసమా!)

ఇప్పుడు ఓటీటీ రంగంలో కూడా తన మార్క్‌ చూపించబోతుంది. ఓ వెబ్‌ సిరీస్‌కి అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకున్న సౌత్‌ హీరోయిన్‌ సమంతనే అని చెప్పొచ్చు. అయితే పారితోషికం తగ్గట్టే నటన పరంగా కూడా సామ్‌ ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తుంది. ఇక సీటాడెల్‌లో ఆమె లుక్‌, యాక్షన్‌ అదిరిపోయింది. నవంబర్‌ 7 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement