
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner)లో ఓ మంచి నటుడు ఉన్నాడు. యాక్టింగ్ అంటే అతనికి పిచ్చి. లాక్‌డౌన్ సమయంలో ఎన్నో టిక్‌టాక్ వీడియోలు చేసి అలరించాడు. అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పులేస్తూ దక్షిణాది సీనీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’( Robinhood Movie). మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడట. ఈ విషయాన్ని ఇన్నాళ్లు గోప్యంగా ఉంచిన మేకర్స్.. తాజాగా ఓ ఈవెంట్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారనే విషయం తెలియగానే..అటు క్రికెట్ అభిమానులతో పాటు ఇటు సీనీ లవర్స్ కూడా ‘రాబిన్‌హుడ్’లో ఆయన పాత్ర ఎలా ఉంటుంది? అసలు ఆ పాత్రలో నటించడానికి వార్నర్ ఎంత తీసుకున్నాడు? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం.. వార్నర్‌కి రూ.50 లక్షలను రెమ్యునరేషన్‌గా అందించారట నిర్మాతలు. అయితే వార్నర్ మాత్రం రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్ చేయలేదట . సరదా కోసమే ఆ పాత్రను చేస్తానని అంగీకరించాట. కానీ నిర్మాతలే ఆయనకు ఉన్న క్రేజీని దృష్టిలో పెట్టుకొని చిన్న పాత్రలో నటించినా.. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అందించారట.
ఇక రాబిన్‌హుడ్ విషయానికొస్తే.. ‘భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ ఇది. హానీ సింగ్ అనే పాత్రలో నితిన్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment