devid warner
-
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత కుటుంబాన్ని కలిసిన వార్నర్
ఆస్రేలియా(కాన్బెర్రా): నెల రోజుల సుదీర్ఘ నిరీక్షణ తరువాత ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ సోమవారం తన కుటుంబాన్ని కలిశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను వార్నర్ భార్య కాండిస్ వార్నర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా..ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కాగా కోవిడ్-19 కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు పయనమయ్యారు. అయితే ఆస్ట్రేయాలో ప్రయాణాలపై నిషేధం కారణంగా ఆ దేశానికి చెందిన క్రికెటర్ డేవిడ్ వార్నర్ తమ దేశ ఆటగాళ్లతో కలిసి మాల్దీవులకు వెళ్లాల్సి వచ్చింది. కాగా ఐపీఎల్ 2021లో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం ఒక్కటే మ్యాచ్ గెలిచి చివరి స్థానంలో ఉంది. దీంతో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలను కేన్ విలియమ్సన్కు అప్పగించింది. అంతేకాకుండా ఈ సీజన్లో మిగిన అన్ని మ్యాచ్‌లు గెలిస్తేనే సన్ రైజర్స్‌కు ప్లే ఆఫ్‌లో చోటు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇక ఐపీఎల్-2021 సీజన్లో మిగిలిన మ్యాచ్‌లు యుఏఈలో జరుగుతాయని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసీసీఐ) ధృవీకరించిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ క్యాలెండర్ బిజీ షెడ్యూల్ కారణంగా చాలా మంది విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు ప్యాట్ కమిన్స్ కూడా తనకు కాబోయే ఫియాన్సీ బెకీ బోస్టన్‌ని కలుసుకున్నాడు. David Warner, Steve Smith and Pat Cummins are amongst the players, staff and media who are finally home after leaving India during its COVID-19 outbreak -- which forced the postponement of the IPL. pic.twitter.com/mfibSr2zr5 — 10 Sport (@10SportAU) May 30, 2021 (చదవండి: Xavier Doherty: వడ్రంగిగా మారిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్!) -
దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓటమి
-
ఉత్కంఠ పోరులో దక్షిణాఫ్రికా విజయం
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు సఫారీలనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 315 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (122) శతకంతో చెలరేగగా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ( 85) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (100: 94 బంతుల్లో), డస్సెన్ (95: 97 బంతుల్లో) అద్భుతంగా ఆడి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో డూప్లెసిస్ సేన మెగాటోర్నీకి ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. ఆసీస్ రెండోస్థానానికి పరిమితమైంది. -
మంచి మనసు చాటుకున్న వార్నర్
లండన్ : ప్రపంచ కప్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తున్న తీరుకు క్రీడాభిమానులు ఫిదా అవుతున్నారు. గతంలో ఓ మ్యాచ్‌లో తనకు లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ను బుల్లి ఫ్యాన్‌కు ఇచ్చి ఔదార్యం చాటుకున్న వార్నర్.. తాజాగా తన వల్ల గాయపడిన బౌలర్ ప్లాహాకు సారీ చెప్పి అభిమానుల మనసు గెలుచుకున్నాడు. ఇంగ్లండ్‌లోని ఓవల్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఆసీస్ క్రికెటర్లకు 23 ఏళ్ల జే కిషన్ ప్లాహా అనే భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ ఆటగాడు బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వార్నర్‌కి కూడా బంతులు వేశాడు. ఈ క్రమంలో ఓ బంతిని వార్నర్ బలంగా బాదడంతో అది ప్లాహాకు తగిలింది. దీంతో అతడు స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి కంగుతిన్న ఆస్ట్రేలియా ఫిజీషియన్స్, డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి ప్లాహను ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తనని చూడటానికి ఆసీస్ ఆటగాళ్లు ఆస్పత్రికి వచ్చారని ప్లాహా తెలిపాడు. వార్నర్ తన కొట్టిన షాట్‌కు సారీ చెబుతూ.. ఆత్మీయంగా కౌగిలించుకున్నాడని అతడు చెప్పాడు. దీంతో పాటు కంగారూ ఆటగాళ్లంతా ఆటోగ్రాఫ్స్ చేసిన ఆస్ట్రేలియా టీం జెర్సీని తనకు బహుమతిగా ఇచ్చారన్నాడు. తన కుటుంబ సభ్యులతో ప్రపంచ కప్ మ్యాచ్‌లు చూడటానికి టికెట్లు కూడా ఇచ్చారని చెప్పాడు. వార్నర్ స్పందించిన తీరును తన జీవితంలో మరిచిపోలేని సందర్భంగా ప్లాహా పేర్కొన్నాడు. ఈ ఘటనలతో ప్రపంచకప్‌లో ప్లాహా పేరు మారుమోగుతోంది. అదే విధంగా వార్నర్ స్పందించిన తీరుకు సగటు క్రీడా అభిమానులు ఫిదా అవుతున్నారు. -
ఆసీస్ శుభారంభం
ప్రపంచకప్ చరిత్రలో పాకిస్తాన్, శ్రీలంక మాజీ చాంపియన్లు. కానీ విండీస్‌తో 22 ఓవర్లయినా ఆడలేని పాక్ 105 పరుగులను మించలేదు. కివీస్‌పై లంక 30 ఓవర్లు పూర్తిగా ఆడకుండానే 136 పరుగులకే ఆలౌటైంది. కానీ క్రికెట్ కూన అఫ్గానిస్తాన్ ఐదుసార్లు చాంపియన్ అయిన ఆసీస్‌ను చక్కగా ఎదుర్కొంది. ఫలితం ఓటమైనా... మెరుగైన ప్రదర్శన కనబరిచింది. బ్రిస్టల్: డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచకప్‌లో శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై జయభేరి మోగించింది. ముందుగా అఫ్గానిస్తాన్ 38.2 ఓవర్లలో 207 పరుగులు చేసి ఆలౌటైంది. నజీబుల్లా జద్రాన్ (51; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఆసీస్ బౌలర్లలో కమిన్స్, జంపా చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ వార్నర్ (114 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు), కెప్టెన్ ఫించ్ (49 బంతుల్లో 66; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీలు సాధించారు. నజీబుల్లా అర్ధసెంచరీ... టాస్ నెగ్గిన అఫ్గానిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ ఓపెనర్లు షహజద్ (0), హజ్రతుల్లా (0) డకౌటయ్యారు. ఈ దశలో రహమత్ షా (43; 6 ఫోర్లు) జట్టును ఆదుకున్నాడు. హష్మతుల్లా షాహిది (18)తో కలిసి జట్టును నడిపించాడు. మళ్లీ జంపా దెబ్బకు 77 పరుగులకే 5 వికెట్లను కోల్పోగా... కెప్టెన్ గుల్బదిన్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్), నజీబుల్లా జద్రాన్ ఆరో వికెట్‌కు 83 పరుగులు జోడించడంతో పాటు రషీద్ ఖాన్ (27; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడటంతో 200 పైచిలుకు స్కోరు చేసింది. ఓపెనర్ల జోరు... లక్ష్యం చిన్నది. జట్టు కూడా పసికూన కావడంతో ఆస్ట్రేలియా ఓపెనర్లు ఫించ్, వార్నర్ చక్కగా ఆడుకున్నారు. వార్నర్ తన శైలికి భిన్నంగా నిదానంగా ఆడుతుంటే కెప్టెన్ ఫించ్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 40 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి వికెట్‌కు 96 పరుగులు జోడించాక ఫించ్ నిష్క్రమించగా, తర్వాత వచ్చిన ఖాజాతో కలిసి స్కోరును నడిపించిన వార్నర్ 74 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఖాజా (15)ను రషీద్ ఖాన్ ఔట్ చేయగా... లక్ష్యానికి చేరువలో స్మిత్ (18)ను ముజీబ్ పెవిలియన్ చేర్చాడు. మిగతా లాంఛనాన్ని మ్యాక్స్‌వెల్ (4 నాటౌట్) ఫోర్‌తో ముగించాడు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబుర్, రషీద్ ఖాన్, గుల్బదిన్లకు ఒక్కో వికెట్ లభించింది. -
కలవరపెట్టిన రింగ్‌టోన్!
-
బ్రేక్ పడింది!
-
బ్రేక్ పడింది!
భారత జట్టు ఓడిపోయింది...అవును, నిజమే. వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్న టీమ్ ఎట్టకేలకు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా... అలవాటుగా అలవోకగా విజయాలు అందుకున్న కోహ్లి సేన, భారీ లక్ష్యాన్ని వేటాడే క్రమంలో చేరువగా వచ్చి చివరకు ఓటమి పక్షాన నిలిచింది. వరుసగా పదో గెలుపు సాధించి కొత్త చరిత్రను లిఖించాలని భావించిన టీమిండియా ఆ ప్రయత్నంలో విఫలం కాగా... విదేశాల్లో 11 వరుస పరాజయాల తర్వాత ఆస్ట్రేలియాకు బెంగళూరులో విజయంతో ఊరట లభించింది. సిరీస్‌లో తొలి విజయంతో స్మిత్ సేన క్లీన్‌స్వీప్ అవకాశం లేకుండా చేసి పరువు కాపాడుకుంది. 335 పరుగుల పేద్ద లక్ష్యం... చిన్నస్వామిలాంటి చిన్న స్టేడియంలో అసాధ్యం ఏమీ కాదు. అందుకే మన బ్యాట్స్‌మెన్ ఎక్కడా తగ్గలేదు. రోహిత్, రహానే ఇచ్చిన శుభారంభాన్ని ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన దూకుడుతో కొనసాగిస్తే... కేదార్ జాదవ్, మనీశ్ పాండే జంట గెలుపు దిశగా నడిపించింది. అయితే ఆఖర్లో ఆసీస్ పేస్ బౌలర్ల అద్భుత బౌలింగ్ భారత్‌ను కట్టి పడేసింది. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి వికెట్లు కోల్పోవడంతో మనకు మరో విజయం చిక్కలేదు. అంతకు ముందు తన వందో వన్డేలో వార్నర్ మెరుపు సెంచరీకి తోడు ఫించ్ దూకుడైన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించి మ్యాచ్‌లో విజయంపై ఆశలు రేపేలా చేశాయి. బెంగళూరు : భారత పర్యటనలో ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు విజయం లభించింది. తమ బ్యాటింగ్ బలంపై ఆధార పడుతూ వచ్చిన ఆ జట్టుకు ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు కూడా అండగా నిలవడంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత కంగారూలు గెలుపు బాట పట్టారు. గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (119 బంతుల్లో 124; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం బాదగా, ఆరోన్ ఫించ్ (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (69 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (55 బంతుల్లో 65; 1 ఫోర్, 5 సిక్సర్లు), అజింక్య రహానే (66 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. కేన్ రిచర్డ్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 3–1తో ముందంజలో ఉంది. సిరీస్‌లో ఆఖరి వన్డే ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది. ఓపెనర్ల జోరు... ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు ఫించ్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు సాధించారు. ఫలితంగా పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 63 పరుగులకు చేరింది. ఇందులో షమీ, ఉమేశ్ చెరో ఐదు ఓవర్లు వేయగా... మొత్తం 12 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత అక్షర్, పాండ్యా, చహల్ కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్ అలవోకగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో వార్నర్ 45 బంతుల్లో, ఫించ్ 65 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతకుముందు 47 పరుగుల వద్ద ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో ధోని విఫలమయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 191 పరుగులకు చేరింది. జాదవ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన వార్నర్ వన్డేల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అక్షర్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 16 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు పార్ట్ టైమర్ జాదవ్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. జాదవ్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి లాంగాన్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారూలను నియంత్రించారు. మరో ఐదు పరుగుల వ్యవధిలో ఫించ్, స్మిత్ (3) కూడా అవుట్ కావడంతో వేగంగా ఆడటంలో ఆసీస్ విఫలమైంది. ఒక దశలో 50 బంతులపాటు ఆ జట్టు బౌండరీ కొట్టలేదు. అయితే చివర్లో టిమ్ హెడ్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హ్యాండ్స్కోంబ్ (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భారత్ తమ ప్రధాన బౌలర్లు ముగ్గురు భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో షమీ, ఉమేశ్, అక్షర్‌లకు అవకాశం కల్పించింది. మూడు అర్ధ సెంచరీలు... గత మ్యాచ్‌లాగే మరోసారి భారత జట్టు ఓపెనర్లు రహానే, రోహిత్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 65 పరుగులు సాధించింది. ముందుగా రహానే 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే వెనుదిరగడంతో 106 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. కొద్ది సేపటికే కోహ్లితో సమన్వయ లోపం, స్మిత్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రోహిత్ రనౌటయ్యాడు. ఆ వెంటనే కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో కట్ చేయబోయి వికెట్లపైకి ఆడుకోవడంతో కోహ్లి (21) ఆట ముగిసింది. ఈ దశలో పాండ్యా, జాదవ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే మరోవైపు భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో జంపా బౌలింగ్‌పై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు జత చేసిన అనంతరం జంపా బౌలింగ్‌లో మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జాదవ్, పాండే కలిసి మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఇలాంటి స్థితిలో ఆసీస్ పేసర్లు కమిన్స్, రిచర్డ్సన్ చక్కటి యార్కర్లతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి భారత జోడీపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా భారీ షాట్‌కు ప్రయత్నించి జాదవ్ వెనుదిరగ్గా... మరో మూడు బంతులకే పాండేను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ధోని (13) కూడా తన ముద్ర చూపలేకపోవడంతో భారత్ విజయంపై ఆశలు కోల్పోయింది. ►8 కెరీర్ వందో వన్డేలో సెంచరీ చేసిన ఎనిమిదో, ఆస్ట్రేలియా తరఫున తొలి ఆటగాడు వార్నర్. ►100 ఉమేశ్ యాదవ్ వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అతను మొత్తం 71 వన్డేలు ఆడాడు. ►2000 కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లి 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (36)లలో అతను ఈ ఘనత నమోదు చేశాడు. -
ఆసీస్ అదుర్స్
డర్బన్: డేవిడ్ వార్నర్ (16 బంతుల్లో 40; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), బ్రాడ్ హాడ్జ్ (8 బంతుల్లో 21 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) వీరవిహారం చేయడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించారు. తొలుత దక్షిణాఫ్రికా 7 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. తర్వాత ఆస్ట్రేలియా 6.4 ఓవర్లలో 5 వికెట్లకు 81 పరుగులు చేసింది.