మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరకు సఫారీలనే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. అనంతరం 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 315 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో ఆసీస్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (122) శతకంతో చెలరేగగా.. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ( 85) అర్థసెంచరీతో ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో వీరిద్దరూ ఔట్ కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. అంతకు ముందు దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ (100: 94 బంతుల్లో), డస్సెన్ (95: 97 బంతుల్లో) అద్భుతంగా ఆడి సఫారీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో డూప్లెసిస్ సేన మెగాటోర్నీకి ఘనంగా వీడ్కోలు పలికింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. ఆసీస్ రెండోస్థానానికి పరిమితమైంది.
Comments
Please login to add a commentAdd a comment