మాంచెస్టర్ : దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరిసింది. శనివారం ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ జట్టు 326 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సారథి డుప్లెసిస్(100; 94 బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో పాటు డస్సన్(95 ; 97 బంతుల్లో 4ఫోర్లు, 4 సిక్సర్లు) అర్దసెంచరీతో రాణించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. వికెట్ కీపర్ డికాక్(52) హాఫ్ సెంచరీతో ఫర్వాలేదనిపించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లియాన్, స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కమిన్స్, బెహ్రాన్‌డార్ఫ్‌లు చెరో రెండు వికెట్‌లు దక్కించుకున్నారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీకి ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. మక్రామ్, డికాక్‌లు తొలి వికెట్‌కు 79 పరుగులు జోడించారు. మక్రామ్(34)ను లియన్ ఔట్ చేసి తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరదించాడు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన సారథి డుప్లెసిస్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్ నడిపించాడు. అర్దసెంచరీ అనంతరం డికాక్‌ను లియోన్ ఔట్ చేసి ఆసీస్‌కు బ్రేక్ ఇచ్చాడు. ఈ క్రమంలో డుప్లెసిస్‌కు జతగా డస్సన్ చేరాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 155 పరుగులు జోడించి భారీ ఇన్నింగ్స్‌కు బాటలు వేశారు. సెంచరీ అనంతరం డుప్లెసిస్ అవుటైనా డస్సన్ తుది వరకు ఉండి సెంచరీ సాధించకుండానే చివరి బంతికి అవుటయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment