
మాంచెస్టర్: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ నయా రికార్డు లిఖించాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా తమ దేశానికి చెందిన గ్లెన్ మెక్‌గ్రాత్ సరసన నిలిచాడు. కరీబియన్ వేదికగా 2007లో జరిగిన వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్ 26 వికెట్లతో టాప్‌లో నిలిచాడు. ఇది ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన రికార్డుగా ఉంది. ఇప్పుడు అతని సరసన మిచెల్ స్టార్క్ చోటు సంపాదించాడు. ఆనాటి వరల్డ్‌కప్‌లో మెక్‌గ్రాత్ 11 మ్యాచ్‌లు ఆడి ఆ ఫీట్ నమోదు చేయగా, మిచెల్ స్టార్క్ మాత్రం తొమ్మిది మ్యాచ్‌ల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం. అది కూడా లీగ్ దశలోనే స్టార్క్ అత్యధిక వికెట్ల రికార్డును సమం చేయడం ఇక్కడ మరో విశేషం. (ఇక్కడ చదవండి: భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్)
శనివారం మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో స్టార్క్ రెండు వికెట్లు తీశాడు. దాంతో ఈ వరల్డ్‌కప్ లీగ్ దశలోనే స్టార్క్ 26 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. నిన్నటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీలు 326 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించగా, ఆసీస్ 315 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment