పాత మంత్రులకు షాకిచ్చిన నూతన ప్రధాని | Theresa May joins new ministers in cabinet | Sakshi
Sakshi News home page

పాత మంత్రులకు షాకిచ్చిన నూతన ప్రధాని

Published Thu, Jul 14 2016 8:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

పాత మంత్రులకు షాకిచ్చిన నూతన ప్రధాని

పాత మంత్రులకు షాకిచ్చిన నూతన ప్రధాని

లండన్: బ్రిటన్ ప్రధానిగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన థెరిసా మే, గురువారం మంత్రివర్గానికి షాక్ ఇచ్చారు. డేవిడ్ కామెరాన్ ప్రధానిగా ఉన్నప్పుడు కీలక స్థానాల్లో కొనసాగిన వారికి ఆమె ఉద్వాసన పలికారు. బ్రెగ్జిట్‌కు అనుకూలంగా గట్టి ప్రచారం నిర్వహించిన బోరిస్ జాన్సన్‌కు అనూహ్యంగా విదేశాంగ మంత్రి పదవి కట్టబెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ప్రధాని పదవి రేసులో థెరిసాకు పోటీగా నిలిచిన న్యాయమంత్రి మైకేల్ గోవ్, మంత్రుల తొలగింపుల్లో ఆమె తొలి టార్గెటయ్యారు.

కామెరాన్ మంత్రివర్గంలోని నిక్కీ మోర్గాన్, ఆలివర్ లెట్విన్, జాన్ విట్టింగ్డేల్‌లను కూడా పదవుల నుంచి థెరిసా తొలగించారు. కాగా, లిజ్ ట్రస్, జస్టిన్ గ్రీనింగ్‌ నూతన మంత్రివర్గంలో చోటుదక్కింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగే కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు బ్రెగ్జిట్ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసి ఆ బాధ్యతలను డేవిడ్ డేవిస్‌కు అప్పగించారు. థెరిసా మేకు భారత ప్రధాని నరేంద్రమోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఆమెతో కలిసి ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేస్తామని అన్నారు. యూరోపియన్ కూటమికి చెందిన జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఐర్లాండ్ ప్రధాని ఎండా కెన్నీలు కూడా ఆమెకు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement