భద్రతా మండలిలో భారత్కు పూర్తి మద్దతు: కామెరూన్
లండన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ సంపూర్ణ మద్దతు ఇచ్చేందుకు సిద్దంగా ఉందని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్పష్టం చేశారు. మూడు రోజుల బ్రిటన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో సమావేశమయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతంపై అగ్రనేతలిద్దరూ చర్చించారు. మేక్ ఇన్ ఇండియాకు బ్రిటన్ సహకరిస్తుందని కామెరూన్ అన్నారు.
రక్షణ రంగంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నిధులను అందిస్తామని తెలిపారు. ఇండోర్, పుణె నగరాలలో ప్రత్యేక అభివృద్ధి కేంద్రాలకు బ్రిటన్ సహాయం ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీస్, స్వచ్ఛ్భారత్లలో బ్రిటన్ భాగస్వామ్యం పంచుకుంటుందని, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు బ్రిటీష్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆ దేశ ప్రధాని డేవిడ్ కామెరూన్ వివరించారు.