
ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను పాలస్తీనాతో పోలుస్తూ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో మరోసారి నోరుపారేసుకున్నారు. ‘‘రెండుచోట్లా పరిస్థితులు ఒక్కటే. రెండు సమస్యలనూ ఐరాస ఇప్పటికీ పరిష్కరించలేదు.
కశ్మీర్‌ను ఐరాస ప్రధాన ఎజెండాలోకి తీసుకురాకుండా భారత్ పదేపదే అడ్డుపడుతోంది’’ అంటూ వాపోయారు. భారత్‌ను గురించి మాట్లాడే క్రమంలో ఒకసారి మిత్రదేశం, మరోసారి పొరుగుదేశం అంటూ ఆయన తడబాటుకు గురయ్యారు.