న్యూయార్క్: జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు.
అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.
ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్‌లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment