
21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లేనా ?
మండిపడ్డ మనీశ్ తివారీ
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేత, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి మనీశ్ తివారీ... సొంత పార్టీ కళ్లు తెరిపించేరీతిలో వ్యాఖ్యలు చేశారు. 21వ శతాబ్దంలోనూ రిజర్వేషన్లు ఇవ్వడంలోని ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. ఒకవేళ అవసరమనుకుంటే కులం ప్రాతిపదికగా కాకుండా కచ్చితంగా ఆర్థిక స్థితిగతులనుబట్టే ఇవ్వాలన్నారు. కాగా రిజర్వేషన్ల అంశాన్ని సమీక్షించాల్సినఅవసరం ఉందని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ 'ఆర్గనైజర్', 'పాంచజన్య'పత్రికలకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సంస్థ అధినేత మోహన్ భాగవత్ పేర్కొన్న సంగతి విదితమే.
రాజకీయ స్వప్రయోజనాలకోసం దీనిని వాడుకున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనీశ్ పైవిధంగా స్పందించారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై వ్యతిరేకత వెల్లువెత్తిన నేపథ్యంలో ఆ సంస్థ వివరణ ఇచ్చింది. రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, అన్ని బలహీనవర్గాలకూ అవి అందాలన్నదే తమ ఉద్దేశమని తెలిపింది.