రిజర్వేషన్లపై మోహన్ భాగవత్ వ్యాఖ్యలను తప్పుబట్టిన రాహుల్
డామన్/కటక్: రిజర్వేషన్లను ఆర్‌ఆర్‌ఎస్ మొదట్నుంచీ సమర్థిస్తూ వస్తోందంటూ ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలోని డామన్ పట్టణంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారర్యాలీలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ ఇప్పుడేమో రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం కాదని భాగవత్ చెబుతున్నారు. మరి అప్పుడేమో తాను రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకినని ఘంటాపథంగా చెప్పేవారు.
రిజర్వేషన్లను వ్యతిరేకించే వాళ్లే బీజేపీతో చేరేవారు. వాళ్లకే బీజేపీ స్వాగతం పలికి అక్కున చేర్చుకుంది. తీరా ఎన్నికల వేళ ఇప్పుడొచ్చి మళ్లీ రిజర్వేషన్లకు మా మద్దతు అంటూ భాగవత్ కొత్త రాగం ఆలపిస్తున్నారు’’ అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈసారి ఎన్నికలు కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ మధ్య సైద్ధాంతిక పోరు. రాజ్యాంగ విత్తనం నుంచే దేశంలోని అనేక విభాగాలు ఉద్భవించాయి. పూర్వకాలంలో మాదిరి రాజ్యపాలన సాగించాలని మోదీజీ, ఆర్‌ఎస్‌ఎస్ ఆశ. వీటిని నాశనం చేసి ఆర్‌ఎస్–బీజేపీ రాజుల్లాగా దేశాన్ని పాలించాలనుకుంటున్నారు’’ అని ఆరోపించారు.
‘‘ ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ వాళ్లకు ఒకే దేశం, ఒకే భాష, ఒక్కడే నేత ఉండే వ్యవస్థ కావాలి. పశి్చమబెంగాల్ ప్రజలు బెంగాలీ మాట్లాడతారు. అలాగే గుజరాత్ వాళ్లు గుజరాతీ, తమిళులు తమిళమే మాట్లాడతారు. అలాంటపుడు ఒకే భాష, ఒకే నేత విధానంలో హేతుబద్ధత ఎక్కడుంది?’’ అని నిలదీశారు. ‘‘డయ్యూ డామన్, దాద్రా నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంత అడ్మిని్రస్టేటర్ పదవిలో మోదీ ప్రఫుల్ పటేల్‌ను ‘రాజు’లాగా నియమించారు. ప్రజాభీష్టంతో ప్రఫుల్‌కు పనిలేదు. ఆయన ఏమనుకున్నారో అదే చేస్తారు’’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment