తెలంగాణ ప్రకటనపై రెండో ఆలోచనే లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రభావం దీనిపై ఉండబోదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారి చెప్పారు.
తెలంగాణ ప్రకటనపై రెండో ఆలోచనే లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని కేంద్రం స్పష్టం చేసింది. త్వరలో జరిగే ఐదు రాష్ట్ర శాసన సభ ఎన్నికల ప్రభావం దీనిపై ఉండబోదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి మనీశ్ తివారి చెప్పారు. కాగా శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముందు తెలంగాణ నోట్ను చర్చకు పెట్టలేదు. కేబినెట్ సమావేశానంతరం వివరాలను మనీశ్ తివారి విలేకరులతో వెల్లడించారు. తెలంగాణపై కేబినెట్ నోట్ రూపొందించినట్టు కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం చెప్పిన సంగతి తెలిసిందే.
తెలంగాణపై ఓ ప్రశ్నకు సమాధానంగా తివారి.. సీమాంధ్ర ప్రాంతంలో భావోద్వేగాలు నెలకొన్నాయని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. తెలంగాణపై హోం శాఖ నోట్ తయారు చేసిందని, రాజకీయ ఆమోదం పొందాక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందన్నారు.