మనీష్ తివారీకి బెయిల్ మంజూరు
మనీష్ తివారీకి బెయిల్ మంజూరు
Published Mon, Apr 7 2014 3:00 PM | Last Updated on Fri, Jul 26 2019 5:53 PM
బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేంద్రమంత్రి మనీష్ తివారీకి ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎస్ఎస్ గులానే ఎదుట స్వయంగా హాజరై బెయిల్ పత్రాలను దాఖలు చేశారు. బెయిల్ పత్రాలను పరిశీలించిన మేజిస్టేట్.. 10 వేల రూపాయల వ్యక్తిగత పూచికత్తుతో తివారీకి బెయిల్ మంజూరు చేశారు. తివారీకి బెయిల్ ఇవ్వడంపై గడ్కరీ తరపు న్యాయవాది తీవ్రంగా వ్యతిరేకించారు.
తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మార్చి 7 తేదిన తివారీ వ్యాఖ్యలు చేశారని గడ్కరీ చేసిన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకుని నోటిసులు జారీ చేశారు. ఆదర్శ్ సొసైటీలో గడ్కరీకి బినామీ ఫ్లాట్ ఉందని తివారీ వ్యాఖ్యలు చేశారు. తీవారీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే రుజువు చేయాలని గడ్కరీ డిమాండ్ చేశారు. తివారీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆయనపై గడ్కరీ ఫిర్యాదు చేశారు.
Advertisement
Advertisement