న్యూఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్ను ఉపసంహరించాలని కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి మనీష్ తివారి తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్లోనూ బిల్లు ఉపసంహరణకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాప్వామ్యంలో ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని ప్రధాని చెప్పారని ఆయన వెల్లడించారు.
వివాదస్పద ఆర్డినెన్స్ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే వెనక్కుతగ్గుతారా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్నించింది.
'ఆర్డినెన్స్ ఉపసంహరణ కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం'
Published Wed, Oct 2 2013 7:20 PM | Last Updated on Fri, Sep 1 2017 11:17 PM
Advertisement
Advertisement